📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Israel: సిరియా అధ్యక్షుడి భవనంపైనే ఇజ్రాయెల్‌ మెరుపుదాడి

Author Icon By Vanipushpa
Updated: May 2, 2025 • 11:25 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గాజాలో హమాస్, లెబనాన్‌లో హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపులపై వరుసబెట్టి దాడులు సాగిస్తూ వచ్చిన ఇజ్రాయెల్‌ మరో అడుగు ముందుకేసింది. ఇప్పుడు తాజాగా సిరియాను లక్ష్యంగా చేసుకుంది. ఏకంగా ఆ దేశాధ్యక్షుడి భవనంపైనే మెరుపుదాడికి దిగింది. ఈ ఘటనతో డమాస్కస్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండున్నర సంవత్సరాలుగా ప్రతీకారదాడులతో ఏడాదిన్నర కాలంగా మధ్య తూర్పు దేశాలు భగ్గుమంటోన్న విషయం తెలిసిందే. రోజుల తరబడి దాడులు ప్రతిదాడులు కొనసాగుతోన్నాయి. ఈ రీజియన్ చల్లారట్లేదు. ఇజ్రాయెల్, గాజా, లెబనాన్‌ రోజూ పరస్పర దాడులకు దిగుతోన్నాయి.

హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపులను లక్ష్యంగా దాడులు
గాజాలో హమాస్, లెబనాన్‌లో హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ మిస్సైళ్లు, రాకెట్లను సంధిస్తూ వస్తోంది. ఈ దాడుల్లో ఈ రెండు గ్రూప్‌లకు చెందిన పెద్ద తలకాయలు తెగిపడ్డాయి. హసన్ నస్రల్లా, యాహ్యా సిన్వర్, ఇస్మాయిల్ హనియె, సమీ తాలెబ్ అబ్దల్లా, ఫతా షరీఫ్, మర్వాన్ ఇసా, ఇబ్రహిం వకీల్, అహ్మద్ వహ్బీ.. వంటి సీనియర్ నాయకులు, కమాండర్లు హతం అయ్యారు. హషెమ్ షఫియొద్దీన్, హుస్సేన్ అలీ హజీమాను మట్టుపెట్టింది ఇజ్రాయెల్. ఇప్పుడు సిరియాను లక్ష్యంగా చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. డమాస్కస్‌లోని అధ్యక్ష భవనం సమీపంలో ఈ దాడి సంభవించింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు స్వయంగా ప్రకటించారు. ఈ తెల్లవారుజామున ఆయన ఓ వీడియో విడుదల చేశారు.
వారి ప్రాణరక్షణకు తాము కట్టుబడి ఉన్నాం: నెతన్యాహు
డ్రూజ్ కమ్యూనిటీ సభ్యులను రక్షించుకోవడంలో భాగంగా ఈ దాడిని చేపట్టినట్లు వివరించారు. వారి ప్రాణరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని బెంజమిన్ నెతన్యాహు పునరుద్ఘాటించారు. డ్రూజ్ సామాజికవర్గం.. సిరియా, లెబనాన్, ఇజ్రాయెల్‌లలో విస్తరించివుంది. సిరియా, లెబనాన్‌లల్లో ఇజ్రాయెల్‌కు అనుకూలంగా పని చేస్తోందనే గుర్తింపు ఉంది.

ఇజ్రాయెల్ వైమానిక దళం

గత ఏడాది డిసెంబర్‌లో బషర్ అల్-అసద్‌ను పడగొట్టిన సున్నీ ఇస్లామిస్టులు డ్రూజ్ సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవడం పట్ల ఇజ్రాయెల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనికి తగిన మూల్యాన్ని చెల్లించుకోక తప్పదనీ హెచ్చరించింది. దీనికి అనుగుణంగా ఇప్పుడు ఇజ్రాయెల్ వైమానిక దళం.. డమాస్కస్‌పై బాంబులతో హోరెత్తించింది. ఏకంగా సిరియా అధ్యక్షుడి భవనాన్ని లక్ష్యంగా చేసుకుంది. అదే సమయంలో డ్రూజ్ సామాజిక వర్గానికి చెందిన సెల్ఫ్ డిఫెన్స్ ఫైటర్లు.. సున్నీ ఇస్లామిస్టులపై ఎదురుదాడికి దిగారు. సహ్నాయా టౌన్‌లో భారీ ఎత్తున ఈ దాడులు- ఎదురుదాడులు కొనసాగుతున్నాయి.

ప్రస్తుతం, సిరియా అంతర్గత వ్యవహారాల శాఖ ప్రకారం, సహ్నాయా టౌన్‌లో తీవ్ర దాడులు జరుగుతున్నప్పటికీ, పరిస్థితి అదుపులో ఉందని పేర్కొంది. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులో ఉందని సిరియా అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది. మధ్య తూర్పులో ప్రస్తుత ఉద్రిక్తతలు కేవలం ఒకే విషయంలో కాదు, మొత్తం విస్తృతంగా కొనసాగుతున్న సంక్షోభాన్ని సూచిస్తున్నాయి. ఇజ్రాయెల్, హమాస్, హెజ్బొల్లా, సిరియా మధ్య సాగే ఈ దాడులు మరింత పెరిగే అవకాశం ఉంది.

Read Also: Pakistan Currency : పాకిస్థాన్ ఆర్థిక స్థితి : పొరుగు దేశాలకు ఆమడంత దూరం

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Israel strikes Latest News in Telugu Paper Telugu News Syrian president's residence Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.