📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Italy: ఇటలీ ఖైదీలు తమ భార్యలతో ఇక ఏకాంతంగా గడపొచ్చు

Author Icon By Vanipushpa
Updated: April 19, 2025 • 1:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటలీప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారి జైల్లో ఖైదీలకు ‘ఏకాంత గదుల’ను అందుబాటులోకి తెచ్చింది. ములాఖత్‌ సమయంలో తమ భాగస్వాములతో ఖైదీలు ఈ గదుల్లో ఏకాంతంగా గడపొచ్చు. ఖైదీలు తమ భాగస్వాములను ప్రైవేటుగా కలుసుకునే హక్కు ఉందని అక్కడి న్యాయస్థానం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది.
ఉత్తర ఇటలీలోని అస్టి కారాగారంలో ఉన్న ఓ ఖైదీ తాను మానసికంగా ఎంతో కుంగిపోయి ఉన్నానని, తన భార్యతో శారీరకంగా కలిసేందుకు అనుమతించాలంటూ కోర్టులో పిటిషన్‌ వేశాడు. అయితే అతని పిటిషన్‌ తిరస్కరణకు గురైంది. దీంతో అతను ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అక్కడ అతనికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఖైదీలు తమ భాగస్వాములను ప్రైవేటుగా కలుసుకునే హక్కు ఉందని న్యాయస్థానం తీర్పు చెప్పింది. వాటిని అడ్డుకోవాలని చూడొద్దని జైళ్ల శాఖను ఆదేశించింది. యూరోపియన్ దేశాల్లో చాలా వరకూ ఖైదీల కోసం ఏకాంత గదులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది.

కీలక మార్గదర్శకాలు జారీ
కోర్టు తీర్పుతో ఆ దేశ న్యాయ మంత్రిత్వ శాఖ గత వారం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఖైదీలను తమ భాగస్వాములతో ఏకాంతంగా గడిపేందుకు అనుమతించాలని పేర్కొంది. అంతేకాదు, సదరు గదిలో మంచం, టాయిలెట్‌ వంటి సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఖైదీలు తమ భాగస్వాములతో ఏకాంతంగా గడిపేందుకు రెండు గంటలు సమయం ఇవ్వాలని పేర్కొంది.
ఖైదీలు తరచూ బలవన్మరణాలకు పాల్పడుతున్నారు
ఇటలీ వ్యాప్తంగా జైళ్లలో 62 వేల కంటే ఎక్కువ మంది ఖైదీలు ఉన్నారు. ఇది జైళ్ల సామర్థ్యం కంటే 21 శాతం ఎక్కువ. అంతేకాదు తరచూ ఖైదీలు బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవలే పెరిగిపోయాయి. అందుకు మానసిక ఒత్తిడే కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఖైదీల మానసిక పరిస్థితిని అర్థం చేసుకున్న కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పుతో శుక్రవారం నుంచి ఖైదీల కోసం మొట్టమొదటి ‘సెక్స్‌ రూమ్‌’ ప్రారంభమైంది. సెంట్రల్ ఉంబ్రియా ప్రాంతంలోని జైలులో ఓ ఖైదీని అధికారులుఏ ‘సెక్స్‌ రూమ్‌’కు అనుమతించారు.

Read Also: US Supreme: వెనిజులా వలసదారుల బహిష్కరణపై సుప్రీంకోర్టు బ్రేక్

#telugu News Ap News in Telugu Breaking News in Telugu can now spend time alone Google News in Telugu Italian prisoners Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today with their wives

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.