📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Joe Root: సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేసిన జో రూట్

Author Icon By Anusha
Updated: June 22, 2025 • 2:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇండియా vs ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్‌లో రెండో రోజు ఆట ఉత్కంఠ భరితంగా కొనసాగింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులకే ఆలౌట్ కాగా, ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ ఆరంభించింది. ఈ రోజు కీలక ఘట్టం – భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) మరోసారి జో రూట్‌ను ఔట్ చేయడం.బుమ్రా చేతిలో రూట్‌కు టెస్ట్ క్రికెట్‌లో 10వ సారి అవుట్ కావడం విశేషం.జో రూట్ తన ఈ చిన్న ఇన్నింగ్స్‌లో కూడా సచిన్ టెండూల్కర్ కీలక రికార్డును బ్రేక్ చేశాడు.భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులకే పరమితమైంది. అయితే జట్టు స్కోరు 500 పరుగులు దాటుతుందని అంతా భావించారు. శుభ్‌మన్ గిల్(147) వికెట్ తర్వాత బ్యాటర్లందరూ 41 పరుగులలోపు ఔట్ అయ్యారు. ఒకానొక దశలో స్కోరు 430/3గా ఉండగా మొత్తం జట్టు 471 పరుగుల వద్ద కుప్పకూలింది. జస్ప్రీత్ బుమ్రా మొదటి ఓవర్లోనే వికెట్ తీయడం ద్వారా గొప్ప ఆరంభం ఇచ్చినప్పటికీ ఆ తర్వాత బెన్ డకెట్ (Ben Duckett) , ఓలి పోప్ మధ్య 122 పరుగుల భాగస్వామ్యం నెలకొంది.

సచిన్ టెండూల్కర్

బెన్ డకెట్(62) ఔట్ అయిన తర్వాత జో రూట్ క్రీజులోకి వచ్చాడు.ఓలి పోప్, జో రూట్ మధ్య 80 పరుగుల భాగస్వామ్యం ఉంది. రెండో రోజు ఆట ముగిసేలోపు 47వ ఓవర్ రెండో బంతికి పోప్ తన సెంచరీని పూర్తి చేశాడు. మరుసటి బంతికే జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ జో రూట్ క్యాచ్ ఔట్ అయ్యాడు. జో రూట్ (Joe Root) 58 బంతుల్లో 28 పరుగులు చేశాడు. జో రూట్ భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లాండ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అయితే అంతకు ముందు ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ టెండూల్కర్ చివరిసారిగా 2011లో ఇంగ్లాండ్‌లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు.సచిన్ టెండూల్కర్ ఇంగ్లాండ్‌లో 17 మ్యాచ్‌ల్లో 30 ఇన్నింగ్స్‌ల్లో 1575 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. జో రూట్ గురించి చెప్పాలంటే అతను ఈ మ్యాచ్ లో 2 పరుగులు చేసిన వెంటనే సచిన్‌ (Sachin Tendulkar) ను వెనక్కి నెట్టాడు.

Joe Root

వాతావరణ నివేదిక

ఇప్పుడు జో రూట్ ఇంగ్లాండ్‌‌లో భారత్‌పై 1602 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.లీడ్స్‌లో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో మూడో రోజు భారత బౌలర్లు తిరిగి పునరాగమనం చేసే అవకాశం ఉంది. వాతావరణ నివేదిక ప్రకారం, తేలికపాటి వర్షం, మేఘావృతమైన వాతావరణం (weather) ఉంటుందని భావిస్తున్నారు, అటువంటి పరిస్థితిలో బంతి స్వింగ్ అవుతుంది. భారత బౌలర్లు దానిని సద్వినియోగం చేసుకోవచ్చు. ఆదివారం ఇలాంటి వాతావరణం కారణంగానే టీమిండియా వికెట్లు పడిపోయాయి. ప్రస్తుతం ఇంగ్లాండ్ స్కోరు 209/3 కాగా వారు 262 పరుగులు వెనకబడి ఉన్నారు. ఓలి పోప్(100), హ్యారీ బ్రూక్(00) మూడో రోజు ఆటను ప్రారంభించనున్నారు.

Read Also: TRA: ప్రారంభమైన తెలంగాణ షూటింగ్‌ టోర్నీ

#BumrahVsRoot #INDvsENG #JaspritBumrah #JoeRoot #SachinTendulkar Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.