📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Israel: ట్రంప్ హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ఇజ్రాయేల్ దాడులు

Author Icon By Vanipushpa
Updated: June 13, 2025 • 3:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇరాన్ అణు, సైనిక స్థావరాలపై ఇజ్రాయేల్ దాడులు.. ఇరాన్(Iran) ఆర్మ్‌డ్ ఫోర్సెస్ చీఫ్ మృతి
పశ్చిమాసియాలో మరో భీకర యుద్ధం తప్పదా? అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిణామాలు. తాజాగా, ఇరాన్‌పై ఇజ్రాయేల్(Israel) శుక్రవారం నాడు మెరుపు దాడులు చేపట్టింది. ఇరాన్ అణు కేంద్రం, సైనిక స్థావరాలే లక్ష్యంగా ఈ దాడి చేసింది. ఇజ్రాయేల్ దాడిలో ఇరాన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ చీఫ్ ముహమూర్ బగేరీ, రివల్యూషనరీ గార్డ్స్ చీఫ్ హొస్సేనీ సలామీ ప్రాణాలు కోల్పోయారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పశ్చిమాసియాలో ‘భారీ యుద్ధం’ సంభవించే అవకాశం ఉందని హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ఈ దాడులు చోటుచేసుకోవడం గమనార్హం.

ట్రంప్ హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ఇజ్రాయేల్ దాడులు

ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థ సిద్ధంగా ఉంది
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో శుక్రవారం ఉదయం పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ఆ దేశ అధికారిక టీవీ నివేదించింది. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థ ‘100 శాతం సిద్ధంగా ఉంది’ అని కూడా తెలిపింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రధాన కార్యాలయంపై కూడా ఇజ్రాయేల్ దాడి చేసింది. ఈ దాడుల అనంతరం ఇజ్రాయేల్ అత్యవసర స్థితిని ప్రకటించింది. ఈ చర్యల అనంతరం టెహ్రాన్ నుంచి ప్రతీకార దాడులు జరిగే అవకాశముందని రక్షణ మంత్రి ఇజ్రాయేల్ కాట్జ్ తెలిపారు. ‘ఇజ్రాయెల్ చేసిన ఆత్మరక్షణ దాడుల తరువాత, టెహ్రాన్ నుంచి మిస్సైళ్లు, డ్రోన్లతో దాడి జరిగే అవకాశం ఉంది’ అని కాట్జ్ చెప్పారు. ఈ దాడుల నేపథ్యంలో చమురు ధరలు 6 శాతం వరకు పెరిగాయి. ట్రంప్ ఇప్పటికే ఇరాన్ దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీంతో అమెరికా ఆ ప్రాంతంలోని తమ సిబ్బందిని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. ‘ఇది తక్షణమే జరుగుతుంది చెప్పలేను.. కానీ జరిగేలా కనిపిస్తోంది’ అని ట్రంప్ గురువారం వైట్ హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు.
గాజాపై ఇజ్రాయేల్ యుద్ధం మొదలు
ఇరాక్‌లోని దౌత్య కార్యాలయాల సిబ్బందిని తగ్గిస్తున్నట్లు బుధవారం అమెరికా ప్రకటించింది. ఇరాన్‌తో పోరాటాల్లో ఇరాక్ ప్రధాన కేంద్రంగా ఉంది. అమెరికా మద్దతు కలిగిన ఇజ్రాయేల్.. టెహ్రాన్‌ను ఒక ప్రాణాంతక శత్రువుగా భావిస్తోంది. గతేడాది కూడా ఇజ్రాయేల్ ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలపై దాడి చేసింది. 2023 అక్టోబర్ 7న హమాస్ మారణహోమానికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయేల్ యుద్ధం మొదలుపెట్టింది.
ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తోందని అమెరికా, పశ్చిమ దేశాలు, ఇజ్రాయేల్‌లు ఆరోపిస్తున్నాయి. అయితే ఇరాన్ ఈ ఆరోపణలను తిరస్కరిస్తోంది. ఈ వాదనల నేపథ్యంలో, ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) బుధవారం ఇరాన్ ఒప్పందాలను పాటించడం లేదని తెలిపింది. ఇది 2015 అణు ఒప్పందానికి విరుద్ధమని పేర్కొంది.
ఈ పరిణామాలతో, అక్టోబర్‌లో ముగియనున్న స్నాప్ బ్యాక్ మెకానిజాన్ని ఐరోపా దేశాలు ప్రారంభించవచ్చని సూచనలున్నాయి. దీనివల్ల ఇరాన్‌పై గతంలో ఎత్తివేసిన ఐక్యరాజ్యసమితి ఆంక్షలు మళ్లీ అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ట్రంప్ తన తొలి పదవీకాలంలో ఇరాన్‌పై కఠిన ఆంక్షలు విధించారు. ఇరాన్ అణు సంస్థ చీఫ్ మొహమ్మద్ ఎస్లామీ ఈ తీర్మానాన్ని “తీవ్రమైనది”గా పేర్కొన్నారు. ఇది ఇజ్రాయేల్ ప్రభావం వల్లే జరిగిందని ఆరోపించారు.

Read Also: Nuclear Site: న‌టాంజ్ అణుశుద్దిక‌ర‌ణ కేంద్రంపై ఇజ్రాయిల్ అటాక్

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Israeli strikes Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today within hours of Trump's warning

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.