📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

IND vs ENG: ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో చరిత్ర సృష్టించిన బుమ్రా

Author Icon By Anusha
Updated: June 22, 2025 • 8:30 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తన బౌలింగ్ ప్రతిభతో చరిత్రను తిరగరాశాడు. టెస్టు క్రికెట్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన సిరీస్‌లలో ఒకటైన ఇండియా-ఇంగ్లండ్ సిరీస్‌లో భాగంగా బుమ్రా ఒక ఘనమైన మైలురాయిని అందుకున్నాడు.సెనా(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆసియా బౌలర్‌ (Asian bowler) గా నిలిచాడు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో జాక్ క్రాలీ, బెన్ డకెట్‌లను ఔట్ చేయడం ద్వారా బుమ్రా ఈ ఫీట్ సాధించాడు. ఈ క్రమంలో అతను పాకిస్థాన్ దిగ్గజ పేసర్ వసీమ్ అక్రమ్ (Wasim Akram) రికార్డ్‌ను బద్దలు కొట్టాడు.సేనా దేశాల్లో బుమ్రా ఇప్పటి వరకు 147 వికెట్లు తీసాడు.దాంతో వసీం అక్రమ్( 146 వికెట్లు)ను అధిగమించాడు.

తాజా మ్యాచ్‌లో

ఈ జాబితాలో బుమ్రా, వసీమ్ అక్రమ్‌ తర్వాత అనిల్ కుంబ్లే(141), ఇషాంత్ శర్మ(130)లు ఉన్నారు. ఆస్ట్రేలియాపై 12 మ్యాచ్‌ల్లో 64 వికెట్లు తీసిన బుమ్రా (Jasprit Bumrah) ఇంగ్లండ్‌పై 10 మ్యాచ్‌ల్లో 39, న్యూజిలాండ్‌పై 2 మ్యాచ్‌ల్లో 6, సౌతాఫ్రికాపై 8 మ్యాచ్‌ల్లో 38 వికెట్లు పడగొట్టాడు.లీడ్స్ వేదికగా జరుగుతున్న తాజా మ్యాచ్‌లో బుమ్రా ఒక్కడే రెండు వికెట్లు తీసాడు. అతని బౌలింగ్‌లో రెండు సునాయస క్యాచ్‌లను జడేజా (Jadeja) , యశస్వి జైస్వాల్‌ వదిలేసారు. బుమ్రా బౌలింగ్‌కు తడబడిన ఇంగ్లండ్ బ్యాటర్లు మిగతా బౌలర్లను స్వేచ్చగా ఆడుతున్నారు.దాంతో ఇంగ్లండ్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది.

IND vs ENG

ఓవర్‌నైట్ స్కోర్‌

అంతకుముందు 359/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్‌,మొదటి ఇన్నింగ్స్‌లో 471 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్(178 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్‌లతో 134), శుభ్‌మన్ గిల్(227 బంతుల్లో 19 ఫోర్లు, సిక్స్‌తో 147), యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) (159 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్‌తో 101) సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్(4/86), బెన్ స్టోక్స్(4/66) నాలుగేసి వికెట్లు తీయగా బ్రైడన్ కార్స్ ఓ వికెట్ పడగొట్టాడు.

Read Also: Navjot Singh Sidhu : ఇంగ్లాండ్ మాజీ సారథిపై సిద్ధూ విమర్శలు

#BumrahMagic #IndianCricket #JaspritBumrah #TeamIndia Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.