📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

KL Rahul: తొలి టెస్ట్ మ్యాచ్‌ లో ఖచ్చితంగా గెలుస్తాం :రాహుల్‌

Author Icon By Anusha
Updated: June 24, 2025 • 1:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇంగ్లండ్‌ జట్టుతో లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లోని తొలి మ్యాచ్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. నాలుగో రోజు ఆట ముగిసిన అనంతరం టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul) మీడియాతో మాట్లాడాడు. ఈ మ్యాచ్‌లో చివరకు ఖచ్చితంగా ఫలితం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు.నాలుగో రోజు ఆట ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, భారత బౌలర్లు అద్భుతంగా రాణించి జట్టుకు విజయాన్ని అందిస్తారని ఆశాభావం వ్య‌క్తం చేశాడు. ఈ మ్యాచ్‌ అభిమానులకు గొప్ప వినోదాన్ని పంచుతుందని, చివరి రోజు ఆట ఉత్కంఠభరితంగా సాగుతుందని అన్నాడు.ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడం ఖాయమని రాహుల్ జోస్యం చెప్పాడు. “ఈ టెస్టు మ్యాచ్‌కి ఒక బ్లాక్‌బస్టర్ ముగింపు ఉంటుంది. ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఇంగ్లండ్ ఆటగాళ్లు (England players) కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. మా బౌలర్లు చివరి రోజు పది వికెట్లు పడగొట్టి టీమిండియాకు సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని అందిస్తారని నమ్ముతున్నాను” అని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.

భారీ స్కోరు 

భారత రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆయన 137 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా రిషభ్ పంత్ (115)తో కలిసి నాలుగో వికెట్‌కు 195 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరిద్దరి ప్రదర్శనతో టీమిండియా (Team India), ఇంగ్లండ్ ముందు 371 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.అలాగే గత కొంతకాలంగా జట్టులో తన బ్యాటింగ్ స్థానంపై ఉన్న సందిగ్ధత తొలగిపోయిందన్నాడు. విభిన్న బాధ్యతలు నిర్వర్తించడం సంతోషంగా ఉందని రాహుల్ పేర్కొన్నాడు. “గత రెండు సంవత్సరాలుగా బ్యాటింగ్ ఆర్డర్‌లో నా స్థానం ఏంటి? నాకు ఏది సౌకర్యంగా ఉంటుందో? అన్న విషయం నేను దాదాపు మర్చిపోయాను.

KL Rahul

నన్ను నేను సవాలు చేసుకోవడానికి

ఇప్పుడు నాకు వివిధ బాధ్యతలు, పాత్రలు ఇవ్వడం ఆనందంగా ఉంది. ఇది నాలో మరింత ఉత్సాహాన్ని నింపింది. నన్ను నేను సవాలు చేసుకోవడానికి, మరింత రాటుదేలడానికి ఇది దోహదపడింది. ఈ ప్రయాణాన్ని నేను ఎంతగానో ఆస్వాదిస్తున్నాను” అని కేఎల్ రాహుల్ తెలిపాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే, 371 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ (Wicket) నష్టపోకుండా 21 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 350 పరుగులు చేయాల్సి ఉంది. భార‌త్ గెల‌వాలంటే ప‌ది వికెట్లు ప‌డ‌గొట్టాలి. దీంతో చివరి రోజు ఆటపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Read Also: Sunil Gavaskar: సిరాజ్‌పై గవాస్కర్ వివాదాస్పద వ్యాఖ్యలు

#Headingley #INDvsENG #KLRahul #LeedsTest #TeamIndia Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.