📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

India: ఇజ్రాయెల్-ఇరాన్ వార్..మోదీ అత్యవసర సమావేశం

Author Icon By Vanipushpa
Updated: June 16, 2025 • 3:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇజ్రాయెల్-ఇరాన్(Israel-Iran) మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతోంది. దీంతో ముడి చమురు ధరలు అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) భారత ప్రభుత్వానికి కీలక సూచన చేసింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇంధన ప్రమాద పరిస్థితులను అత్యవసరంగా సమీక్షించాలని, ముడి చమురు వనరులను నిల్వ ఉండేలా చూసుకోవాలని కోరింది. ఈ యుద్ధం కారణంగా.. భారతదేశం(India) కూడా ఆర్థిక పతనానికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని తెలిపింది. ఈ యుద్ధంతో ఇంధన భద్రత, వాణిజ్య మార్గాలుతో పాటుగా కీలక వాణిజ్య ప్రయోజనాలు తీవ్ర అనిశ్చితిని ఎదుర్కొంటున్నాయని GTRI తెలిపింది.
ఆర్థికవ్యవస్థపై గణనీయమైన ప్రభావం
ఇక యుద్దం జరుగుతున్న రెండు దేశాలతో భారతదేశం స్వేహపూర్వక వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తోంది. ఈ నేపధ్యంలో ఈ రెండు దేశాల ఉద్రిక్త పరిస్థితులు భారతదేశ ఆర్థికవ్యవస్థపై కూడా గణనీయమైన ప్రభావం పడే ఛాన్స్ ఉంది. భారత్.. ఇరాన్, ఇజ్రాయెల్‌కు వివిధ వస్తువులను ఎగుమతి చేస్తుంది. అలాగే చాలా వస్తువులను దిగుమతి చేసుకుంటుంది. రెండు దేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరిగితే భారత్ లో అనేక వస్తువుల ధరలు గణనీయంగా పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు భారత ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పును కలిగించే అవకాశాలు ఉన్నాయని GTRI వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ చెబుతున్నారు.

India: ఇజ్రాయెల్-ఇరాన్ వార్..మోదీ అత్యవసర సమావేశం

ఎగుమతులు, దిగుమతులపై తీవ్ర ప్రభావం
2024-25లో భారతదేశం ఇరాన్‌కు USD 1.24 బిలియన్ల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది. అలాగే USD 441.9 మిలియన్లను దిగుమతి చేసుకుంది. ఇక మరో దేశం ఇజ్రాయెల్ కు USD 2.15 బిలియన్ల ఎగుమతులు చేయగా USD 1.61 బిలియన్ల దిగుమతులు చేసుకుంది. ఈ రెండు దేశాల మధ్య యుద్ద వాతావరణ పరిస్థితులు తీవ్రమయితే ఈ ఎగుమతులు, దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. ఇదిలా ఉంటే భారత్ చమురు అవసరాల కోసం ఎక్కువగా విదేశాల పైనే ఆధారపడుతోంది. దాదాపు 85 శాతం చమురును ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పెరుగుతున్న వివాదంతో భారతదేశానికి ముడి చమురు దిగుమతికి సంబంధించి ముఖ్యమైన సవాళ్లు కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ ఇరుకైన జలమార్గం.. కేవలం 21 మైళ్ల వెడల్పు మాత్రమే ఉంది, ఇది ప్రపంచ చమురు వాణిజ్యంలో దాదాపు ఐదవ వంతు రవాణాకు కీలకంగా ఉంది. 80 శాతానికి పైగా ఇంధన అవసరాలకు విదేశాల నుంచి దిగుమతులపై ఆధారపడిన భారతదేశానికి ఈ జలసంధి చాలా అవసరం.హార్ముజ్ జలసంధిలో ఏదైనా మూసివేత లేదా సైనిక అంతరాయం వల్ల చమురు ధరలు, షిప్పింగ్ ఖర్చులు, బీమా ప్రీమియంలను తీవ్రంగా పెంచుతుందనే ఆందోళన ఇప్పుడు కలుగుతోంది.ఇది ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతుందని.. రూపాయిపై ఒత్తిడి తెస్తుందని, భారతదేశ ఆర్థిక నిర్వహణను క్లిష్టతరం చేస్తుందని అజయ్ శ్రీవాస్తవ అన్నారు.
మధ్య దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం
జూన్ 15న ఇజ్రాయెల్‌లోని హైఫా ఓడరేవుపై ఇరాన్ క్షిపణులను ప్రయోగించినప్పుడు ఆందోళన మరింత రూపం దాల్చిందని శ్రీవాస్తవ చెప్పారు. ఈ ఓడరేవు ఇజ్రాయెల్ దిగుమతుల్లో 30 శాతానికి పైగా నిర్వహించే సౌకర్యం, 70 శాతం భారతదేశ అదానీ పోర్ట్స్ యాజమాన్యంలో ఉందని శ్రీవాస్తవ చెప్పారు.ఇప్పటికే యుద్ద ప్రభావంతో ఓడరేవు మౌలిక సదుపాయాలు, సమీపంలోని శుద్ధి కర్మాగారాలకు నష్టం వాటిల్లినట్లు పలు నివేదికలు సూచిస్తున్నాయి. దీనివల్ల లాజిస్టిక్స్ అంతరాయం కలిగిస్తుందనే భయాలు, భారత వాణిజ్య కార్యకలాపాలలో సంఘర్షణ చెలరేగుతుందని ఆయన అన్నారు. ఈ పరిస్థితులు ఇలా ఉంటే జూన్ 14-15 తేదీలలో యెమెన్‌లోని హౌతీ సైనిక నాయకత్వంపై ఇజ్రాయెల్ చేసిన దాడి ఎర్ర సముద్ర ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలను పెంచింది. అక్కడ హౌతీ దళాలు ఇప్పటికే వాణిజ్య నౌకలపై దాడిని ప్రారంభించాయి. దీని ప్రభావం కూడా భారత్ మీద పడనుంది. యూరప్, ఉత్తర ఆఫ్రికా, యుఎస్ తూర్పు తీరానికి భారతదేశం పశ్చిమ దిశగా చేసే ఇంజనీరింగ్ వస్తువులు, వస్త్రాలు, రసాయనాలు వంటి ఎగుమతుల్లో దాదాపు 30 శాతం బాబ్ ఎల్-మండేబ్ జలసంధి గుండా రవాణా జరుగుతుంది.

Read Also: Qatar: ఖతర్‌లో తెలుగు పాస్టర్లు అరెస్ట్

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Israel Iran War Latest News in Telugu Modi Emergency Meeting Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.