📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

India Pakistan War: ఇండియాకు మద్ధతు తెలిపిన ఇజ్రాయెల్

Author Icon By Vanipushpa
Updated: May 7, 2025 • 11:18 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఊహించినట్టే- పాకిస్తాన్‌పై భారత్ యుద్ధానికి దిగింది. వైమానిక దాడులు సాగించింది. ఆపరేషన్ సింధూర్ మిషన్ చేపట్టింది. బుధవారం తెల్లవారు జామున ఈ దాడులకు దిగింది. శతృదేశానికి ఊపిరి సలపనివ్వకుండా ఏకధాటిగా మిస్సైళ్లను సంధించింది. పహల్గామ్ ప్రతీకారం.. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో కిందటి నెల 22వ తేదీన ఉగ్రవాదులు సాగించిన నరమేధానికి ప్రతీకారమే ఈ యుద్ధం. 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్నా ఉగ్రవాదులు. ఈ ఘాతుకానికి పాకిస్తాన్ కారణమంటూ మొదటి నుంచీ భారత్ వాదిస్తూ వచ్చింది. యుద్ధ సన్నాహకాలనూ చేపట్టింది. పాక్ భూభాగంపై విధ్వంసం తాజాగా ప్రత్యక్ష యుద్ధానికి దిగింది భారత్. తెల్లవారు జామున 2 గంటల సమయంలోచీకటిని చీల్చుకుంటూ తొలి మిస్సైల్ పాకిస్తాన్ భూభాగంపై పడింది. ఇక దాని తరువాత ఒకదాని వెంట ఒకటి భారత క్షిపణులు పాకిస్తాన్ గడ్డపై కనీవినీ ఎరుగని విధంగా విధ్వంసాన్ని సృష్టించాయి.

జైషె మహ్మద్ ఉగ్రవాద సంస్థకు భారీ నష్టం
ఉగ్రవాద సంస్థలు ఛిన్నాభిన్నం తాజా దాడుల్లో జైషె మహ్మద్ ఉగ్రవాద సంస్థకు భారీ నష్టం సంభవించింది. బహవాల్‌పూర్‌ అహ్మద్‌పూర్ ఈస్ట్‌లో సుభాన్ మసీద్ ప్రాంతంలో చాలాకాలం నుంచీ కొనసాగుతూ వస్తోన్న జైషె మహ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాద శిబిరాలు నేలమట్టం అయ్యాయి. మద్దతు ప్రకటించిన దేశం.. ఈ యుద్ధంలో భారత్‌కు మద్దతు ప్రకటించింది.. ఇజ్రాయెల్. అన్ని రకాలుగా అండగా ఉంటామని వెల్లడించింది. ఈ యుద్ధంలో భారత్‌ వైపు నిలిచిన తొలి దేశం ఇదే. పాకిస్తాన్‌పై మిస్సైళ్లను సంధించిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ తెర మీదికి వచ్చింది. భారత్‌కు పూర్తి సహాయ, సహకారాలను అందిస్తామని వెల్లడించింది. ఉగ్రవాదాన్నిక్షమించకూడదు.. ఈ విషయాన్ని భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజర్ తెలిపారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో ఓ పోస్ట్ షేర్ చేశారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు కన్నుమూసిన విషయాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించకూడదని వ్యాఖ్యానించారు.
మిస్సైళ్ల దాడిని ఆత్మరక్షణ హక్కుగా ..
ఆత్మరక్షణ హక్కుగా.. పాకిస్తాన్‌పై భారత్ చేపట్టిన మిస్సైళ్ల దాడిని ఆత్మరక్షణ హక్కుగా అభివర్ణించారు రువెన్ అజర్. ఈ సైనిక చర్యను అన్ని రకాలుగా ఇజ్రాయెల్ సమర్థిస్తుందని తేల్చి చెప్పారు. అమాయకులపై ఉగ్రవాదులు చేసే దారుణమైన నేరాలకు మూల్యం చెల్లించడం సమర్థనీయమని అన్నారు. దాక్కోవడానికి తమకు ఎక్కడే గానీ చోటు లేదనే విషయాన్ని ఉగ్రవాదులు గ్రహించాల్సిన అవసరం ఉందని అన్నారు. సుదీర్ఘకాలంగా మిలిటెంట్ల దాడులు.. ఇజ్రాయెల్ కూడా సుదీర్ఘకాలంగా మిలిటెంట్ల దాడులను ఎదుర్కొంటూ వస్తోన్న విషయం తెలిసిందే. గాజాలో హమాస్, లెబనాన్‌లో హెజ్బొల్లా, యెమెన్‌లో హౌతీ మిలిటెంట్ల నుంచి తరచూ ఇబ్బందికర పరిస్థితులను చవి చూస్తోంది.

ఇజ్రాయెల్, గాజా, లెబనాన్‌, యెమెన్ తరచూ పరస్పర దాడులు

2023లో భారీగా నష్టపోయింది కూడా. 2023 అక్టోబర్‌లో హమాస్ జరిపిన మారణహోమంలో పలువురు ఇజ్రాయెలీలు హతం అయ్యారు. వారి చేతికి బందీలుగా చిక్కారు. మధ్య తూర్పు దేశాల్లో.. ఈ దాడులు ప్రతిదాడులతో రెండున్నర సంవత్సరాలుగా మధ్య తూర్పు దేశాలు భగ్గుమంటోన్న విషయం తెలిసిందే. రోజుల తరబడి దాడులు ప్రతిదాడులు కొనసాగుతోన్నాయి. ఈ రీజియన్ చల్లారట్లేదు. ఇజ్రాయెల్, గాజా, లెబనాన్‌, యెమెన్ తరచూ పరస్పర దాడులకు దిగుతోన్నాయి. మొన్నటికి మొన్న.. మొన్నటికి మొన్న యెమెన్ హౌతీలు.. ఇజ్రాయెల్‌పై భారీ దాడికి దిగారు. భీకరంగా దాడి చేశారు. మిస్సైళ్లను సంధించారు. ప్రధానంగా బెన్ గురియన్ ఎయిర్‌పోర్ట్‌పై హౌతీల దాడి భయానకంగా కొనసాగింది. ఈ ఎయిర్‌పోర్ట్‌పై ఏకంగా బాల్లిస్టిక్ క్షిపణులను సంధించారంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

Read Also: Drone Attacks : ఖార్కివ్‌పై రష్యా డ్రోన్ల దాడి… పౌరులకు గాయాలు

#telugu News Ap News in Telugu Breaking News in Telugu expresses Google News in Telugu israel Latest News in Telugu Paper Telugu News support for India Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.