📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

JD Vance :భారత్ పర్యటనకు రానున్న జేడీ వాన్స్ దంపతులు

Author Icon By Anusha
Updated: April 17, 2025 • 5:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారతదేశ పర్యటన ఖరారైంది. సతీమణి ఉషా వాన్స్ తో కలిసి ఇటలీ, భారత్‌లను సందర్శించనున్నారు.అమెరికా ఉపాధ్యక్ష కార్యాలయం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత జేడీ వాన్స్ భారత్‌కు రావడం ఇదే తొలిసారి. ఆయన సతీమణి ఉషా వాన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారనే విషయం తెలిసిందే.ఉష తల్లిదండ్రులు ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. విద్యాభ్యాస సమయంలో ఉష, జేడీ వాన్స్ ఒకరినొకరు ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. ఈ కారణంగా, జేడీ వాన్స్ భారత్‌కు అల్లుడయ్యారు.

ఉపాధ్యక్షుడి స్థాయిలో మొదటి పర్యటన ఇదే

ఏప్రిల్ 18వ తేదీ నుంచి 24వ తేదీన వరకు వారి పర్యటన కొనసాగనుంది. అలాగే ఆయన ఇటలీలోనూ పర్యటించనున్నారు. ఈ మేరకు అమెరికా ఉపాధ్యక్ష కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అయితే ఉపాధ్యక్ష పదవి చేపట్టిన అనంతరం జేడీ వాన్స్‌ భారత్‌కు రావడం ఇదే మొదటిసారి.ఇటలీ, భారత్‌ పర్యటనల్లో భాగంగా ఆయా దేశాధినేతలతో జేడీ వాన్స్ వాణిజ్య, భౌగోళిక రాజకీయ అంశాలపై చర్చలు జరపనున్నట్లు అమెరికా ఉపాధ్యక్ష కార్యాలయం బుధవారం వెల్లడించింది. అదే సమయంలో భారత పర్యటనలో భాగంగా జేడీ వాన్స్‌ దంపతులు దిల్లీ, జైపుర్‌, ఆగ్రాను సందర్శించనున్నారు. ఆయా చారిత్రక ప్రదేశాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కూడా కానున్నారు.

తనదైన ముద్ర

జేడీ వాన్స్ భారత పర్యటన రాజకీయంగానే కాకుండా, వ్యక్తిగత కుటుంబపరంగా కూడా ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. ఉష వాన్స్ భారతీయ మూలాలు కలిగి ఉండటంతో, ఈ పర్యటన మరింత ఆసక్తికరంగా మారనుంది.అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రముఖ రాజకీయవేత్త రచయిత.న్యాయవాది మెరైన్ కార్ప్స్ అనుభవజ్ఞుడు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనలో యునైటెడ్ స్టేట్స్ యొక్క 50వ ఉపాధ్యక్షుడిగా 2025 నుండి సేవలందిస్తున్నారు.రాజకీయంగా కూడా ఆయన తనదైన ముద్ర వేశారు.భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల వాన్స్ ప్రత్యేక ఆసక్తి కలిగి ఉన్నారు.ఉషా చిలుకూరి పూర్వీకులది ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పామర్రుకి దగ్గర్లోని ఓ గ్రామం. ఆమె అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగమ్మాయి. ఉష తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మి 1970ల్లో అమెరికాకు వలస వెళ్లిపోయారు. ఆ తర్వాత యేల్‌ లా స్కూల్‌లో ఉషా, జేడీ వాన్స్‌ తొలిసారి కలుసుకున్నారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి 2014లో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు.

Read Also: Jerome Powell: ట్రంప్ టారిఫ్‌లతో అగాథంలోకి అమెరికా: జెరొమ్ పావెల్

#IndianHeritage #IndiaVisit #JDVance #JDVanceInIndia #TeluguConnect #USVicePresident Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.