📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pahalgam Attack: పహల్గాం దాడిలో తృటిలో బయటపడ్డ జడ్జిలు, ఎమ్మెల్యేలు

Author Icon By Vanipushpa
Updated: April 23, 2025 • 2:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జమ్ము కశ్మీర్ పర్యటనలో ఉన్న కేరళకు చెందిన పలువురు ప్రముఖులు నిన్న పహల్గాంలో జరిగిన ఘోర ఉగ్రవాద దాడి నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. కేరళ హైకోర్టు న్యాయమూర్తులు, శాసనసభ్యులతో కూడిన ఈ బృందం సురక్షితంగా ఉన్నట్లు కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.
ఈ బృందం మొత్తం శ్రీనగర్‌లో క్షేమంగా వుంది
వివరాల్లోకి వెళితే, కేరళ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిల్ కే నరేంద్రన్, జస్టిస్ పీజీ అజిత్ కుమార్, జస్టిస్ జి. గిరీష్‌తో పాటు ఎమ్మెల్యేలు ముకేశ్‌, కేపీఏ మజీద్, టి. సిద్ధిక్‌, కె. అన్నాలన్ ఇటీవల జమ్మూకశ్మీర్ పర్యటనకు వెళ్లారు. పహల్గాం సమీపంలో ఉగ్రవాదులు పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సమయంలో వీరు ఆ ప్రాంతానికి సమీపంలోనే ఉన్నారు. అదృష్టవశాత్తూ వీరికి ఎలాంటి అపాయం జరగలేదు. ప్రస్తుతం ఈ బృందం మొత్తం శ్రీనగర్‌లో క్షేమంగా ఉందని, వారిని సురక్షితంగా కేరళకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సీఎంఓ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

రామచంద్రన్ కుటుంబాన్ని ఆదుకుంటాం
అయితే, దురదృష్టవశాత్తు ఇదే దాడిలో కేరళలోని కొచ్చి ఎడపల్లికి చెందిన పర్యాటకుడు ఎన్. రామచంద్రన్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రామచంద్రన్ మృతి పట్ల సంతాపం తెలిపిన ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులను అన్ని విధాలా ఆదుకుంటామని, వారిని సురక్షితంగా స్వస్థలానికి చేర్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. పహల్గాం సమీపంలోని బైసరన్ లోయ వద్ద సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు పర్యాటకులే లక్ష్యంగా ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి.

Read Also: KCR: ఉగ్రదాడిపై కేసీఆర్, కేటీఆర్, కవిత దిగ్భ్రాంతి వ్యక్తం

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Judges and MLAs who have been exposed Latest News in Telugu Pahalgam Attack Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.