📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Iran: ఇరాన్‌‌తో యుద్ధం నెతన్యాహు కు లాభమా? నష్టమా?

Author Icon By Vanipushpa
Updated: June 30, 2025 • 4:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇరాన్‌(Iran)పై మిలటరీ దాడి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు(Israel Prime Minister Natanyahu)కు లాభం కలిగించిందా? మరోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టాలన్న నెతన్యాహు ఆశలు నెరవేరే పరిస్థితి ఉందా? సుదీర్ఘమైన గాజా యుద్ధం వల్ల కలిగిన రాజకీయ నష్టాన్ని ఇరాన్‌(Iran)పై సైనిక చర్యతో నెతన్యాహూ భర్తీ చేసుకున్నారా? దేశ ప్రయోజనాలకన్నా వ్యక్తిగత రాజకీయ లబ్ది కోసమే గాజా యుద్ధాన్ని నెతన్యాహు కొనసాగిస్తున్నారన్న మెజార్టీ ఇజ్రాయెలీ(Israel)ల అభిప్రాయాన్ని ఇరాన్‌తో యుద్ధం మార్చివేసిందా? మార్చిలో కాల్పుల విరమణపై వెనక్కి తగ్గి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి రాజకీయ ఆత్మహత్యకు పాల్పడ్డారని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు.
యుద్ధం ముగుస్తుందని ఆశపడితే…
డోనల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టకముందే ఆయన ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ కుదిర్చిన కాల్పుల విరమణ ఒప్పందం హమాస్‌ దగ్గర బందీలుగా ఉన్నవారిలో కొందరి విడుదలకు అవకాశం కల్పించింది. దీనికి బదులుగా తమ జైళ్ల నుంచి వందల సంఖ్యలో పాలస్తీనా పౌరులను ఇజ్రాయెల్ విడుదల చేసింది. యుద్ధాన్ని ముగించడానికి సంప్రదింపులు జరిపే ముందు మరింతమంది బందీలను విడిపించడం, గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలను క్రమంగా ఉపసంహరించుకోవడం తర్వాతి దశలో భాగంగా జరగాల్సి ఉంది.
సంక్షోభంతో అలసిపోయిన పాలస్తీనియన్లు, ఇజ్రాయెలీలు అత్యంత వినాశకర యుద్ధం ముగింపు గురించి ఆలోచించారు. కానీ బెంజమిన్ నెతన్యాహుకు యుద్ధం ముగించడం ఇష్టం లేదు.
గాజా అంతటా మళ్లీ దాడులకు ఆదేశాలిస్తూ హమాస్‌ను పూర్తిగా తుడిచిపెట్టేదాకా పోరాటం కొనసాగుతుందని నెతన్యాహు ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో మిగిలిన బందీలను గాజా నుంచి సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి ప్రాధాన్యం తగ్గిపోయింది.

Netanyahu: ఇరాన్‌‌తో యుద్ధం నెతన్యాహు కు లాభమా? నష్టమా?

దీనిపై చాలా మంది ఇజ్రాయెలీలు, ముఖ్యంగా బందీల కుటుంబాలు ఆగ్రహంతో ఉన్నాయి. తమ వారి భద్రత, దేశానికి మంచి చేయడం కంటే, తన రాజకీయ మనుగడకు నెతన్యాహు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని బందీల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ముందస్తు ఎన్నికల ఆలోచనతో నెతన్యాహుకు మంచి జరుగుతుందా?
నెతన్యాహుకు ఆదరణ తగ్గిపోయింది. సంప్రదాయవాదులు, అందుకు భిన్నంగా ఉండేవారిని ఐక్యంగా ఉంచడం ద్వారా ప్రభుత్వాన్ని నడపడానికి ఆయన చాలా సవాళ్లు ఎదుర్కొంటున్నారు.
ప్రధానమంత్రి కావడంపై ఆశలు
కాల్పుల విరమణ నుంచి వెనక్కి వచ్చిన మూడు నెలల తర్వాత ఇరాన్‌పై సాధించిన మిలటరీ విజయంతో ఇప్పుడు ఆయన ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ముందస్తు ఎన్నికలు, మరోసారి ప్రధానమంత్రి కావడం గురించి ఆలోచిస్తున్నారు. తాను సాధించాల్సిన లక్ష్యాలు ఇంకా చాలా ఉన్నాయని, ఇజ్రాయెల్ ప్రజల మద్దతు తనకున్నంతకాలం వాటిని పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తానని ఈ వారం ప్రారంభంలో నెతన్యాహు చెప్పారు. ఇప్పటిదాకా ఇజ్రాయెల్ ప్రధానిగా ఎక్కువకాలం పనిచేసిన నేత నెతన్యాహునే. ఇరాన్ అణుకార్యక్రమాన్ని ధ్వంసం చేయగలగడం వదులుకోకూడని అవకాశమని నెతన్యాహు అన్నారు. బందీలను విడిపించి, హమాస్‌ను ఓడించడం, ప్రాంతీయ ఒప్పందాలను కుదుర్చుకోవడంపై మాత్రమే దృష్టిపెడతామని తెలిపారు.

