📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Sundar Pichai: సుందర్ పిచాయ్ సక్సెస్ కు భార్య అంజలినే కారణమా!

Author Icon By Vanipushpa
Updated: April 30, 2025 • 5:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇంకా అతని భార్య అంజలి పిచాయ్ ప్రపంచంలోనే అత్యంత డిమాండ్ ఉన్న జంటలలో ఒకరు. గూగుల్‌లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉన్న సుందర్ పిచాయ్ ప్రయాణం గురించి అందరికీ తెలిసిందే, కానీ అంజలి అతని ప్రయాణంలో ముఖ్యమైన పాత్ర పోషించిందని కొద్దిమందికి మాత్రమే తెలుసు. అయితే అంజలి సలహా ఇవ్వకపోతే సుందర్ పిచాయ్ గూగుల్‌లో ఇప్పుడు స్థాయిలో ఉండే వాడు కాదు.

అంజలి పిచాయ్ ఎవరు

ప్రతి సక్సెస్ ఫుల్ పురుషుడి వెనుక ఒక స్త్రీ ఉంటుంది అనే సామెతను మనం వినే ఉంటాం. కానీ గూగుల్ అండ్ ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ కు ఆయన భార్య అంజలి నుండి ఎంతో సపోర్ట్ లభించింది. వృత్తిపరంగా అలాగే నమ్మకమైన జీవిత భాగస్వామిగా సుందర్ పిచాయ్ విజయాలలో అంజలి కీలక పాత్ర పోషించింది.
అంజలి పిచాయ్ చదువు ఇంకా ఉద్యోగం: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)లో కెమికల్ ఇంజనీరింగ్ చదివిన అంజలి, తన భర్తలాగే టెక్నాలజీ రంగంలో కూడా సక్సెస్ అయ్యింది. అంజలి తన కెరీర్‌ను యాక్సెంచర్‌లో బిజినెస్ అనలిస్ట్‌గా ప్రారంభించి, ఆ తర్వాత ప్రముఖ ఫైనాన్షియల్ సాఫ్ట్‌వేర్ కంపెనీ అయిన ఇంట్యూట్‌కు మారింది. ఆమె ప్రస్తుతం అక్కడ కీలకమైన మ్యానేజ్మెంట్ పదవిలో ఉన్నారు. అంజలి పిచాయ్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్: అంజలి పిచాయ్ తల్లి గురించి పెద్దగా తెలియకపోయినా, అంజలి పిచాయ్ తండ్రి హర్యాన ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి. అతను 2015లో 70 సంవత్సరాల వయసులో మాధురి శర్మను తిరిగి వివాహం చేసుకున్నాడు. హర్యాని రాజస్థాన్‌లోని కోటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నుండి రిటైర్మెంట్ అయినట్లు చెబుతారు.
అంజలి – సుందర్ పిచాయ్ పరిచయం
54 ఏళ్ల అంజలి, 52 ఏళ్ల సుందర్ ఐఐటీలో అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ విద్యార్థులుగా ఉన్నప్పుడు కలుసుకున్నారు. “నా భార్య అంజలిని నేను మొదటిసారి కలిసిన ప్రదేశం ఐఐటీ ఖరగ్‌పూర్ కాబట్టి నా మనసులో ప్రత్యేక స్థానం ఉంది. నేను పెరిగిన నా రెండవ ఇల్లుగా కాలేజ్ గురించి నాకు మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి” అని సుందర్ పిచాయ్ ఒకసారి అన్నారు. తన పాత కాలేజ్ నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్న కార్యక్రమంలో సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.. పిచాయ్ దంపతుల కుటుంబ జీవితం గురించి చాలా గోప్యంగా ఉన్నప్పటికీ, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరికి కావ్య అనే కుమార్తె, కిరణ్ అనే కుమారుడు ఉన్నారు.

అంజలి పిచాయ్ ఆస్తుల విలువ:

అంజలి పిచాయ్ మొత్తం ఆస్తుల విలువ దాదాపు 100 మిలియన్ యుఎస్ డాలర్లు ఉంటుందని చెబుతున్నారు. అంటే భారత కరెన్సీలో 830 కోట్లు. ఆమె భర్త సుందర్ పిచాయ్ నికర విలువ 1.3 బిలియన్ డాలర్లు. అంటే దాదాపు రూ. భారత కరెన్సీలో 10,800 కోట్లు. ప్రపంచంలోనే అత్యధిక జీతం పొందుతున్న సీఈఓలలో సుందర్ పిచాయ్ ఒకరు. అంజలి పిచాయ్ కార్లు: సుందర్ పిచాయ్, అతని భార్యకి రూ.3.21 కోట్ల విలువైన మెర్సిడెస్ మేబ్యాక్ S650 కారు ఉన్నటు చెబుతారు. సుందర్ పిచాయ్ మెర్సిడెస్ మేబ్యాక్ S650 కారుకి 6.0-లీటర్ ట్విన్-టర్బో V12 ఇంజన్ ఉంది అలాగే ఈ కారు గంటకు 190 కి.మీ.ల టాప్ స్పీడ్ అందుకోగలదు.

Read Also: Chairman: జాతీయ భద్రతా సలహా బోర్డు చైర్మన్ గా అలోక్‌ జోషి

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Is Sundar Pichai's wife Latest News in Telugu Paper Telugu News responsible for his success? Telugu News online Telugu News Paper Telugu News Today wife Anjali

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.