📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Khamenei: ఖమేనీ అంతమొందించడమే తమ లక్ష్యం: ఇజ్రాయెల్

Author Icon By Vanipushpa
Updated: June 19, 2025 • 4:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇజ్రాయెల్, ఇరాన్(Israel, Iran) మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ(Khamenei)ని అంతమొందించి, ఆయన పాలనకు చరమగీతం పాడతామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్(Israel Defence mMinister Katz)సంచలన వ్యాఖ్యలు చేశారు. టెల్ అవీవ్ సమీపంలోని ఓ ఆసుపత్రిపై ఇరాన్(Iran) క్షిపణి దాడి ఘటన అనంతరం ఆయన ఈ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ దాడిలో కనీసం 47 మంది గాయపడినట్లు ఇజ్రాయెల్ సహాయక బృందాలు నివేదించాయి. ”

Khamenei: ఖమేనీ అంతమొందించడమే తమ లక్ష్యం: ఇజ్రాయెల్

అత్యంత తీవ్రమైన యుద్ధ నేరం

ఇది అత్యంత తీవ్రమైన యుద్ధ నేరం. దీనికి ఖమేనీ పూర్తి బాధ్యత వహించాల్సిందే. ఆయనను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖమేనీ ఇక ఎంతమాత్రం ఈ భూమ్మీద ఉండడానికి వీల్లేదు” అని కాట్జ్ ‘ఎక్స్’ వేదికగా తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఇజ్రాయెల్‌కు పొంచి ఉన్న ముప్పును తొలగించడానికి, ఖమేనీ పాలనను బలహీనపరిచేందుకు టెహ్రాన్‌లోని ప్రభుత్వ, వ్యూహాత్మక లక్ష్యాలపై దాడుల తీవ్రతను పెంచాలని తాను, ప్రధానమంత్రి కలిసి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్)(IDF)ను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు.
తాము ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకోలేదు
మరోవైపు, ఈ ఆరోపణలను ఇరాన్ ఖండించింది. తాము ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకోలేదని, సమీపంలోని ఇజ్రాయెల్ సైనిక, గూఢచార స్థావరమే తమ లక్ష్యమని స్పష్టం చేసింది. ఆసుపత్రికి కేవలం పేలుడు తరంగాల ప్రభావం మాత్రమే తగిలిందని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్‌ఎన్ఏ పేర్కొంది. ఇదిలా ఉండగా, ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో పలువురు సీనియర్ ఇరాన్ సైనిక అధికారులు, అణు శాస్త్రవేత్తలు మరణించినట్లు, ఇరాన్‌లోని అణు మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా టెహ్రాన్‌లోని 50కి పైగా లక్ష్యాలు ధ్వంసమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా సైనిక జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలుంటాయని ఇరాన్ హెచ్చరించింది. తమ దేశం ఎన్నటికీ లొంగిపోదని, బెదిరింపులకు భయపడబోమని ఖొమేనీ ఓ టెలివిజన్ ప్రసంగంలో స్పష్టం చేశారు.

Read Also: Iran: ఇరాన్ లో అధికార మార్పుపై పెరుగుతున్న ఊహాగానాలు

#IranIsraelConflict #NuclearCrisis #telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu israel Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Their goal is to eliminate Khamenei

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.