📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Israel: లేజర్ ఆయుధంతో దడ పుట్టిస్తున్న ఇజ్రాయెల్

Author Icon By Vanipushpa
Updated: June 2, 2025 • 4:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రస్తుత కాలంలో యుద్ధ రీతుల్లో చాలా వేగంగా మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు వార్ అంటే ఒక దేశ సైన్యం మరో దేశం మీద దాడి చేసేది. కానీ అత్యాధునిక డ్రోన్ల రాకతో యుద్ధరీతుల్లో అనూహ్య మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు ఎక్కువగా గగనతలంలోనే వార్స్ జరుగుతున్నాయి. డ్రోన్లు, (Drons) మిసైళ్ల(Missels)తో దాడులకు దిగడం విపరీతంగా పెరిగింది. ఈ రకమైన అటాక్స్‌ను తిప్పికొట్టేందుకు సమర్థవంతమైన రక్షణ కవచాలను సిద్ధం చేసుకునే పనిలో పడ్డాయి ప్రపంచ దేశాలు. అయితే వార్ టెక్నాలజీలో ఎప్పుడూ ముందంజలో ఉండే ఇజ్రాయెల్.. ఈ విషయంలోనూ అందర్నీ దాటేసింది. అద్భుతమైన కొత్త లేజర్(Leser) వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. లేజర్ ఆయుధంతో శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.

Israel: లేజర్ ఆయుధంతో దడ పుట్టిస్తున్న ఇజ్రాయెల్

డ్రోన్లను కూల్చేశామని ఇజ్రాయెల్ వెల్లడించింది
హెజ్బొల్లా మిలిటెంట్లతో ఘర్షణలో కొత్త లేజర్ వ్యవస్థను వినియోగించామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) తెలిపింది. దీన్ని తమ దేశానికి చెందిన రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ సంస్థ తయారు చేసిందని వెల్లడించింది. ఈ ఐరన్ బీమ్ వ్యవస్థలో తక్కువ శక్తి కలిగిన లైట్ షీల్డ్ అనే ఆయుధాన్ని వాడి డ్రోన్లను కూల్చేశామని ఇజ్రాయెల్ వెల్లడించింది. ఈ వెపన్ 30 కిలోవాట్ శక్తితో పని చేస్తుందని పేర్కొంది. ఘర్షణల సమయంలో హెజ్బొల్లా తమపై తీవ్ర దాడులకు తెగబడిందని.. ఏకంగా 300కి పైగా పేలుడు పదార్థాలతో నిండిన డ్రోన్లను ప్రయోగించిందని స్పష్టం చేసింది. అయితే అన్ని డ్రోన్లను తమ కొత్త ఐరన్ బీమ్ లేజర్ ఇంటర్‌సెప్టర్ సక్సెస్‌ఫుల్‌గా అడ్డుకుందని ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది.
అద్భుతంగా పనిచేస్తున్న ఐరన్ బీమ్ లేజర్ ఆయుధం
హెజ్బొల్లా ప్రయోగించిన డ్రోన్లను విజయవంతంగా అడ్డుకొని పౌరుల ప్రాణాలు కాపాడామని ఇజ్రాయెల్ తెలిపింది. ఐరన్ బీమ్ లేజర్ ఆయుధం అద్భుతంగా పనిచేసిందని.. దేశ ఆస్తులను కూడా రక్షించిందని ఐడీఎఫ్‌ పొగడ్తల వర్షం కురిపించింది. ఒక్కో డ్రోన్‌ అడ్డగింతకు తమకు చాలా తక్కువ ఖర్చు అయిందని.. కేవలం 2 డాలర్లు మాత్రమే వెచ్చించామని పేర్కొంది. ఇప్పటికే ఐరన్ బీమ్ వ్యవస్థ చాలా వరకు అందుబాటులోకి వచ్చిందని.. ఈ ఏడాది చివరికల్లా పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురానున్నట్లు ఐడీఎఫ్ వివరించింది.

Read Also: London: పాక్ తీరును ఎండగట్టిన ఎంపీ ప్రియాంక

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Israel is making waves Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today with its laser weapon

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.