📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Jeff Bezos: ఘనంగా పెళ్లి చేసుకున్న అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్

Author Icon By Anusha
Updated: June 28, 2025 • 10:48 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన, అమెజాన్ సంస్థ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మళ్లీ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. 61 ఏళ్ల వయసులో బెజోస్ తన ప్రియురాలు లారెన్ శాంచెజ్తో వివాహం చేసుకున్నారు. ఈ అద్భుతమైన పెళ్లి వేడుక ఇటలీ దేశంలోని అతి ప్రసిద్ధ నగరం వెనిస్‌లోని లాగూన్ ఐలాండ్‌లో వైభవంగా జరిగింది.ఇటలీలోని పురాతన నగరంలో జరిగిన ఈ వివాహం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.శుక్రవారం వీరి పెళ్లి వేడుక కనుల పండుగలా సాగింది.వివాహ వేడుకలో తీసిన తొలి ఫోటో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోను 55 ఏళ్ల లారెన్ శాంచెజ్ (Lauren Sanchez) తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. బెజోస్‌తో పెళ్లి తర్వాత ఈ ఇన్‌స్టా పేజీ పేరును లారెన్ శాంచెజ్ బెజోస్‌గా మార్చుకున్నారు. ఈ ఫోటోలో నూతన దంపతులు చాలా సంతోషంగా కనిపించారు. లారెన్ శాంచెజ్ తెలుపు రంగు గౌనులో మెరిసిపోయారు. బెజోస్ నలుపు రంగు సూట్ ధరించి హుందాగా కనిపించారు. ఈ జంట పెళ్లి వేడుకకు కొద్దిమంది అతిథులు మాత్రమే హాజరయ్యారు.

గత కొంతకాలంగా

సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకకు హాజరైనట్లు తెలుస్తోంది. వెనిస్ అందాలను ప్రతిబింబించేలా ఈ వేడుకను ఏర్పాటు చేశారు.బెజోస్ – లారెన్ పెళ్లికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కుమార్తె ఇవాంకా, ఆమె భర్త జారెడ్ కుష్నెర్, ప్రముఖ జర్నలిస్ట్ ఓప్రా విన్‌ఫ్రే, కిమ్ కర్దాషియన్, కోలే కర్దాషియన్, జోర్డాన్ రాణి రనియా తదితరులు ఈ వివాహ వేడుకకు హాజరు అయ్యారు. ఇదిలా ఉండగా, బెజోస్, లారెన్ గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. వీరి బంధం 2019లో బయటకు వచ్చింది. అప్పటి నుంచి వీరిద్దరూ కలిసి అనేక పర్యటనలు, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గత ఏడాది వీరి నిశ్చితార్థం జరిగినట్లు వార్తలు వచ్చాయి.

Jeff Bezos:

విడాకుల సెటిల్మెంట్

ఈ సందర్భంగా 2.5 మిలియన్ డాలర్ల విలువైన వజ్రాల ఉంగరాన్ని అమెజాన్ అధిపతి ఆమెకు బహూకరించినట్లు కథనాలు వచ్చాయి. ఈ జంటకు ఉన్న స్నేహితులు, సన్నిహితుల నుంచి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.జెఫ్ బెజోస్ గతంలో మెకంజీ స్కాట్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరు దాదాపు 25 సంవత్సరాలు కలిసి ఉన్నారు. వారిద్దరికీ నలుగురు పిల్లలు ఉన్నారు. 2019లో వీరు విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో బెజోస్ తన ఆస్తుల్లో కొంత భాగాన్ని మెకంజీ (Mackenzie Scott) కి భరణంగా ఇచ్చారు. ఈ విడాకుల సెటిల్మెంట్ ప్రపంచ చరిత్రలో అతిపెద్ద సెటిల్మెంట్లలో ఒకటిగా నిలిచింది. మెకంజీకి 38 బిలియన్ డాలర్ల విలువైన అమెజాన్ షేర్లు వచ్చాయి. విడాకుల తర్వాత మెకంజీ గొప్ప దాతగా మారారు. ఆమె తన సంపదలో ఎక్కువ భాగాన్ని దాతృత్వ కార్యక్రమాలకు విరాళంగా ఇస్తూ వస్తున్నారు. లారెన్ శాంచెజ్ కూడా ఇంతకు ముందు పెళ్లి చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆమె గతంలో జర్నలిస్టుగానూ పని చేశారు.

Read Also: Donald Trump: అమెరికా అధ్యక్ష పదవి అత్యంత ప్రమాదకరమైనదన్న డొనాల్డ్ ట్రంప్

#BezosMarriage #JeffBezos #JeffBezosWedding #LaurenSanchez Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.