ప్రపంచంలోని ధనికుల్లో ఒకరైన, అమెజాన్ సంస్థ వ్యవస్థాపకుడు(Amezon Founder) జెఫ్ బెజోస్(Jeff Bezos) 61ఏళ్ల వయసులో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. ఆయన ప్రియురాలు, మాజీ న్యూస్ యాంకర్ అయిన లారెన్ శాంచెజ్(Lauren sanchez) ను పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహ వేడుక ఇటలీ యొక్క ప్రముఖ పర్యాటక ప్రాంతమైన వెనిస్(venis)లో, శుక్రవారం మధ్యాహ్నం జరిగినది. లాగూన్ ఐలాండ్‌లో అట్టహాసంగా, కళ్లు చెదిరే రీతిలో ఈ వేడుక జరిగింది.
వివాహ వేడుకలో హాజరైన ప్రపంచ ప్రముఖులు
ఈ ప్రత్యేక సందర్భానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్నులు, సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. ప్రముఖులు, హై-సొసైటీ గెస్ట్‌ల మధ్య జరిగిన ఈ పెళ్లి వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
వెనిస్ నగరాన్ని ఈ వేడుక ఒక పండుగ వాతావరణంగా మార్చేసింది.
పెళ్లి వేడుకకు ఎదురు ప్రతిస్పందన: నిరసనలతో హోరెత్తిన వెనిస్
వెదుక అంత అట్టహాసంగా సాగుతుండగానే, మరోవైపు నిరసనలతో వెనిస్ నగరం హోరెత్తింది.
“రాజులు వద్దు, బెజోస్ వద్దు” అంటూ ఆకుపచ్చ నియాన్ లైట్ల ద్వారా మెసేజ్ ప్రొజెక్ట్ చేశారు.
అదే విధంగా, “సంపన్నులపై పన్ను విధించండి” అంటూ కాలువల పక్కన ప్లకార్డులు ప్రదర్శించడంతో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ నిరసనలు ఆర్థిక అసమానతలు, సంపన్నుల అధిక ఖర్చులపై ప్రజల్లో ఉన్న అసహనాన్ని బయటపెట్టాయి.
సామాజిక సందేశం: పెళ్లికి ఆర్థిక విరుద్ధధ్వని
ఈ పెళ్లి ఒక వైపు ఘనంగా జరిగినా, మరోవైపు సమాజంలో ఉన్న వర్గ విభజన, ధనిక-పేద మధ్య అంతరంపై గట్టిగా చర్చను రేపింది. వెనిస్ వాసులు, ఆందోళనకారులు తమ అభిప్రాయాలను సృజనాత్మకంగా తెలియజేశారు. 61 ఏళ్ల వయసులో తన ప్రియురాలు మాజీ న్యూస్ యాంకర్ లారెన్ శాంచెజ్ ను పెళ్లి చేసుకున్నారు. ఇటలీలోని సుందరనగరమైన వెనిస్‌లో గల లాగూన్ ఐలాండ్‌లో శుక్రవారం మధ్యాహ్నం అట్టహాసంగా ఈ వేడుక జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్నులు, ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.
Read Also: Donald Trump: అమెరికా అధ్యక్ష పదవి అత్యంత ప్రమాదకరమైనదన్న డొనాల్డ్ ట్రంప్