📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

Jinping: హార్వర్డ్‌లో చదువుతూ రహస్యంగా జీవిస్తున్న జిన్‌పింగ్ కుమార్తె!

Author Icon By Vanipushpa
Updated: May 30, 2025 • 4:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా(America)లోని చైనీయుల వీసాలను రద్దు చేసేందుకు తాము సన్నద్ధం అవుతున్నట్లు ఇప్పటికే యూఎస్ విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో(Marco Rubio) ప్రకటించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న అమెరికాలో ఉంటున్న చైనా విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈక్రమంలోనే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్(Jinping) కుమార్తె జి మింగ్జి కూడా అక్కడే ఉన్నట్లు యూఎస్ రాజకీయ కార్యకర్త లారా లూమర్ తలిపారు. ఆమె హార్వర్డ్‌లో చదువుతూ మసాచుసెట్స్‌లో రహస్యంగా జీవిస్తోందని అన్నారు. దీంతో ఇప్పుడు ఆమెను కూడా అమెరికా బహిష్కరిస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

Jinping: హార్వర్డ్‌లో చదువుతూ రహస్యంగా జీవిస్తున్న జిన్‌పింగ్ కుమార్తె

అమెరికాలో చదువుతున్న చైనా విద్యార్థుల్లో కొందరి వీసాలు రద్దు చేయనున్నట్లు మార్కో రూబియో ప్రకటించారు. వారిలో చైనా కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలు ఉన్న వారు కూడా ఉన్నారని చెప్పారు. అయితే దీనిపై స్పందించిన చైనా మాత్రం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ఆదేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ దీనిపై స్పందించారు. యూఎస్ చర్య పూర్తి రాజకీయ ప్రేరేపితమైనదని అన్నారు. జాతీయ భద్రత ముసుగులో అమెరికా భావజాలాన్ని ఆయుధంగా ఉపయోగిస్తుందని చెప్పుకొచ్చారు. ఇలాంటి సమయంలోనే అమెరికాకు చెందిన రాజకీయ కార్యకర్త లారా లూమర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జిన్‌పింగ్ కుమార్తేనా ఎక్కడ ఉన్నారు?
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కుమార్తె జి మింగ్జి మసాచుసెట్స్‌లో నివసిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే మింగ్జిని మీడియా ముందుకు తీసుకు వస్తానని కూడా వెల్లడించారు. అంతేకాకుండా ఆమె తండ్రి విధానాల గురించి కూడా మింగ్జిని ప్రశ్నిస్తానని తెలిపారు. అలాగే కమ్యూనిస్టులు తమ దేశానికి చెందిన వారు కాదని వెల్లడించారు. ఈమె చేసిన వ్యాఖ్యలతో జి మింగ్జి వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈక్రమంలోనే ఈమె ఎవరు, నిజంగానే జిన్‌పింగ్ కుమార్తేనా, అసలు ఆమె ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు వంటివి తెలుసుకునేందుకు ప్రజలంతా ఆసక్తి కనబరుస్తున్నారు.
ఈమె జీవితం అత్యంత రహస్యంగా సాగుతోంది
చైనా అద్యక్షుడు షీ జిన్ పింగ్ కుమార్తె జి మింగ్జి. అయితే ముందు నుంచే ఈమె జీవితం అత్యంత రహస్యంగా సాగుతోంది. చైనాలోని బిజియాంగ్ యూనివర్సిటిలో చదువుకున్న ఈమె ఆ తర్వాత వేరే పేరుతో అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో సైకాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్లు కూడా సమాచారం. అయితే దీని తర్వాత ఆమె తిరిగి చైనాకు వెళ్లిపోగా.. తన చదువును తిరిగి కొనసాగించేందుకు ఇటీవలే హార్వర్డ్ కు వచ్చినట్లు పలు వార్తా కథనాలు వెల్లడిస్తున్నాయి. కానీ చైనా అధికారులు మాత్రం జి మింగ్జి ఎక్కడున్నారు, ఏం చదువుతున్నారు వంటి విషయాలను ఎప్పుడూ రహస్యంగానే ఉంచుతూ వస్తోంది. కానీ లూమర్ చెప్పిన విధంగా ఆమె నిజంగానే ప్రభుత్వ భద్రత నడుమ మసాచుసెట్స్‌లో ఉంటున్నట్లు పలు కథనాలు వెల్లడిస్తున్నాయి.

Read Also: Athletics Championships: అథ్లెటిక్స్‌ లో భారత్ పసిడి పథకాలు

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Harvard is living in secret Jinping's daughter Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today while studying at

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.