📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

America War: అమెరికా కీలక యుద్ధ రహస్యాలు లీక్!

Author Icon By Vanipushpa
Updated: April 21, 2025 • 12:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికాకు చెందిన కీలక రహస్యాలు లీక్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల యెమెన్‌పై చేపట్టిన భీకర దాడులకు ముందే దీనికి సంబంధించిన ప్రణాళిక బహిర్గతం అయినట్లు కథనాలు వచ్చాయి. అయితే, ఈ క్రమంలోనే దీనికి సంబంధించి తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దాడులకు సంబంధించిన రహస్యాలను స్వయంగా అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ తన కుటుంబసభ్యులతో కూడా పంచుకున్నారట. తన ఫ్యామిలీ గ్రూప్‌చాట్‌లో దీని గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం ప్రచురించింది.

యెమెన్‌పై అమెరికా దాడులు
ఈ ఏడాది మార్చి 15న యెమెన్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దాడులను ప్రకటించారు. అయితే, అంతకంటే ముందే సిగ్నల్‌లోని ఓ గ్రూప్‌చాట్‌ ద్వారా ఈ యుద్ధ ప్రణాళిక బయటికి వచ్చినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అదే సమయంలో రక్షణ మంత్రి హెగ్సెత్‌ కూడా రెండో సిగ్నల్‌ చాట్‌ను ఉపయోగించి ఈ విషయాన్ని తమ కుటుంబసభ్యులు చెప్పినట్లు ఈ కథనం ప్రచురించింది. తన భార్య జెన్సిఫర్‌, సోదరుడు ఫిల్‌ హెగ్సెత్‌తో ఈ యుద్ధ ప్రణాళికలను పంచుకున్నట్లు వెల్లడించింది.
లీక్‌లపై ఎలాంటి చర్యలు లేవు
అంతకుముందు హెగ్సెత్‌, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ఇతర ముఖ్య అధికారులు ఉన్న సిగ్నల్‌ గ్రూప్‌ చాట్‌ నుంచి ఈ యుద్ధ ప్రణాళికలు బహిర్గతమయ్యాయి. ఈ చాట్‌లో ‘ద అట్లాంటిక్‌ మ్యాగజైన్’ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ జెఫ్రీ గోల్డ్‌బర్గ్‌ కూడా ఉన్నారు. యెమెన్‌పై దాడుల గురించి చర్చించడానికి రెండు రోజుల ముందే తనను ఆ గ్రూప్‌లో చేర్చాలని జెఫ్రీ కోరారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్‌ కూడా ధ్రువీకరించింది. ఈ లీక్‌లపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని హెగ్సెత్‌, ట్రంప్‌ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న వేళ మరో కథనం వెలువడటం మరింత ఆందోళనకరంగా మారింది. దీంతో రక్షణ మంత్రిని తొలగించాలని ప్రతిపక్ష డెమోక్రాట్లు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే, తాజా కథనాలపై పెంటగాన్‌, వైట్‌హౌస్‌ నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. హెగ్సెత్‌పై గతంలోనూ ఇలాంటి విమర్శలు వచ్చాయి. రక్షణ శాఖకు సంబంధించిన అధికారిక, రహస్య సమావేశాలకు భార్య, సోదరుడిని వెంటబెట్టుకునే వెళ్లేవారని ఆ మధ్య వార్తలు వచ్చాయి.
మరోవైపు, యెమెన్‌ రాజధాని సనాలో సోమవారం తెల్లవారుజామున అమెరికా వైమానిక దాడులు చేపట్టింది.

Read Also: కాల్పుల విరమణ.. దాడులు మాత్రం ఆగడం లేదు : జెలెన్‌స్కీ

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Key American war Latest News in Telugu Paper Telugu News secrets leaked! Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.