📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Rahul Gandhi: భారత ఆర్మీని రాహుల్ తక్కువచేసి మాట్లాడుతున్నారా?

Author Icon By Vanipushpa
Updated: June 5, 2025 • 4:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తోన్నారా?.. విభజనవాదానికి నాంది పలుకుతున్నారా?.. అనే ప్రశ్నకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ మధ్యకాలంలో ఆయన చేస్తోన్న ప్రకటనలు, వ్యాఖ్యలను బట్టి చూస్తే ఈ విషయాన్ని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీRahul Gandhi) అనేక సందర్భాల్లో భారత ఆర్మీ(Indian Army) గురించి వ్యాఖ్యలు చేశారు. దేశసమగ్రతను ప్రశ్నించారు. దేశ అంతర్గత, విదేశీ శక్తుల ముప్పు నుండి దేశాన్ని రక్షించడానికి అవిశ్రాంతంగా పనిచేసే నైతిక మద్దతు, సంఘీభావాన్ని తెలియజేయడానికి బదులుగా.. రాజకీయాల కోసం వినియోగించుకుంటోన్నారనే విమర్శలు వ్యక్తమౌతోన్నాయి.

Rahul Gandhi: భారత ఆర్మీని రాహుల్ తక్కువచేసి మాట్లాడుతున్నారా?

అమెరికా ఒత్తిడికి నరేంద్ర మోదీ సరెండర్ అయ్యారు
పాకిస్తాన్‌తో జరిగిన సైనిక చర్య, యుద్ద సమయంలో అమెరికా ఒత్తిడికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరెండర్ అయ్యారని రాహుల్ గాంధీ ఆరోపించడాన్ని దీనికి ఉదహరిస్తోన్నారు. భోపాల్‌లో జరిగిన ఓ పార్టీ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ కాల్ తర్వాత ప్రధాని మోదీ లొంగిపోయారని వ్యాఖ్యానించారు. నరేంద్రా, లొంగిపో’ అని ట్రంప్ ఆదేశించగా.. దానికి ఓకే సర్ అని మోదీ బదులిచ్చారని ఎద్దేవా చేశారు రాహుల్ గాంధీ. దీనిపై కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో విస్తృత ప్రచారం చేసింది. ట్రంప్ ఫోన్‌లో నరేంద్రా, లొంగిపో అని మోదీ ఆదేశిస్తున్నట్లు, సరే సర్ అని మోదీ సమాధానం ఇస్తున్నట్లు ఓ కార్టూన్‌ను సైతం కాంగ్రెస్ పోస్ట్ చేసింది.
యూరీ సర్జికల్ దాడులపైనా అనుమానాలు వ్యక్తం చేశారు
అత్యంత సమస్యాత్మక, సున్నిత సమయాల్లో రాహుల్ గాంధీ.. భారత ఆర్మీ సమగ్రతను ప్రశ్నించడం వివాదాస్పదమైంది. ఇది ఆయనకు మొదటిసారేమీ కాదు. గతంలో బాలకోట్ వైమానిక దాడులు, యూరీ సర్జికల్ దాడులపైనా అనుమానాలు వ్యక్తం చేశారు. సాయుధ బలగాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వీడియో ప్రూఫ్ డిమాండ్ చేశారు.
గాల్వాన్ వ్యాలీలో భారత్- చైనా ఆర్మీ మధ్య ఘర్షణ సమయంలో కూడా రాహుల్ గాంధీ ఇలాంటి వ్యతిరేక వ్యాఖ్యలే చేశారనే ఆరోపణలు వ్యక్తం అయ్యాయి. సైనికుల త్యాగాలను గౌరవించడానికి బదులుగా ఆయన రాజకీయం చేయడానికి, ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడానికి వీటిని వినియోగించుకుంటోన్నాడని ఆరోపణలు వినిపించాయి.
సొంత ప్రయోజనాల కోసం భారత ఆర్మీ గురించి మాట్లాడుతున్నారా?
భారత్ జరిపిన ఎదురుదాడి- పాకిస్తాన్ లో ఉగ్రవాద మౌలిక సదుపాయాలను దెబ్బతీశాయనేది.. తటస్థులు కూడా అంగీకరించడం అనేది వాస్తవం అయినప్పటికీ- రాహుల్ గాంధీ తన సొంత ప్రయోజనాల కోసం భారత ఆర్మీ గురించి పదే పదే ప్రశ్నిస్తోండటం కాంగ్రెస్ రాజకీయం.. జాతీయతను సైతం అధిగమించినట్టయిందని అంటున్నారు. యుద్ధాన్ని ఎదుర్కొంటోన్న దేశాల్లో రాజకీయ పార్టీలన్నీ కూడా రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం విషయంలో ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ అక్కడి పార్టీన్నీ ఏకాభిప్రాయాన్ని ప్రకటించాయి. కాంగ్రెస్ గానీ, ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ గానీ దేశ స్ఫూర్తిని విచ్ఛిన్నం చేయాలని కోరుకుంటోన్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాహుల్ గాంధీ వైఖరి వల్ల భారత ఆర్మీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయడమే కాకుండా శత్రువులకు మరింత ధైర్యాన్ని ఇస్తుందనే ఆందోళన వ్యక్తమౌతోంది.

Read Also: http://Yograj Singh: శ్రేయస్ అయ్యర్ ఓ క్రిమినల్ అంటూ మండిపడ్డ యోగ్‌‌రాజ్ సింగ్

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Is Rahul belittling Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today the Indian Army?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.