📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Israel: ఇరాన్ కీలక సైనిక నాయకులు, అణు శాస్త్రవేత్తలు హతం!

Author Icon By Vanipushpa
Updated: June 13, 2025 • 11:44 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌(Israel) వైమానిక దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా(America) దాడులు చేయొద్దని హెచ్చరించినా ఇరాన్ అణు కర్మాగారం, సైనిక స్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్((Israel) దాడులు చేపట్టింది. ఆ భీకర దాడుల్లో ఇరాన్‌(Iran) రెవల్యూషనరీ గార్డ్​ చీఫ్‌, మిలిటరీ చీఫ్‌ మృతి చెందారు. ఇతర టాప్‌ అణు శాస్త్రవేత్తలు మరణించారు. సైన్యంలోని సీనియర్‌ జనరల్స్‌ కూడా ప్రాణాలు కోల్పోయారు.
కీలక సైనిక నాయకులు మృతి
ఈ మేరకు ఇరాన్​కు చెందిన మీడియా కథనాలు వెల్లడించాయి. ఐఆర్‌జీసీ హెడ్‌క్వార్టర్స్‌పై ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో మేజర్‌ జనరల్‌ హొస్సేన్‌ సలామీ చనిపోయినట్లు కథనాలు పేర్కొన్నాయి. ఇరాన్ మిలిటరీ చీఫ్ మహమ్మద్‌ బాఘేరి​ కూడా మరణించినట్లు చెప్పారు. వారితోపాటు రెవల్యూషనరీ గార్డ్‌లోని ఇతర ఉన్నత అధికారులు, అణు శాస్త్రవేత్తలు కూడా మరణించినట్లు వెల్లడించాయి.

Israel: ఇరాన్ కీలక సైనిక నాయకులు, అణు శాస్త్రవేత్తలు హతం!

ఇరాన్, ఇరాక్ యుద్ధంలో పోరాడి!
టెహ్రాన్‌లో జన్మించిన బాఘేరి, ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ కోర్‌లో చాలాకాలం పనిచేశారు. 2016లో ఇరాన్‌ ఆర్మీ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా బాధ్యతలు అందుకున్నారు. 1980లో ఐఆర్‌జీసీలో చేరి ఇరాన్‌- ఇరాక్‌ యుద్ధంలో పోరాడారు. అయితే బాఘేరి మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణలతో అమెరికా, కెనడా, యూకే, ఐరోపా సమాఖ్య ఆయనపై ఆంక్షలను విధించాయి.
మరోవైపు, ఇరాన్‌ కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత టెహ్రాన్‌పై ఇజ్రాయెల్‌ తొలుత దాడులు చేసింది. టెహ్రాన్ నగరంలో ఒక్కసారిగా పేలుళ్లు, పొగలు ప్రజలను భయపెట్టాయి. పలు ప్రాంతాల్లో దట్టమైన పొగలు ఆవరించాయి. క్షిపణుల దాడుల ధ్వని సమీప నగరాలకు వినిపించిందని నివేదికలు చెబుతున్నాయి. దాడుల్లో ఏయే ప్రాంతాలు దెబ్బతిన్నాయో స్పష్టంగా తెలియదు. ప్రాణనష్టం వివరాలు ఇంకా వెల్లడికావలసి ఉంది.

జెట్లు పలుమార్లు దాడులు చేసినట్లు ఇరాన్ మీడియా కథనాలు

ఆ తర్వాత శుక్రవారం ఉదయం రెండో దశ దాడులు ప్రారంభించినట్లు సమాచారం. ఇరాన్‌లోని న్యూక్లియర్‌ ప్లాంట్‌, సైనిక స్థావరాలే లక్ష్యంగా టెల్‌ అవీవ్‌ విరుచుకుపడుతోంది. యురేనియం శుద్ధి కేంద్రంపై ఇజ్రాయెల్‌కు చెందిన జెట్లు పలుమార్లు దాడులు చేసినట్లు ఇరాన్ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆ ప్రాంతంలో భారీఎత్తున పొగ కమ్ముకున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. నతాంజ్‌ ప్రాంతంలోని అణుకేంద్రం వద్ద తాజాగా మరోసారి పేలుళ్లు సంభవించినట్లు తెలుస్తోంది. అయితే ఇరాన్ గుండైపై దాడి చేశామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పగా, తమకు మరో అవకాశం లేదని ఆర్మీ చీఫ్​ అన్నారు. 2025 జూన్ 13 వ తేదీన పశ్చిమాసియా మళ్లీ భయాందోళనకు లోనైంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ టెహ్రాన్ నగరంపై భారీ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడులతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన పెరిగింది.

Read Also: Israel : ఇరాన్‌పై ఇజ్రాయెల్ భారీ పేలుళ్లు..

#telugu News and nuclear scientists killed! Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Key Iranian Latest News in Telugu military leaders Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.