ఇజ్రాయెల్- ఇరాన్(Israel-Iran) యుద్ధం పీక్స్ కు చేరింది. మూడు రోజులుగా సాగుతున్న ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ అతలాకుతలం అవుతోంది. ఇరాన్ కు చెందిన కీలక సైన్యాధికారులు, అణు శాస్త్రవేత్తలు మృతి చెందారు. ఇరాన్ లోని టెహ్రాన్(Tehran) లక్ష్యంగా యుద్ధ విమానాలు, మిస్సైల్స్ తో ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇరాన్ లోని చమురు శుద్ధి కేంద్రాలు, సహజ వాయువు నిక్షేపాలను ఇజ్రాయెల్ క్షిపణులు ధ్వంసం చేశాయి. ఈ మేరకు కాంగన్ లోని సౌత్ పోర్ట్ సిటీ వద్ద గల సౌత్ పార్స్ చమురు శుద్ధి కేంద్రం పూర్తిగా ధ్వంసం అయింది.
అయితే ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ వెన్నులో వణుకు మొదలైంది. ముస్లిం దేశాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ క్రుసేడ్ ప్రకటించింది. ముస్లిం దేశాలపై యుద్ధంగా భావించవచ్చు. ఇప్పటికే ముస్లిం దేశాలైన గాజా, లెబనాన్, సిరియా, యెమెన్, ఇరాన్ లపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇక మిగిలింది పాకిస్థాన్ కావడంతో ఆ దేశం అప్రమత్తం అయింది.
ఇజ్రాయెల్- భారత్ మధ్య కుదిరిన మిలిటరీ అవగాహన ఒప్పందాలు
ఇటీవల పాకిస్థాన్ పార్లమెంట్ లో ఆ దేశ ఎంపీ అసద్ క్వైజర్ ఇదే విషయాన్ని లేవనెత్తారు. ఇజ్రాయెల్ ముస్లిం దేశాలపై దాడులు చేస్తోందని.. నెక్స్ట్ టార్గెట్ పాకిస్థాన్ అని తేల్చారు. ఇజ్రాయెల్- భారత్ మధ్య కుదిరిన మిలిటరీ అవగాహన ఒప్పందాలు పాకిస్థాన్ కు మరింత ప్రమాదం అని స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
ఇజ్రాయెల్- భారత్ మైత్రితో పాకిస్థాన్ కు పెను ముప్పు ఉందని పాకిస్థాన్ ఎంపీ అసద్ క్వైజర్ అభిప్రాయపడ్డారు. ఇరాన్ తో పాకిస్థాన్ 1200 కిలోమీటర్లు సరిహద్దు కలిగి ఉందని దీంతో ఇజ్రాయెల్ తర్వాతి టార్గెట్ పాకిస్థాన్ అని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల భారత్- పాకిస్థాన్ యుద్ధంలో భారత్ వినియోగించిన డ్రోన్ లు ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసినవేనని ఆయన అన్నారు.
అల్లా కరుణించి పాకిస్థాన్ ను కాపాడాలని పార్లమెంట్ వేదికగా ఎంపీ అసద్ క్వైజర్ వేడుకోవడం సంచలనంగా మారింది. కష్టకాలంలో ఇరాన్ కు మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇరాన్ సోదరసోదరీమణులకు ఈ గడ్డు కాలంలో అండగా ఉండాలన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఇరాన్‌కు మద్దతుగా పాకిస్థాన్?
“ఈ కష్ట సమయంలో ఇరాన్‌కి అండగా ఉండాల్సిన అవసరం ఉంది” అని అసద్ క్వైజర్ వ్యాఖ్య.
ఇరాన్‌తో పాకిస్థాన్‌కు ఉన్న 1200 కి.మీ సరిహద్దు, భవిష్యత్ లో మిలిటరీ ప్రత్యక్ష జోక్యం సంభవించే అవకాశాలను సూచిస్తోంది.
Read Also: Mohsin Rezai: ఇజ్రాయెల్‌పై అణుబాంబు వర్షం కురిపిస్తాం: ఇరాన్ జనరల్