అమెరికా(America)లో ఇస్కాన్ దేవాలయంపై కాల్పులు కలకలం రేపాయి. అగ్రదేశంలోని శ్రీశ్రీ రాధా కృష్ణ ఇస్కాన్ దేవాలయాన్ని(Sri RadhaKrishna Iskcon) Temple) లక్ష్యంగా చేసుకొని గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగపడ్డారు. ఆలయంలో భక్తులు(Devotees) ఉన్న సమయంలోనే ఈ కాల్పులు చోటు చేసుకోవడం సంచలనం సృష్టించింది. సుమారుగా 20 నుండి 30 రౌండ్ల వరకు కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఆ బుల్లెట్లు(Bullets) ఆలయ గోడల్లో నుండి దూసుకువెళ్లాయి. బుల్లెట్లు తాకడంతో ఆలయం అద్దాలు కూడా పగిలిపోయాయి.
హిందూ సమాజంపై విద్వేషంతో నే దాడులు
ఆలయ నిర్వాహులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి సమయంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో కొందరు భక్తులు, అతిథులు ఆలయంలోనే ఉన్నారు. దుండగులు 20 నుండి 30 రౌడ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆలయ కిటికీలు, గోడలు దెబ్బతిన్నాయి. ఈ దాడి హిందూ సమాజంపై విద్వేషంతో జరిగిందని ఇస్కాన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఆలయంపై దాడి మొదటిసారి కాదని ఆలయ అధ్యక్షుడు వాయ్ వార్డెన్ అన్నారు.
నెలలోనే మూడు సార్లు కాల్పుల ఘటనలు
ఇప్పటికీ చాలాసార్లు ఇలాంటి ఘటనలు జరిగాయని వివరించారు. గత నెలలోనే మూడు సార్లు కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నట్టు చెప్పారు. అనేక దశాబ్దాలుగా ప్రశాంతంగా ఉన్న తమ ఆలయంపై ఇటీవల వరుస దాడులు జరుగుతున్నాయని భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం అవ్వకుండా అధికారులు భద్రతా చర్యలు చేపట్టాలని వాయ్ వార్డెన్ కోరారు. గత నెలలో మూడు సందర్భాల్లో జరిగిన కాల్పుల్లో స్వాగత తోరణాలు, గోడలు, కిటికీల్లో బుల్లెట్లు దిగాయి. 1990 ప్రారంభంలో ఈ గుడిని నిర్మించారు.
ఆలయ అధికారులకు మా మద్దతు
కాగా ఆలయంపై దాడులు చేయడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ పేర్కొంది. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేసింది. ‘‘ఉతాహ్‌లోని స్పానిష్ ఫోర్క్‌లో ఉన్న ఇస్కాన్ శ్రీశ్రీ రాధా కృష్ణ దేవాలయంపై ఇటీవల జరిగిన కాల్పుల ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. భక్తులకు, ఆలయ అధికారులకు మా మద్దతు ఎప్పటికీ ఉంటుంది. ఈ ఘటనపై స్థానిక అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలి’’ అని పేర్కొంది.
ఈ ఏడాది మార్చి 9న సైతం కాలిఫోర్నియాలో ఇలాంటి ఘటనే జరిగింది. లాస్ ఏంజెలెస్‌లో ఖలిస్థానీ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ముందు చినోహిల్స్‌లో ఉన్న బోచసన్వాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ (బాప్స్) హిందూ దేవాలయంపై దాడి జరిగినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఇస్కాన్ ఆలయంపై వరుస దాడుల నేపథ్యంలో, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతను పెంచాలని ఆలయ నిర్వాహకులు అధికారులను కోరారు. ఆలయానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యం మరియు భక్తుల విశ్వాసం దృష్ట్యా తక్షణ చర్యలు అవసరమని వారు తెలియజేశారు.
Read Also: One Big Beautiful Bill Act : అసలు ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ అంటే ఏంటి..?