📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

India: కాల్పుల విరమణ వెనుక అసలు కథను వెల్లడించిన జైశంకర్

Author Icon By Vanipushpa
Updated: June 11, 2025 • 11:23 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్(Pakistan) పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్(Operatopn Sindoor) జోరుగా సాగుతోంది. మరో రెండు, మూడు రోజులు ఆగితే పాకిస్తాన్ మెడలు వంచేందుకు అద్భుతమైన అవకాశం లభించింది. అయితే భారత్(Bharath) అనూహ్యంగా పాకిస్తాన్ తో కాల్పుల విరమణ ప్రకటించేసింది. దీనిపై స్వదేశంలో విమర్శలు కూడా వచ్చాయి. అయినా కేంద్రం మాత్రం సీజ్ ఫైర్ వైపే మొగ్గు చూపింది. ఆ తర్వాత సీజ్ ఫైర్ కు దారి తీసిన కారణాల్ని ఒక్కొక్కటిగా కేంద్రం బయటపెడుతూనే ఉంది.
పొలిటికోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన జైశంకర్
ఇదే క్రమంలో తాజాగా అమెరికన్ వెబ్ సైట్ పొలిటికోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మన విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ పాకిస్తాన్ తో సీజ్ ఫైర్ కు దారి తీసిన అసలు కారణాన్ని వెల్లడించారు. మే10వ తేదీన ఒకే ఒక కారణంతో ఆపరేషన్ సింధూర్ ఆపేసినట్లు ఆయన తెలిపారు. 10వ తేదీ ఉదయం తాము ఎనిమిది ప్రధాన పాకిస్తానీ వైమానిక స్థావరాలపై దాడి చేసి ధ్వంసం చేశామన్నారు. దీంతో పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చిందన్నారు. అప్పుడు సీజ్ ఫైర్ కు అంగీకరించినట్లు తెలిపారు.

Jaiskhankar: కాల్పుల విరమణ వెనుక అసలు కథను వెల్లడించిన జైశంకర్

ఉగ్రవాద గ్రూపులకు ఆశ్రయం కల్పించడంలో పాకిస్తాన్ పాత్రపై స్పందిస్తూ.. ముప్పును తొలగించడానికి అవసరమైతే ప్రత్యక్ష సైనిక చర్య తీసుకోవడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. వారు ఎక్కడ ఉన్నారనేది తమకు ముఖ్యం కాదని, వారు పాకిస్తాన్‌లో మూలన దాక్కుంటే అక్కడికి వెళ్లేందుకు కూడా సిద్ధమన్నారు. తద్వారా ఉగ్రవాదాన్ని మూలాల్లోకి వెళ్లి మరీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు జైశంకర్ వెల్లడించారు.

ఉగ్రవాదంపై భారత్ కఠిన ధోరణి

జైశంకర్ మాట్లాడుతూ, “ఉగ్రవాదాన్ని అరికట్టడానికి అవసరమైతే ప్రత్యక్ష సైనిక చర్య తీసుకోవడానికి భారత్ సిద్ధంగా ఉంది. ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా, అవసరమైతే పాకిస్తాన్‌లోకే వెళ్లి కూడా వారిని ఎదుర్కొనగలమన్న నిబద్ధత ఉంది,” అని అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని తమ విధానంగా వాడుకోవడంలో ఆరితేరిపోయిన దేశమని, అదే అసలు సమస్య కూడా అని జైశంకర్ తెలిపారు. బ్రస్సెల్స్ పర్యటన సందర్భంగా అమెరికా వెబ్ సైట్ పొలిటికోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాలు యుద్ధం అంచుకు రావడానికి దారితీసిన పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయా అన్న ప్రశ్నకు స్పందిస్తూ…ఉగ్రవాదంపై నిబద్ధతను ఉద్రిక్తతగా భావిస్తే అది కచ్చితంగా తప్పదన్నారు.

పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని తమ విధానంగా వాడుతోంది – జైశంకర్ ఆగ్రహం
పాకిస్తాన్ ఉగ్రవాద గ్రూపులకు ఆశ్రయం కల్పించడం, వాటిని తమ వ్యూహాత్మక ఆయుధంగా వాడుకోవడం పెద్ద సమస్యగా మారిందని జైశంకర్ స్పష్టం చేశారు. ఇదే అసలు సమస్య అని, ఉగ్రవాదాన్ని నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఉగ్రవాదంపై భారత్ నిబద్ధతపై స్పష్టత
ఇంటర్వ్యూలో “ఇపుడు కూడా రెండు దేశాలు యుద్ధ అంచుకే వచ్చాయా?” అనే ప్రశ్నకు జైశంకర్ స్పందిస్తూ – “ఉగ్రవాదంపై చూపుతున్న నిబద్ధతను ఉద్రిక్తతగా భావిస్తే, అది తప్పే,” అని వ్యాఖ్యానించారు. ఇది భారత్ యొక్క స్పష్టమైన దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. కాల్పుల విరమణ నిర్ణయంపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం దీని వెనుక ఉన్న వ్యూహాత్మక కారణాలను ఒక్కొక్కటిగా వెలుగులోకి తెస్తోంది. ఇదే సందర్భంలో విదేశాంగ మంత్రి జైశంకర్ తాజా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

Read Also: Errol Musk: పుతిన్‌ ని ప్రశంసించిన ఎలాన్‌ మస్క్‌ తండ్రి

#Jaishankar #telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News reasons for ceasefire shares Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.