📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Benjamin Netanyahu: నెతన్యాహు మరణవార్తలపై స్పందించిన ఇజ్రాయెల్

Author Icon By Anusha
Updated: March 15, 2026 • 11:12 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Benjamin Netanyahu: గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆరోగ్యంపై అంతర్జాతీయ సోషల్ మీడియా వేదికల్లో సాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. ఆయనపై హత్యాయత్నం జరిగిందని, ఆ దాడిలో నెతన్యాహు మరణించారంటూ వైరల్ అవుతున్న వార్తలను ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం (PMO) తీవ్రంగా ఖండించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది.

Read Also: Rice Export Crisis: తెలంగాణలో ధాన్యం ధరల పతనం

గత కొన్ని రోజులుగా నెతన్యాహుకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు చేతులు పైకెత్తగా, ఆయన చేతికి ఆరు వేళ్లు ఉన్నట్లు కనిపించడంతో ఈ వదంతులు మొదలయ్యాయి. ఇది ఏఐ (AI) సాయంతో సృష్టించిన డీప్‌ఫేక్ వీడియో అని, నెతన్యాహు చనిపోయి ఉండవచ్చని లేదా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని నెటిజన్లు ప్రచారం చేశారు.

Israel responds to news of Netanyahu’s death

“అవన్నీ పచ్చి అబద్ధాలు..”

ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తూ ఇజ్రాయెల్ ప్రభుత్వ అధికారిక ఖాతా నుంచి నెతన్యాహు మరణవార్తను పోస్ట్ చేసి డిలీట్ చేశారంటూ ఓ ఫేక్ స్క్రీన్‌షాట్‌ కూడా వైరల్ అయింది. మార్చి 14, 15 తేదీల్లో ఈ పుకార్లు తీవ్రరూపం దాల్చడంతో ప్రధాని కార్యాలయం రంగంలోకి దిగింది. టర్కీకి చెందిన వార్తా సంస్థ ‘అనడోలు ఏజెన్సీ’ ఈ విషయంపై స్పష్టత ఇచ్చింది. “ఇది ఫేక్ న్యూస్, ప్రధాని క్షేమంగా ఉన్నారు” అని తేల్చిచెప్పింది.

కాగా, నెతన్యాహు చేతికి ఆరు వేళ్లు ఉన్నట్లు కనిపించడం కెమెరా యాంగిల్, చేతి కదలిక, నీడల వల్ల ఏర్పడిన దృష్టిభ్రమ (ఆప్టికల్ ఇల్యూజన్) మాత్రమేనని, అది ఏఐ జనరేటెడ్ వీడియో కాదని ఫ్యాక్ట్-చెకర్స్ విశ్లేషించి తేల్చారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Benjamin Netanyahu Israel PM Israel PMO Statement Netanyahu Health Update

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.