📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి!

Israel: హమాస్, ఇజ్రాయేల్ మధ్య మరోసారి శాంతి చర్చలు

Author Icon By Anusha
Updated: June 1, 2025 • 11:20 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏడాదిన్నరకు పైగా ఇజ్రాయేల్ భీకర దాడుల, వల్ల అతలాకుతలమైన గాజాలో ప్రస్తుతం శాంతి నెలకొల్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా మధ్యవర్తిత్వంతో హమాస్ బందీల విడుదల విషయమై కొన్ని కీలక షరతులకు అంగీకరించడంతో సమస్యకు పరిష్కార మార్గాలు కనిపిస్తున్నాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రతినిధి పశ్చిమాసియా రాయబారి స్టీవ్ విట్కాఫ్ కాల్పుల విరమణ ప్రతిపాదనకు స్పందించినట్టు హమాస్ ప్రకటించింది. నిర్దిష్ట సంఖ్యలో పాలస్తీనా ఖైదీలు విడుదలకు బదులుగా 10 మంది బందీలను విడుదల చేయడానికి అంగీకిరించినట్టు తెలిపింది. అయితే, ఈ ప్రతిపాదనల్లో యుద్ధాన్ని పూర్తిగా ముగించాలన్న హమాస్ డిమాండ్ ఉండటంతో ఇజ్రాయేల్‌కు సవాలుగా మారింది.

సంప్రదింపుల

ఈ ప్రతిపాదన శాశ్వత కాల్పుల విరమణ సాధించడమే కాక, గాజా నుంచి సంపూర్ణంగా ఇజ్రాయెల్ బలగాలను వెనక్కు పంపించేందుకు, మా ప్రజలకు మానవతాసాయం చేరేందుకు దోహదపడేలా ఉంది’ అని హామాస్ ఓ ప్రకటనలో తెలిపింది. హమాస్, ప్రాణాలతో ఉన్న 10 మంది బందీలు, మరో 18 బందీల మృతదేహాల అప్పగింతకు అంగీకరించింది. దీనికి బదులుగా ఇజ్రాయేల్(Israel) అనేక మంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెడుతుంది. జాతీయ స్థాయి సంప్రదింపుల అనంతరం ప్రతిపాదనకు తాము అంగీకరించినట్టు హమాస్ పేర్కొంది.ఈ ఏడాది జనవరి 19న ఇజ్రాయేల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రాగా ఇది రెండు నెలల్లోనే ముగిసింది. దీంతో మార్చి నుంచి మళ్లీ ఇజ్రాయేల్ దాడులు మొదలయ్యాయి.

Israel: హమాస్, ఇజ్రాయేల్ మధ్య మరోసారి శాంతి చర్చలు

అధికారికంగా

ఈ ప్రతిపాదనలపై ఇజ్రాయేల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహూ(Benjamin Netanyahu) కార్యాలయం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అయితే దీనికి ముందు ఇజ్రాయేల్ మీడియా నివేదించిన ప్రకారం బందీల కుటుంబాలతో సమావేశమైన నెతన్యాహూ. ఈ ప్రతిపాదనకు ఇజ్రాయేల్ అంగీకరించిందని చెప్పినట్టు తెలుస్తోంది. కానీ ఇప్పటికీ అధికారిక ప్రకటన లేదు.అయితే, హమాస్ పూర్తి నిరాయుధీకరణ, పాలనా శక్తిగా పునర్నిర్మాణానికి అంగీకారం, మిగిలిన 58 మంది బంధీల విడుదల తర్వాతే యుద్ధాన్ని ముగించాలనే స్థిరమైన వైఖరితో ఇజ్రాయేల్ ఉంది. హమాస్ మాత్రం ఆయుధాలు వీడబోమని, దీనికి బదులుగా ఇజ్రాయేల్ బలగాలు గాజా నుంచి వెనక్కు వెళ్లాలని, యుద్ధాన్ని ముగించాలనే హామీ ఇవ్వాలని స్పష్టంగా తెలిపింది. కాగా, మే 14న ఇజ్రాయేల్ జరిపిన దాడిలో గాజా హమాస్ చీఫ్ మహమ్మద్ సిన్వార్ హతమైన విషయం తెలిసిందే.

Read Also: Russia: రష్యా తీరుపై ఆందోళన వ్యక్తం చేసిన బ్రిటన్ నివేదిక

#GazaCeasefire #HostageDeal #IsraelHamas #MiddleEastConflict Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.