हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Israel: అమెరికాకు ఇజ్రాయెల్ అంత ప్రత్యేకమా? అసలైన కారణాలు ఇవే!

Anusha
Israel: అమెరికాకు ఇజ్రాయెల్ అంత ప్రత్యేకమా? అసలైన కారణాలు ఇవే!

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది. ఈ పరిణామాల్లో అమెరికా నేరుగా యుద్ధంలోకి దిగడమే కాకుండా, తన శక్తివంతమైన B2 బాంబర్లతో ఇరాన్ అణు స్థావరాలపై దాడులు చేసింది.అణ్వస్త్ర దేశంగా అవతరించడానికి ఇరాన్‌కు ఇంకెంతో సమయం పట్టదనే పక్కా సమాచారంతో ఇజ్రాయెల్ఆ దేశంపై దాడులకు దిగింది. ఇరాన్‌లోని కీలక సైనికాధికారులతోపాటు అణు శాస్త్రవేత్తలను టెల్‌అవీవ్ మట్టుబెట్టింది. ఈ దాడులకు ఇరాన్ కూడా తీవ్రంగానే స్పందించింది. ట్రంప్ హెచ్చరికలను ఏమాత్రం ఖాతరు చేయకుండా ఇజ్రాయె‌ల్‌పై మిస్సైళ్లతో ప్రతిదాడులకు పాల్పడింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా (America) మృత్యుదూతలుగా పిలిచే B2 బాంబర్లతో నేరుగా ఇరాన్‌‌లోని అణు స్థావరాలపై దాడులకు దిగింది. తద్వారా ఇరాన్‌-ఇజ్రాయెల్ యుద్ధంలో అగ్రరాజ్యం ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నట్లు అయ్యింది. ఇప్పటి వరకూ ఇజ్రాయెల్‌ (Israel)కు పరోక్షంగా సహకారం అందిస్తూ శాంతి ఒప్పందం చేసుకోవాలని ఇరాన్‌కు వార్నింగ్ ఇస్తూ వచ్చిన అమెరికా ఇప్పుడు ఏకంగా కదన రంగంలో కాలుమోపింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ పట్ల అమెరికా ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తోంది. కోటి జనాభా ఉన్న ఓ చిన్న దేశానికి అగ్రరాజ్యం ఇంత ప్రాధాన్యం ఎందుకు ఇస్తోందనే అనుమానం రాకమానదు. ఈ పూర్తి కథలో తెలుసుకుందాం.

ఇజ్రాయెల్‌ దరిదాపుల్లో

ఇజ్రాయెల్ విస్తీర్ణం పరంగా, జనాభా పరంగా చాలా చిన్న దేశం. తెలంగాణలో నాలుగో వంతు కంటే తక్కువగా ఉండే ఈ దేశంలో దాదాపు కోటి మంది నివసిస్తున్నారు. ఉగ్రవాదుల దాడుల, యుద్ధాలతో నిత్యం రగులుతూ ఉండే పశ్చిమాసియాలోని వ్యూహాత్మక ప్రదేశంలో ఇజ్రాయెల్ ఉంది. ఇజ్రాయెల్ మ్యాప్‌ను గమనిస్తే ఓవైపు మధ్యదరా సముద్రం, మిగతా అన్ని వైపులా అరబ్ దేశాలు కనిపిస్తాయి. ఆ మాటకొస్తే ఇజ్రాయెల్‌ దరిదాపుల్లో ఉన్నవన్నీ అరబిక్ దేశాలు లేదా ఇస్లామిక్ దేశాలే.బ్రిటన్, అమెరికా, సోవియట్ రష్యా (Russia) ల మద్దతుతో యూదులకు ప్రత్యేక దేశంగా ఇజ్రాయెల్ ఏర్పాటైంది. ఐక్యరాజ్య సమితి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 1948లో ఇజ్రాయెల్ స్వతంత్ర దేశంగా ఏర్పాటైంది. అయితే ఇజ్రాయెల్ ఏర్పాటు కావడం అరబ్ దేశాలకు మొదటి నుంచి ఇష్టం లేదని చెప్పొచ్చు. ఈ ప్రాంతం కోసం అరబ్బులైన పాలస్తీనియన్లు, యూదులైన ఇజ్రాయెలీల మధ్య ఆధిపత్య పోరే దీనికి కారణం. 1967లో తన పొరుగున ఉన్న అరబ్ దేశాలైన ఈజిప్ట్, జోర్డాన్, సిరియాలతో ఇజ్రాయెల్ ఏక కాలంలో యుద్ధం చేయాల్సి వచ్చింది.

Israel: అమెరికాకు ఇజ్రాయెల్ అంత ప్రత్యేకమా? అసలైన కారణాలు ఇవే!
Israel

ప్రధాన మిత్రదేశంగా

ఈ యుద్ధంలో గెలిచిన ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్, ఈస్ట్ జెరూసలెం, గోలన్ హైట్స్ లాంటి ప్రాంతాలను తన అధీనంలోకి తెచ్చుకోగలిగింది. యుద్ధంలో అరబ్ దేశాలపై ఆధిపత్యం చెలాయించిన ఇజ్రాయెల్ అప్పటి నుంచి అమెరికా (America) కు చేరువైంది.రెండో ప్రపంచం యుద్ధం తర్వాతి నుంచి అమెరికా, రష్యాలు ఈ ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. దీంతో మధ్యప్రాచ్యం (మిడిల్ ఈస్ట్) అని ఎక్కువగా వాడుకలో ఉన్న పశ్చిమాసియాపై పట్టు నిలుపుకోవడానికి అమెరికాకు ఇజ్రాయెల్ అవసరమైంది. దీంతో నాటోయేతర ప్రధాన మిత్రదేశంగా ఇజ్రాయెల్‌ను అమెరికా గుర్తించింది. ఫలితంగా ఇజ్రాయెల్‌కు అమెరికా నుంచి గణనీయంగా రక్షణ, ఆర్థిక, సాంకేతిక ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇజ్రాయెల్‌కు అమెరికా ఏటా అందించే సైనిక సాయం విలువ బిలియన్ డాలర్లలో ఉంటుంది.

Read Also: Pilot: విమానం నడపే అర్హత లేదంటూ దళిత పైలట్‌‌ పై ఉన్నతాధికారుల వివక్ష

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870