Netanyahu: ఇరాన్‌‌తో యుద్ధం నెతన్యాహు కు లాభమా? నష్టమా?

నెతన్యాహుకు పలు సవాళ్లు వున్నాయి
అనేక రకాలుగా విడిపోయిన ఇజ్రాయెల్ రాజకీయ వ్యవస్థ నేపథ్యంగా సంకీర్ణ ప్రభుత్వ నిర్మాణం చాలా క్లిష్టమైనది. 120 సీట్లున్న ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో నెతన్యాహు లికుడ్ పార్టీ మెజార్టీకి చాలా దూరంలో ఆగిపోవచ్చని, అనేక చిన్న పార్టీల నుంచి మద్దతు కూడగట్టుకోవాల్సిన సవాళ్లు ఎదుర్కోవచ్చని మారివ్ న్యూస్ పేపర్ తాజా సర్వే తెలిపింది. 59 శాతం ఇజ్రాయెలీలు బందీలను విడిపించేందుకు గాజాలో యుద్ధం ఆపాలని కోరుకుంటున్నారని కూడా ఆ సర్వేలో తేలింది.
తన రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే నెతన్యాహు యుద్ధాన్ని కొనసాగిస్తున్నారని సర్వేలో పాల్గొన్న ఇజ్రాయెలీల్లో 49 శాతం అభిప్రాయపడ్డారు. ‘‘నెతన్యాహు చాలా నైపుణ్యమున్న రాజకీయ నటుడు’’ అని ఇజ్రాయెల్ డెమొక్రసీ ఇనిస్టిట్యూట్‌లో సీనియర్ రీసెర్చ్ ఫెలో అయిన ప్రొఫెసర్ టామర్ హెర్మాన్ అన్నారు.
కానీ నమ్మకం అనేది నెతన్యాహుకు అతిపెద్ద సమస్య అని ఆయన అభిప్రాయపడ్డారు.
అధికార పగ్గాల కోసం అనేకమార్లు విధానాలను మార్చుకున్న రాజకీయ నాయకుడిని మెజార్టీ ఇజ్రాయెలీలు ఎంతమాత్రం నమ్మడం లేదని ఆయన విశ్లేషించారు.
నెతన్యాహు గొప్ప హీరో: ట్రంప్
ఈ కేసును రాజకీయ కక్షపూరిత చర్యగా నెతన్యాహు, ఆయన మద్దతుదారులు పదే పదే చెబుతున్నప్పటికీ నెతన్యాహు విచారణను ఎదుర్కోవాల్సిందేనని ఆయన ప్రత్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. నెతన్యాహు గొప్ప హీరో అని, పోరాటయోధుడని అభివర్ణించిన ట్రంప్ ఆయనపై విచారణ వెంటనే నిలిపివేయాలని, లేదా ఆయనకు క్షమాభిక్ష పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం కొన్నిరోజుల ముందే, ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తుందన్న భావనతో నెతన్యాహును తీవ్ర పదజాలంతో బహిరంగంగా విమర్శించింది ఇదే ట్రంప్ అని మనం మర్చిపోకూడదు.

Read Also: China: ఫుకుషిమా నిషేధం అనంతరం జపాన్‌కు చైనా నుండి ఊరట

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Iran Israel tensions Iran nuclear threat Iran vs Israel latest news Israel Iran conflict 2025 Israel military strikes Latest News in Telugu Middle East geopolitics Middle East security Netanyahu approval ratings Netanyahu Iran war analysis Netanyahu leadership during war Netanyahu political strategy Netanyahu war benefits Paper Telugu News regional stability Israel Iran Telugu News online Telugu News Paper Telugu News Today US role in Iran Israel war war impact on Israeli politics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.