📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Kapil Dev: టెస్ట్ టీమ్ కెప్టెన్‌గా గిల్ సక్సెస్ అవుతాడన్న కపిల్ దేవ్

Author Icon By Anusha
Updated: June 19, 2025 • 11:08 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా నూతన టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పై దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇంగ్లండ్‌తో త్వరలో జరగబోయే ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను గిల్ సారథ్యంలోని టీమిండియా విజయం దిశగా నడిపిస్తాడని కపిల్ దేవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.భారత టెస్ట్ టీమ్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ సక్సెస్ అవుతాడని జోస్యం చెప్పాడు. ధోనీ, కోహ్లీ వల్ల కానిది శుభ్‌మన్ గిల్ సాధిస్తాడని, ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ సిరీస్‌ విజయాన్నందిస్తాడని తెలిపాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలకగా రవిచంద్రన్ అశ్విన్ మూడు ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఒకేసారి ముగ్గురు ఆటగాళ్లు తప్పుకోవడంతో భారత జట్టు సంధి దశను ఎదుర్కొంటుంది.రోహిత్ శర్మ వారసుడిగా శుభ్‌మన్ గిల్‌కు బీసీసీఐ సారథ్య బాధ్యతలు అప్పగించింది.

తొలి టెస్ట్

ఇంగ్లండ్ పర్యటనలోని ఐదు టెస్ట్‌ల సిరీస్‌తో శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ కెరీర్ ప్రారంభం కానుంది. లీడ్స్ వేదికగా శుక్రవారం నుంచి తొలి టెస్ట్ మొదలవ్వనుంది. ఈ సిరీస్‌తోనే డబ్ల్యూటీసీ 2027 ఎడిషన్‌కు తెరలేవనుంది.ఈ క్రమంలోనే ఓ కార్యక్రమంలో పాల్గొన్న కపిల్ దేవ్, శుభ్‌మన్ గిల్‌ను అనుభవం లేని ఆటగాడిగా చూడవద్దన్నాడు. శుభ్‌మన్ గిల్ ప్రతిభావంతమైన కుర్రాడు. ప్రస్తుతం అతను టీమిండియా కెప్టెన్. అతను ఖచ్చితంగా టైటిల్‌తో తిరిగొస్తాడు. ఈ విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుత భారత జట్టును చూసి మేం గర్వపడుతున్నాం.

అనుభవం కలిగిన

వారికి బెస్టాఫ్ లక్. వారు పూర్తి సామర్థ్యంతో ఆడి మళ్లీ విజయాల బాట పడుతారని నేను ఆశిస్తున్నా.శుభ్‌మన్ గిల్‌‌ను అనుభవం లేని ఆటగాడిగా చూడవద్దు. ఈ రోజు అనుభవం లేకపోవచ్చు. కానీ రేపు అనుభవం కలిగిన ఆటగాళ్లు మారుతారు. ఈ జట్టుపై నాకు పూర్తి నమ్మకం ఉంది. వారు ఏదైనా ప్రత్యేకంగా చేస్తారు. ఆటగాళ్లకు నేను చెప్పేది ఒక్కటే వెళ్లండి మీ ఆటను మీరు స్వేచ్ఛగా ఆడండి. బాగా ఆస్వాదించండి. భారత జట్టు (Indian team) కు నేను చెప్పేది ఇదే.’అని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు.

Kapil Dev

టీమిండియా

టీమిండియా చివరిసారిగా 2007లో ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచింది. రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) సారథ్యంలో గెలిచిన టీమిండియా ఆ తర్వాత 2014, 2018, 2022 పర్యటనల్లో విజయాన్నందుకోలేకపోయింది. అజిత్ వాడేకర్ సారథ్యంలో 1971లో తొలిసారి ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచిన టీమిండియా మళ్లీ కపిల్ దేవ్ (Kapil Dev) సారథ్యంలో 1986లో గెలుపొందింది. 

కోహ్లీ రిటైర్మెంట్‌

ఈ క్రమంలోనే శుభ్‌మన్ గిల్ (Shubman Gill) సారథ్యంలో టెస్ట్ సిరీస్ గెలిచి 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలనే కసితో యంగ్ ఇండియా ఉంది. అశ్విన్, రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్‌తో సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, ధ్రువ్ జురెల్, కరుణ్ నాయర్‌లకు అవకాశం దక్కింది. రవీంద్ర జడేజా (Ravindra Jadeja), జస్‌ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్‌ల రూపంలో సీనియర్ ఆటగాళ్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు.

Read Also: ICC Womens T20 World Cup 2026: మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్ విడుదల

#KapilDev #ShubmanGill #TeamIndia #TestCaptainGill Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.