US: ఖమేనీ ఆందోళన చెందాల్సిందే.. ట్రంప్ సీరియస్ వార్రింగ్ వార్నింగ్

Read Time:  1 min
US: అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కీలక పొలిటికల్ హామీ
US: అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కీలక పొలిటికల్ హామీ
FONT SIZE
GET APP

అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి వచ్చిన గట్టి హెచ్చరికతో అమెరికా, ఇరాన్ సంబంధాలు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ చాలా ఆందోళన చెందాలని, నిజంగా భయపడాల్సిందే అంటూ ట్రంప్(Trump) చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. అణు ఒప్పందంపై రాజీకి రాకపోతే చెడుఫలితాలు తప్పవు అని స్పష్టం చేయడంతో వాతావరణం మరింత వేడెక్కింది. అదే సమయంలో వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లీవిట్‌ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. చర్చలు విఫలమైతే బలప్రయోగానికి కూడా తమ దేశ అధ్యక్షుడు ట్రంప్‌ వెనుకాడబోరన్నారు. ఒమన్​తో చర్చల్లో ఇరాన్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకోవడం కోసం ట్రంప్‌ ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. అణురహిత ఇరాన్‌ డిమాండ్‌కు తాము కట్టుబడి ఉన్నామన్నారు. దౌత్యం సాధ్యం కాకపోతే ట్రంప్​నకు మరిన్ని ఎంపికలు ఉన్నాయని హెచ్చరించారు.

Read Also: Railway News: హోలీ పండుగకు రైల్వే శుభవార్త

US: ఖమేనీ ఆందోళన చెందాల్సిందే.. ట్రంప్ సీరియస్ వార్రింగ్ వార్నింగ్
US: ఖమేనీ ఆందోళన చెందాల్సిందే.. ట్రంప్ సీరియస్ వార్రింగ్ వార్నింగ్

షరతులతో అమెరికాతో చర్చలకు ఇరాన్ సిద్ధం

ఇదే సమయంలో ఇరాన్ కూడా షరతులతో అమెరికాతో చర్చలకు ముందుకొచ్చింది. మరిన్ని సైనిక దాడులను నివారించేందుకు చర్చలు జరపాలని తెహ్రాన్ నిర్ణయించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఈ సమావేశాలు ఒమాన్‌లో జరిగే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే ఇరాన్ అధికారిక వార్తా సంస్థలు కూడా దీనిని ధ్రువీకరించాయి. అమెరికా మాత్రం మాటలకే పరిమితం కాకుండా సైనికంగా ఒత్తిడి పెంచుతోంది. పశ్చిమాసియాలో భారీ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్, యుద్ధ విమానాలు, ఇతర సైనిక సామగ్రిని మోహరించడం ద్వారా ఇరాన్‌పై హెచ్చరికలు పంపుతోంది. చర్చలు విఫలమైతే బలప్రయోగం చేయడానికి కూడా వెనుకాడబోమన్న సంకేతాలు ఇస్తోంది. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా తన రక్షణ శక్తిని బలోపేతం చేస్తోంది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్షిపణి కేంద్రాన్ని సందర్శించిన ఇరాన్ సాయుధ దళాల చీఫ్ అబ్దొల్రహీమ్ మౌసవి, నిరోధక శక్తి గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. అంతేకాదు, ఇప్పటి వరకు రక్షణాత్మక విధానంలో ఉన్నామని, ఇకపై దాడి ధోరణికి మారామని కూడా ప్రకటించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.