📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Jasprit Bumrah: బుమ్రా , గంభీర్ మధ్య వాగ్వాదం.. కారణం ఏంటో తెలుసా?

Author Icon By Anusha
Updated: June 22, 2025 • 5:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అనేక ఊహాగానాలు

టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, నూతన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫొటో ఈ ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నదని నెటిజన్లు విశ్లేషిస్తున్నారు. ఈ ఫొటోలో బుమ్రా, గంభీర్ (Gambhir) ఇద్దరూ డ్రెస్సింగ్ రూమ్‌లో ముఖాముఖి ఆగ్రహంగా మాట్లాడుతున్నట్టు కనిపిస్తుండటంతో, ఈ ఘటనపై అనేక ఊహాగానాలు ప్రారంభమయ్యాయి.ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ రెండో రోజు ఆట చివరి సెషన్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అర్థమవుతుంది. బౌలింగ్ ప్రణాళికలు, ఫీల్డ్ ప్లేస్‌మెంట్స్ విషయంలో బుమ్రా-గంభీర్ వాగ్వాదానికి దిగినట్లు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

తొలి ఇన్నింగ్స్‌

కొందరేమో గిల్ కెప్టెన్సీ బాలేదని, గంభీర్‌కు బుమ్రా ఫిర్యాదు చేశాడని అంటున్నారు. భారత బౌలర్లలో బుమ్రా ఒక్కడే మూడు వికెట్లు తీసాడు. అతనికి ఇతర బౌలర్ల నుంచి ఏ మాత్రం సహకారం లభించలేదు. బుమ్రా (Jasprit Bumrah) బౌలింగ్‌ను ఓపికగా ఆడిన ఇంగ్లండ్ బ్యాటర్లు సిరాజ్, శార్దూల్, ప్రసిధ్ కృష్ణలపై విరుచుకుపడ్డారు. దాంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో 3 వికెట్లకు 209 పరుగులు చేసింది. భారత్ కంటే ఇంగ్లండ్ 262 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజులో ఓలీ పోప్(100 బ్యాటింగ్)తో పాటు హ్యార్రీ బ్రూక్(0 బ్యాటింగ్) ఉన్నారు.రెండో రోజు ఆట చివరి ఓవర్‌లో హైడ్రామా చోటు చేసుకుంది.

విశేషం

బుమ్రా వేసిన ఈ ఓవర్‌ నాలుగో బంతికి హ్యారీ బ్రూక్ మిడ్ వికెట్‌లో క్యాచ్ ఇచ్చాడు. ఈ క్యాచ్‌ను సిరాజ్ అద్భుతంగా అందుకున్నాడు. దాంతో బ్రూక్ డకౌట్‌గా పెవిలియన్ బాట పట్టాడు. కానీ అంపైర్ ఆ బంతిని నోబాల్‌గా ప్రకటించడంతో బ్రూక్ తిరిగి క్రీజులోకి వచ్చాడు. ఈ ఓవర్‌లో బుమ్రా మూడు నోబాల్స్ వేయడం విశేషం. ఇతర బౌలర్ల వైఫల్యంతో పాటు ఈజీ క్యాచ్‌లను వదిలేయడం టీమిండియాకు నష్టం చేసింది. బుమ్రా బౌలింగ్‌లో బెన్ (Ben) డకెట్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను జైస్వాల్, జడేజా వదిలేయగా అతను హాఫ్ సెంచరీతో రాణించాడు. చివరకు అతన్ని బుమ్రానే క్లీన్ బౌల్డ్ చేశాడు. ఓలీ పోప్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను స్లిప్‌లో జైస్వాల్ వదిలేసాడు. ఈ క్యాచ్‌లు అందుకొని ఉంటే ఇంగ్లండ్ మరన్ని వికెట్లు కోల్పోయేది.

Jasprit Bumrah

సెంచరీలతో

అంతకుముందు 359/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్‌ (India)మొదటి ఇన్నింగ్స్‌లో 471 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్(178 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్‌లతో 134), శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) (227 బంతుల్లో 19 ఫోర్లు, సిక్స్‌తో 147), యశస్వి జైస్వాల్(159 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్‌తో 101) సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్(4/86), బెన్ స్టోక్స్(4/66) నాలుగేసి వికెట్లు తీయగా,బ్రైడన్ కార్స్ ఓ వికెట్ పడగొట్టాడు.

Read Also: Joe Root: సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేసిన జో రూట్

#BumrahVsGambhir #GautamGambhir #JaspritBumrah #TeamIndia Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.