టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విశ్వవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. తన ఆత్మవిశ్వాసం, పట్టుదల, అద్భుత బ్యాటింగ్ సామర్థ్యంతో కోహ్లీ ప్రపంచ క్రికెట్‌ను ఆకర్షించడమే కాదు, ప్రత్యర్థుల నుంచి కూడా ప్రశంసలు పొందుతున్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌కు చెందిన దిగ్గజ పేస్ బౌలర్ జేమ్స్ అండర్సన్ కోహ్లీపై భారీగా ప్రశంసలు కురిపించడం అందరినీ ఆకట్టుకుంటోంది.ఇంగ్లండ్ మాజీ పేసర్ జేమ్స్ అండర్సన్, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అండర్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.విరాట్ కోహ్లీ (Virat Kohli) అత్యుత్తమ బ్యాటర్ అని కితాబిచ్చాడు. అతనితో పోటీని ఆస్వాదించానని చెప్పాడు. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కంటే విరాట్ కోహ్లీకి బౌలింగ్ చేయడమే కష్టమని అభిప్రాయపడ్డాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అండర్సన్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
ఆధిపత్యం
సచిన్ కంటే విరాట్ కోహ్లీకి బౌలింగ్ చేయడంలోనే తాను సవాల్‌ను ఎదుర్కొన్నట్లు చెప్పాడు.2014లో తొలి ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా విరాట్ కోహ్లీ తడబడ్డాడు. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ బలహీతను బయటపెట్టుకున్నాడు. దాంతో ఆ బలహీతనను ఉపయోగించుకొని అతనిపై ఆధిపత్యం చలాయించాను. కానీ 2018 పర్యటనలో విరాట్ కోహ్లీ ఆ బలహీనతను అధిగమించాడు. ఆ సమయంలో అతను భిన్నమైన ఆటగాడిగా కనిపించాడు. నాతో పాటు మా బౌలర్లందరిపై పైచేయి సాధించాడు.విరాట్ కోహ్లీతో పోలిస్తే సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) భిన్నమైన ఆటగాడు. అతను గొప్ప బ్యాటర్. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉంటాడు.
తొలి పేసర్
కానీ విరాట్ ఢీ అంటే ఢీ అంటాడు. భావోద్వేగాలను నియంత్రించుకోలేడు. అతనితో పోటీపడడాన్ని ఆస్వాదిస్తాను. కోహ్లీలో ఉన్న పోటీతత్వం, పరిస్థితులకు అనుగుణంగా తన ఆటను మార్చుకునే సామర్థ్యం అతన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి.’అని అండర్సన్ చెప్పుకొచ్చాడు.188 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన జేమ్స్ అండర్సన్ (James Anderson) 704 వికెట్లు తీసాడు. 700 వికెట్ల మైలురాయి అందుకున్న తొలి పేసర్‌గా చరిత్రకెక్కాడు. 32 సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్న అండర్సన్ 3 సార్లు 10 వికెట్ల ఘనతను సాధించాడు. గతేడాదే అండర్సన్ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇటీవలే విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Read Also: T20 Cricket : ఉత్కంఠభరిత పోరులో చివరకు నెదర్లాండ్స్ విజయం