📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

Barak Missile: ఇరాన్​పై భారత్ బరాక్‌ క్షిపణి వ్యవస్థను ప్రయోగించిన ఇజ్రాయెల్‌

Author Icon By Vanipushpa
Updated: June 21, 2025 • 4:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డీఆర్​డీఓ అభివృద్ధి చేసిన అత్యాధునిక బరాక్ క్షిపణులను ఇజ్రాయెల్ సైన్యం ఉపయోగించింది. ఇజ్రాయెల్‌ ఎయిర్‌ స్పేస్‌(Israel AirSpace)లోకి దూసుకొచ్చిన ఇరాన్ యూఏవీ(Barak Missile)లను బరాక్ రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా కూల్చివేసినట్లు ఓ ప్రకటనలో ఇజ్రాయెల్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇజ్రాయెల్‌ ఎయిర్‌ స్పేస్‌లోకి దూసుకొచ్చిన ఇరాన్ యూఏవీ(Iran YAV)లను బరాక్ రక్షణ వ్యవస్థతో సమర్థంగా కూల్చివేసినట్టు వెల్లడించింది. దీంతో అత్యాధునిక బరాక్ గగనతల రక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్ సైన్యం(Israel Army) ఇరాన్‌పై మొదటిసారిగా ఉపయోగించినట్లయ్యింది.

డీఆర్​డీఓ, ఇజ్రాయెల్​ కలిసి బరాక్​ వ్యవస్థ అభివృద్ధి చేశారు!
యూఏవీలు, క్రూయిజ్ క్షిపణులు, ఇతర వైమానిక ముప్పుల నుంచి రక్షణ కోసం బరాక్-8 వ్యవస్థను భారత రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ-డీఆర్​డీఓతో కలిసి ఇజ్రాయెల్ అభివృద్ధి చేసింది. ఇందులో డ్యూయల్-ఫేజ్ రాకెట్ మోటార్ వంటి కీలకమైన భాగాలను డీఆర్​డీఓ అభివృద్ధి చేసింది.

Barak Missile: ఇరాన్​పై భారత బరాక్‌ క్షిపణి వ్యవస్థను ప్రయోగించిన ఇజ్రాయెల్‌

లక్ష్య ఛేదన సామర్థ్యం
ఆపరేషన్ సిందూర్ సమయంలో బరాక్‌ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. భారత్‌ను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ ప్రయోగించిన ఫతా-II క్షిపణిని ఈ రక్షణ వ్యవస్థ అడ్డగించినట్లు సమాచారం. ఇజ్రాయెల్‌కు చెందిన బరాక్ వ్యవస్థ హైపర్‌సోనిక్ బాలిస్టిక్ క్షిపణిని కూల్చివేయగలదని తెలుస్తోంది. బరాక్ ఎయిర్‌ డిఫెన్స్‌తో ఎలాంటి వైమానిక దాడినైనా తిప్పికొట్టవచ్చని ఇజ్రాయెల్ వర్గాలు వెల్లడించాయి.

ఎయిర్‌క్రాఫ్ట్‌, క్రూయిజ్ మిస్సైళ్లు, సీ టు సీ మిస్సైల్స్‌, రాకెట్లు, బాలిస్టిక్ మిస్సైళ్లను బ‌రాక్ వ్యవస్థ చిత్తు చేస్తుందని పేర్కొన్నాయి. ఇది 30, 70, 150 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను కూడా ఛేదించగల సామర్థ్యం కలిగి ఉంటుందని ఇంతకు ముందు ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్‌- ఐఏఐ తెలిపింది.
ఆపరేషన్ సిందూర్ – బరాక్ వినియోగం
పాకిస్తాన్ ప్రయోగించిన ఫతా-II బాలిస్టిక్ క్షిపణిని, భారత బరాక్ వ్యవస్థ అడ్డగట్టినట్లు సమాచారం. దీనితో పాటు భారత నావికాదళం మరియు వైమానిక దళం విభిన్న మోడ్యూల్స్‌లో బరాక్ వ్యవస్థ వినియోగిస్తోంది. ఈ విజయంతో బరాక్ వ్యవస్థకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభించింది. ఇజ్రాయెల్ – ఇరాన్ ఘర్షణలో భారత సాంకేతిక నైపుణ్యం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.

Read Also: America: డోంట్ వర్రీ – అమెరికాకు ప్రత్యామ్నాయ దేశాలు ఇవే

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Indian Barak missile israel Latest News in Telugu launches Paper Telugu News system against Iran Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.