📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Japan: భారత్​పై జపాన్ నిపుణుల ప్రశంసలు- పాకిస్థాన్​కు చురకలు!

Author Icon By Vanipushpa
Updated: May 23, 2025 • 2:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పహల్గాం(Pahalgam) ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్(Bharath) చేపట్టిన ఆపరేషన్ సిందూర్​(Operation Sindoor) ను జపాన్ వ్యూహాత్మక నిపుణులు సతోరు నాగావ్ ప్రశంసించారు. బాధ్యతాయుతమైన, సరైన ప్రతిస్పందనగా వర్ణించారు. పాకిస్థాన్ (Pakistan) ఉగ్రవాదానికి ఇస్తున్న మద్దతును ఖండించారు. ఏప్రిల్ 22వ తేదీన పహల్గాం(Pahalgam)లో జరిగిన ఉగ్రదాడిని భయంకరమైదని అన్నారు. ఈ మేరకు జాతీయా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు వ్యాఖ్యలు చేశారు.
ఉగ్రవాదానికి ఇస్లామాబాదా మద్దతు ఇస్తున్నది
భారత్ ఉగ్రవాదంతో బాధపడుతోందని, పాకిస్థాన్ మద్దతు ఇస్తుందని ఉద్ఘాటించారు. ఉగ్రవాదానికి ఇస్లామాబాదా మద్దతు ఇవ్వడం సుదీర్ఘం కాలంగా ఉందని గుర్తుచేశారు. పహల్గాం ఉగ్రదాడి చాలా దారుణమమని అన్నారు. చనిపోయిన తన భర్త పక్కన ఓ మహిళ కూర్చుని ఉన్న చిత్రం చూసి భావోద్వేగపరంగా కదిలిపోయామని చెప్పారు. కాబట్టి పాక్​కు గుణపాఠం చెప్పాలని, ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించాలని తెలిపారు.

Japan: భారత్​పై జపాన్ నిపుణుల ప్రశంసలు- పాకిస్థాన్​కు చురకలు!

ప్రపంచానికి ఉగ్రవాదంతో ముప్పు
“నేను వ్యక్తిగతంగా భారత్​కు మద్దతు ఇస్తున్నాను. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న పాకిస్థాన్ అది తప్పు అని తెలుసుకోవడం లేదు. ఉగ్రవాదం చాలా ప్రమాదకరమైనది. భారత్​కు మాత్రమే కాదు ఇతర దేశాలకు కూడా ఆ ముప్పు ఉంది. అది విషాదకరమైన పరిస్థితి” అని తెలిపారు. మే 7న పాక్, పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నందుకు భారత్​ ప్రశంసించారు. శిక్షకు మంచి ఉదాహరణ అని అన్నారు. ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం ప్రమాదకర వ్యూహమని పాకిస్తాన్ తెలుసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
పహల్గాం దాడిని తీవ్రంగా ఖండించిన హిరోస్ హిరోమి
“ప్రపంచంలోని ప్రజలు పాకిస్థాన్​ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తోందని అర్థం చేసుకోవడం ప్రారంభించారు. ఉగ్రవాదం ఒక సమస్య. కానీ అదే సమయంలో ఇప్పటికీ చాలా మంది ఉగ్రవాదం ప్రపంచ వ్యవహారం కాదు. ప్రాంతీయ సమస్య అని నమ్ముతారు. ఉగ్రవాదులను అణచివేయడం నిజానికి ప్రాంతీయ సమస్య కాదు, ఇది ప్రపంచ సమస్య” అని నాగావో అన్నారు. మరోవైపు, పహల్గాం దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కిందాయ్ విశ్వవిద్యాలయంలోని పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ హిరోస్ హిరోమి తెలిపారు.
జపాన్​లో పర్యటించిన అఖిలపక్ష దౌత్య బృందం
అయితే పాకిస్థాన్‌ సీమాంతర ఉగ్రవాదంపై తాము జరుపుతున్న పోరు గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు భారత్‌ మొత్తం ఏడు అఖిలపక్ష దౌత్య బృందాలను ఏర్పాటు చేసింది. ఆ బృందాలు 33 దేశాల్లో పర్యటిస్తున్నాయి. తాజాగా సంజయ్ కుమార్ ఝా నేతృత్వంలోని అఖిలపక్ష దౌత్య బృందం జపాన్​లో పర్యటించింది. అందులో సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ, బీజీపీ ఎంపీలు హేమాంగ్ జోషి, అపరాజిత సారంగి, బ్రిజ్ లాల్, ప్రధాన్ బారుహ్ ఉన్నారు. వారంతా జపాన్​తోపాటు ఇండోనేసియా, మలేసియా, దక్షిణ కొరియా, సింగపూర్​ వెళ్లనున్నారు.

Read Also: Palestine: పాలస్తీనా కోసం వారిని చంపాను ..ఇజ్రాయెల్ హత్యల నిందితుడు

#telugu News Ap News in Telugu Breaking News in Telugu cheers to Pakistan! Google News in Telugu Japanese experts Latest News in Telugu Paper Telugu News praise India Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.