📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం

Madhusudan: స్థానిక వ్యాపారులు తమను తప్పుదారి పట్టించారు: మధుసూదన్ భార్య

Author Icon By Vanipushpa
Updated: April 24, 2025 • 4:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పర్యాటక స్వర్గధామం కశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి తీవ్ర విషాదాన్ని నింపింది. పహల్గాంలో జరిగిన ఈ కాల్పుల ఘటనలో కావలికి చెందిన మధుసూదన్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ఆయనతోనే ఉన్న భార్య, ఆ భయానక క్షణాలను, ఉగ్రవాదుల క్రూరత్వాన్ని కన్నీటిపర్యంతమవుతూ వివరించారు. మోదీ హయాంలో కశ్మీర్ సురక్షితంగా ఉంటుందనే నమ్మకంతోనే తాము విహారయాత్రకు వెళ్లామని, కానీ ఇంతటి దారుణం జరుగుతుందని ఊహించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
వాళ్ళు మమ్మల్ని మిస్‌గైడ్ చేసారు
మధుసూదన్ భార్య తెలిపిన వివరాల ప్రకారం… వారు మూడు కుటుంబాలకు చెందిన పది మంది పహల్గాం విహారయాత్రకు వెళ్లారు. స్థానికంగా ‘మినీ స్విట్జర్లాండ్’గా పిలిచే ప్రాంతానికి గుర్రాలపై వెళ్లి, భోజనం చేశారు. మధుసూదన్, ఆయన భార్య ఇద్దరూ భోజనం ముగించుకుని బయటకు వచ్చిన కొద్దిసేపటికే కాల్పుల శబ్దాలు వినిపించాయి. భయంతో వారు పరుగులు తీస్తుండగా, శాలువాలు అమ్మే కొందరు స్థానికులు వారిని అడ్డుకొని, అవి కేవలం కశ్మీరీ వార్షికోత్సవ వేడుకల శబ్దాలని, భయపడాల్సిన పనిలేదని చెప్పి తప్పుదోవ పట్టించినట్లు ఆమె తెలిపారు. “మేము పరిగెడుతుంటే వాళ్ళు మమ్మల్ని మిస్‌గైడ్ చేస్తూ.. అది కేవలం వేడుకలని, ఇక్కడే ఉండండి అన్నారు” అని ఆమె పేర్కొన్నారు.

చివరి మాటలను గుర్తుచేసుకుని రోదిస్తున్న భార్య
హోటల్ యజమాని హెచ్చరికతో పిల్లలు, కొందరు ముందుగానే పారిపోయారని, కానీ తాము పారిపోయేలోపే ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ దగ్గరకు వచ్చారని మధుసూదన్ భార్య వివరించారు. ఆ సమయంలో తన భర్త, “మనమిద్దరం ఇక్కడే పడుకుందాం, నువ్వు తల ఎత్తవద్దు” అని చెప్పినట్లు ఆమె గుర్తుచేసుకున్నారు. ఇద్దరూ చేతులు పట్టుకుని నేలపై పడుకుని ఉండగా, ఎవరో నడుచుకుంటూ వచ్చిన శబ్దం వినిపించిందని, వెంటనే ఒక పెద్ద పేలుడు శబ్దం (కాల్పుల శబ్దం) వినిపించిందని తెలిపారు. “ఆ షాట్‌కు ముందు ‘హిందూయే? ముస్లిమే?’ అని రెండు సార్లు అడిగారు. మేము ఏమీ స్పందించలేదు. వెంటనే షాట్ సౌండ్ వినిపించింది. నేను లేచి చూసేసరికి ఆయన ముఖం మొత్తం రక్తంతో నిండిపోయింది” అని చెబుతూ ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. తన దుస్తులు కూడా రక్తంతో తడిసిపోయాయని, ఆ షాట్ తమవైపే జరిగిందని అప్పుడు అర్థమైందని ఆమె వాపోయారు.
కొందరు తనను ఆర్మీ క్యాంప్ వద్దకు తీసుకెళ్లారు
తన భర్తను కాల్చిన తర్వాత, తాను కూడా బయటకు పరిగెత్తానని, ఎవరైనా రక్షించేవారు కనిపిస్తారేమోనని చూశానని, కానీ ఎవరూ కనిపించలేదని ఆమె తెలిపారు. అక్కడున్న కొందరు తనను ఆర్మీ క్యాంప్ వద్దకు తీసుకెళ్లారని చెప్పారు. ఉగ్రవాదులు అత్యంత క్రూరంగా ప్రవర్తించారని, తమ పక్కనే ఉన్న జైపూర్‌కు చెందిన దంపతులు తమ రెండేళ్ల చిన్నారిని చూపిస్తూ కాళ్లు పట్టుకుని వేడుకున్నా కనికరించకుండా కాల్చి చంపారని ఆమె వివరించారు. ”
“మోదీ పాలనలో కశ్మీర్ సురక్షితం అనుకునే వెళ్ళాం. కానీ మాకే ఇలా జరుగుతుందని ఊహించలేదు. మా నష్టాన్ని ఎవరు తీర్చగలరు?” అని ఆమె ప్రశ్నించారు. తమలాగే అనేక కుటుంబాలు బాధితులయ్యాయని, కొందరు పిల్లలకు తల్లిదండ్రులు చనిపోయిన విషయం కూడా తెలియని స్థితిలో ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు ఏ విధంగా సహాయం చేస్తుందోనని ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

Read Also: Abir Gulaal Movie: అబీర్‌ గులాల్‌ మూవీ పై కేంద్రం బ్యాన్!

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Local traders misled them Madhusudhan's wife Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.