📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Jyothi Malhotra: సమాచారం లీక్ చేసినందుకు జ్యోతి మల్హోత్రాకి ఎంత ఇచ్చారంటే..?

Author Icon By Vanipushpa
Updated: May 20, 2025 • 11:44 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతదేశపు యూట్యూబర్ అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ జ్యోతి మల్హోత్రా(Jyothi Malhotra)ని ప్రస్తుతం వివాదాలు చుట్టుముట్టాయి. ఆమె యూట్యూబ్ కంటెంట్(Youtube Content) పై వార్తల్లో నిలవలేదు కానీ ఆమెపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. వీటిని నిజంగా ఎవరు అంత ఈజీగా నమ్మలేరు కూడా. అవును, హర్యానాలోని హిసార్ నివాసి అయిన జ్యోతి మల్హోత్రా ఒక పాకిస్తానీ గూఢచారి (Pakistan) (ISI స్పై ఏజెంట్). భారతదేశ నిఘా సమాచారాన్ని పాకిస్తాన్ (పాకిస్తాన్ ISI)కి ఇచ్చినందుకు జ్యోతి(Jyothi) ఎంత డబ్బు సంపాదించింది, ఈ మొత్తం కోట్లలో ఉంటుందా అని అంచనాలు వ్యక్తం అవుతున్నాయి…

Jyothi Malhotra: సమాచారం లీక్ చేసినందుకు జ్యోతి మల్హోత్రాకి ఎంత ఇచ్చారంటే..?

జ్యోతి లగ్జరీ లైఫ్ స్టయిల్
అసలు విషయం ఏంటంటే హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు తర్వాత ఓ ప్రశ్న ఇప్పుడు అందరికి తట్టుతుంది. అన్నింటికంటే పాకిస్తాన్ నిఘా సంస్థ ISI ఒక గూఢచారికి స్పై చేసినందుకు ఎంత డబ్బు చెల్లిస్తుంది..? అసలు జ్యోతి మల్హోత్రా లగ్జరీ లైఫ్ స్టయిల్ సోషల్ మీడియాలో హై లెట్ కావడం వల్లే ఈ ప్రశ్న మొదలైంది.
జ్యోతి మల్హోత్రా గురించి ఇప్పటివరకు వెలువడిన సమాచారం ప్రకారం, 2020 సంవత్సరం వరకు జ్యోతి ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసేది. ఉద్యోగం పోగొట్టుకున్న తర్వాత యూట్యూబర్‌గా మారింది. ఈ సమయంలో జ్యోతికి పాకిస్తాన్ గూఢచారులతో పరిచయం ఏర్పడింది అలాగే నిఘా సమాచారాన్ని లీక్ చేయడం ప్రారంభించింది.
గూఢచర్యం కోసం ISI ఎంత ఇస్తుంది
గూఢచర్యం కోసం ISI ఎంత డబ్బు చెల్లిస్తుందంటే : రిపోర్ట్స్ ప్రకారం ISI మొదట ప్రదేశానికి ప్రాధాన్యత ఇస్తుంది. అంటే, నిఘా సమాచారాన్ని ఎక్కడి నుండి సేకరించారో దాని ప్రకారం డబ్బు నిర్ణయిస్తుంది. ఉదాహరణకు థాయిలాండ్, మయన్మార్ వంటి దేశాలకు తక్కువ డబ్బు ఇస్తారు. అలాగే భారతదేశం, అమెరికా వంటి దేశాల నుండి నిఘా సమాచారాన్ని సేకరించేందుకు ISI ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తుంది. అంటే ఈ దేశాలలో పనిచేసే ఏజెంట్లకు ISI ఎక్కువ డబ్బు చెల్లిస్తుంది. గూఢచారులకు డబ్బు ఇవ్వడానికి ISIకి బడ్జెట్ కేటాయింపులు కూడా ఉంటాయి. పాకిస్తాన్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఇందుకు 5 బిలియన్లు కేటాయిస్తుంది. అంటే మన దేశ రూపాయి ప్రకారం 50 లక్షలు. ఐఎస్ఐ ఈ డబ్బును ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి ఇంకా గూఢచారులకు ఇవ్వడానికి ఉపయోగిస్తుంది. నివేదిక ప్రకారం, ప్రస్తుతం ISI కింద 4 వేల మంది ఉద్యోగులు ఉన్నారు.
పెద్ద సమాచారానికి 10 వేలు
పంజాబ్ పోలీసులు ఫిబ్రవరి 2025లో అమృత్‌సర్‌లో ఓ ISI ఏజెంట్‌ను అరెస్టు చేశారు. అరెస్టు తర్వాత అమృత్‌సర్ గ్రామీణ SSP విలేకరుల సమావేశం నిర్వహించారు. చిన్న సమాచారానికి ఐఎస్ఐ 5 వేలు, పెద్ద సమాచారానికి 10 వేలు ఇస్తుందని ఎస్ఎస్పీ తెలిపారు. 2011లో ఒక అమెరికన్ అధికారి పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేస్తూ పట్టుబడ్డాడు. గూఢచర్యం కోసం పాకిస్తాన్ తనకు రూ. 3 కోట్లు ఇచ్చిందని ఆ అధికారి వెల్లడించాడు. దీని బట్టి చూస్తే పాకిస్తాన్ నిఘా సంస్థ గూఢచారులకు వారి ప్రదేశం ఇంకా సమాచారం ఆధారంగా డబ్బు చెల్లిస్తుంది.

Read Also: Russia and ukraine war : రష్యా, ఉక్రెయిన్ శాంతి చర్చలకు ట్రంప్ కృషి

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Jyoti Malhotra Latest News in Telugu paid for leaking information? Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.