📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం

US Indian Student: అమెరికా వీసా రద్దు కేసులో భారతీయ విద్యార్థికి న్యాయం

Author Icon By Vanipushpa
Updated: April 16, 2025 • 12:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కఠిన వలస విధానాలను అవలంభిస్తున్నారు. అనేక మంది అక్రమ వలసదారులను బలవంతంగా ఇంటికి పంపిస్తూనే.. మరెంతో మంది విద్యార్థి వీసాలను రద్దు చేస్తున్నారు. ఇలా ఓ భారతీయ విద్యార్థి వీసా రద్దు కాగా.. అతడు అక్కడి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఈక్రమంలోనే విచారణ చేపట్టిన న్యాయస్థానం ట్రంప్ సర్కారును తప్పు పట్టింది. ముఖ్యంగా విద్యార్థి వీసాను రద్దు చేయకుండా, అతడిని నిర్బంధించకుండా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.
న్యాయపోరాటం – విద్యార్థి కోర్టును ఆశ్రయించాడు
21 ఏళ్ల వయసు కల్గిన భారతీయ విద్యార్థి క్రిష్‌లాల్ ఐసర్ దాసానీ ప్రస్తుతం అమెరికాలోని విస్కాన్సిన్ మాడిసన్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. అయితే వచ్చే నెలలోనే అతడి గ్రాడ్యుయేషన్ పూర్తి కాబోతుంది. అయితే పూర్తిగా చదువుపైనే ధ్యాస పెట్టిన ఇతడికి.. ఏప్రిల్ 4వ తేదీన ఓ షాకింగ్ విషయం తెలిసింది. ముఖ్యంగా అతడి వీసా రద్దు అయినట్లు గుర్తించాడు. స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్స్ ప్రోగ్రామ్ (SEVIS) డేటాబేస్ లో అతడి వివరాలను తొలగించగా.. దాన్ని చూసాడు. దీంతో తీవ్ర ఆందోళన చెందిన క్రిష్‌లాల్ ఐసర్ దాసానీ.. వెంటనే స్థానిక కోర్టును ఆశ్రయించారు.
కోర్టు తీర్పు – ట్రంప్ సర్కారుపై తీవ్ర వ్యాఖ్యలు
అక్కడే తన వీసా రద్దుకు సంబంధించిన ఎలాంటి హెచ్చరికలను సర్కారు జారీ చేయలేదని న్యాయస్థానానికి విన్నవించారు. వివరణ ఇచ్చేందుకు కానీ, తప్పు చేసుంటే దాన్ని సరిదిద్దు కోవడానికి కానీ ప్రభుత్వం ఎలాంటి అవకాశం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. మరో నెలలోనే తన చదువు కూడా పూర్తవుతుందని వివరించారు. ఇదంతా విన్న న్యాయస్థానం ట్రంప్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా చెప్పాపెట్టకుండా వీసా రద్దు చేయడం సరికాదని తెలిపింది. అలాగే భారతీయ విద్యార్థి క్రిష్‌లాల్ ఐసర్ దాసానీని బహిష్కరించకుండా ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా వీసా రద్దు చేయకుండా, అతడిని నిర్బంధించకుండా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
విద్యార్థి స్పందన – ఊపిరి పీల్చుకున్న క్రిష్‌లాల్
దీంతో సదరు విద్యార్థి హర్షం వ్యక్తం చేశారు. వీసా రద్దు అయిందని తెలిసిన వెంటనే తన చదువు ఆగిపోతుందని తీవ్రంగా భయపడ్డానని.. కానీ కోర్టు సాయంతో సమస్య తీరిపోయిందని క్రిష్ లాల్ ఐసర్ దాసానీ అక్కడి మీడియాతో మాట్లాడుతూ వివరించారు. ఇదిలా ఉండగా.. ఎఫ్-1 వీసా అనేది నాన్ ఇమిగ్రెంట్ వీసా. అనేక దేశాల నుంచి విద్యార్థులు అమెరికాకు ఇదే వీసాపై వెళ్తుంటారు. ఏటా రెండు సార్లు అక్కడి విద్యా సంస్థలు ప్రవేశాలను అనుమతిస్తుండగా.. ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్యే భారతీయ విద్యార్థులు ఎక్కువగా వెళ్తుంటారు. అయితే వీటిపై ఇటీవల ట్రంప్ సర్కారు తీవ్ర ఆంక్షలు విధించింది. F-1 వీసా అనేది నాన్-ఇమిగ్రెంట్ స్టూడెంట్ వీసా, దీనిద్వారా విదేశీయులు అమెరికాలో చదువుతారు. ప్రతి ఏడాది భారతీయులు సహా అనేక దేశాల విద్యార్థులు ఈ వీసాతో అగస్టు-డిసెంబర్ మధ్య అమెరికాకు వెళ్తారు. ట్రంప్ సర్కారు F-1 వీసాలపై కఠిన ఆంక్షలు, అకస్మాత్తుగా వీసాల రద్దు వంటి చర్యలు తీసుకుంటూ వస్తోంది. ఈ కేసు ద్వారా విద్యార్థులకు న్యాయ పరిరక్షణ ఎలా లభించవచ్చో స్పష్టమైంది.

Read Also: America: వీసా రద్దును సవాల్‌ చేస్తూ కోర్టును ఆశ్రయించిన విదేశీ విద్యార్థులు

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu in US visa cancellation case Justice for Indian studen Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.