Pahalgam Attack: జైశంకర్, పాక్ ప్రధానికి మార్కో రుబియో సూచనలు

Read Time:  1 min
Pahalgam Attack: జైశంకర్, పాక్ ప్రధానికి మార్కో రుబియో సూచనలు
FONT SIZE
GET APP

ఇండియా, పాకి’స్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న సమయంలో అమెరికా రంగంలోకి దిగింది. ఇరు దేశాలూ ఉద్రిక్తతలను తగ్గించుకోవాలంటూ పిలుపునిచ్చింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌లతో బుదశారం విడివిడిగా ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కశ్మీర్‌లో జరిగిన దాడిపై విచారణకు పాకిస్తాన్ సహకరించాలని సూచించారు. ఉగ్రవాదం వ్యతిరేకంగా భారత్ చేసే పోరాటానికి సహకరించే అంకితభావాన్ని పునరుద్ఘాటించారు. అయితే, డొనాల్డ్ ట్రంప్ కశ్మీర్ వివాదం భారత్ పాకిస్థాన్‌ల మధ్య 1000 నుంచి 1500 ఏళ్లుగా కొనసాగుతోందని చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.

ప్రతీకార

పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిపట్ల ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. భారత్‌కు ఉగ్రవాదం పై పోరాటంలో అమెరికా మద్దతు ఉంటుంది తెలిపారు. అయితే, ఉగ్రదాడి వెనుకు పాకిస్థాన్ హస్తం ఉందని భావిస్తోన్న భారత్ ప్రతీకార దాడి చేయాలన్న ఆలోచనకు బదులు జాగ్రత్తగా వ్యవహరించాల సూచించారు, దీనికి జైశంకర్ స్పందిస్తూ ‘దాడిలో పాత్రధారులు సూత్రధారులు, మద్దతుదారులు న్యాయస్థానంలో నిలబడాల్సిందే దోషులు శిక్ష ఎదుర్కోవాల్సిందే’ అని జైశంకర్ ఎక్స్ (ట్విట్టర్) ద్వారా వెల్లడించారు.

 
Pahalgam  Attack: జైశంకర్, పాక్ ప్రధానికి మార్కో రుబియో సూచనలు

ఖండించారు

ఏప్రిల్ 22న కశ్మీర్‌లో జరిగిన దాడిని పాకిస్థాన్ ఖండించాలని రుబియో కోరారు. దాడిపై నిష్పక్షపాత విచారణకు పూర్తిగా సహకరించాలని స్పష్టం చేశారు. భారత్‌తో కలిసి ఉద్రిక్తతలు తగ్గించుకోవడానికి, నేరుగా సంభాషణలను పునరుద్ధరించి, దక్షిణ ఆసియాలో శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నించాలని సూచించారు. ‘ఈ అమానుష దాడి విషయంలో పాకిస్థానీ అధికారుల సహకారం చాలా అవసరం’ అని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి టామీ బ్రూస్ చెప్పారు.పహల్గామ్ దాడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌లు తీవ్రంగా ఖండించారు. చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడానికి అమెరికాను భారత్ కీలక భాగస్వామిగా భావిస్తోంది. అందుకే భారత్‌కి అగ్రరాజ్యం మద్దతు పుష్కలంగా ఉంది. కానీ, పాకిస్థాన్‌పై బహిరంగ విమర్శలకు దిగకుండా. నెమ్మదిగా ఉద్రిక్తతలను తగ్గించాలన్న దిశగా అమెరికా ప్రోత్సహిస్తోంది. ఒకప్పుడు అమెరికాకు పాక్ మిత్ర దేశం అయినా 2021లో అఫ్గన్ నుంచి నాటో బలగాలు వెనక్కు వెళ్లిన తర్వాత దాని ప్రాధాన్యత తగ్గింది.

Read Also: Caste Census: కుల గణనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ పై రాహుల్ గాంధీ సూచనలు

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.