📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

New President: ఐరాస సర్వప్రతినిధి సభ కొత్త అధ్యక్షురాలిగా అనలీనా బేర్‌బాక్?

Author Icon By Vanipushpa
Updated: June 4, 2025 • 4:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి(UNO) సభకు నూతన అధ్యక్షురాలిగా జర్మనీ విదేశాంగ శాఖ మాజీ మంత్రి అనలీనా బేర్‌బాక్(Annalea Bearbock) ఎన్నిక అయ్యారు. రష్యా డిమాండ్ చేసినట్లుగా రహస్య బ్యాలెట్ ద్వారానే సభ్య దేశాలు ఓటింగ్‌లో పాల్గొన్నాయి. అయితే మొత్తం ఇద్దరు అభ్యర్థులు ఈ పదవి కోసం పోటీ చేయగా.. భారీ మెజార్టీతో అనలీనా బేర్‌బాక్ గెలిచారు. ముఖ్యంగా జర్మన్(Germany) దౌత్యవేత్త హెల్గా ష్మిడ్ ఘోర పరాజయం పాలయ్యారు. ఈ ఎన్నికకు మెజార్టీ మార్కు 88 ఓట్లు మాత్రమే కాగా.. అనలీనా 167 ఓట్లు సాధించారు. హెల్గా ష్మిడ్‌కు కేవలం 7 ఓట్లు మాత్రమే రావడం గమనార్హం.

New President: ఐరాస సర్వప్రతినిధి సభ కొత్త అధ్యక్షురాలిగా అనలీనా బేర్‌బాక్?

పోటీలోకి దిగిన జర్మన్ దౌత్యవేత్త హెల్గా ష్మిడ్

ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ అధ్యక్ష ఎన్నికలను తాజాగా నిర్వహించారు. ప్రాంతాల వారిగీ ప్రతీ ఏటా నిర్వహించే ఈ ఎన్నికలను రహస్య బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని రష్యా డిమాండ్ చేసింది. అందుకు సభ్య దేశాలు కూడా అంగీకారం తెలిపాయి. దీంతో ఈ పద్ధతిలోనే ఓటింగ్ నిర్వహించారు. ముఖ్యంగా అధ్యక్ష పదవి కోసం జర్మనీ విదేశాంగ శాఖ మాజీ మంత్రి అనలీనా బేర్‌బాక్, జర్మన్ దౌత్యవేత్త అయిన హెల్గా ష్మిడ్ పోటీలోకి దిగారు. మొత్తంగా 193 దేశాలకు ఇందులో సభ్యత్వం ఉండగా.. ఎన్నికలకు 14 దేశాలు గైర్హాజరు అయ్యాయి. కానీ మిగతా 179 దేశాలు తమకు నచ్చిన అభ్యర్థికి ఓట్లు వేశాయి.
ఏంటీ ఈబీ-5 వీసా.. ఎందుకు భారతీయులు దీనిపై కన్నేశారు?

ముఖ్యంగా ఈ ఎన్నికకు మెజార్టీ మార్కు 88 ఓట్లు మాత్రమే కాగా.. అనలీనా బేర్‌బాక్‌కు 167 ఓట్లు వచ్చాయి. ఇలా ఆమె భారీ మెజార్టీతో ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. 44 ఏళ్ల వయసులో ఈ పదివిని దక్కించుకున్న ఐదో మహిళగా రికార్డు సాధించారు. కానీ మరో అభ్యర్థిగా పోటీ చేసిన హెల్గా ష్మిడ్‌కు కేవలం 7 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే ఇప్పుడు ఎన్నికల్లో గెలిచిన అనలీనా బేర్‌బాక్ ఈ ఏడాది సెప్టెంబరులో జరిగే ఐరాస సర్వప్రతినిధి సభ 80వ సమావేశంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న ఫిలెమాన్ యాంగ్ నుంచి అనలీనా ఈ బాధ్యతలు స్వీకరించబోతున్నారు.
అసలెవరీ అనలీనా బేర్‌బాక్..?
అనలీనా బేర్‌బాక్ పూర్తి పేరు అనలీనా షార్లెట్ అల్మా బేర్‌బాక్. 1980లో పశ్చమ జర్మనీలోని హనోవర్‌లో జన్మించిన ఈమె హాంబర్గ్ విశ్వవిద్యాలయం, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్‌లో చదువుకున్నారు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చారు. 2021లో జర్మనీ విదేశాంగ శాఖ మంత్రిగా ఎన్నికయ్యారు. ఐదేళ్ల పాటు తన సేవలను అందించారు. తాజాగా ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభకు నూతన అధ్యక్షురాలిగా భారీ మెజార్టీతో గెలిచి మరిన్ని సేవలు అందించేందుకు సిద్ధం అవుతున్నారు.

Read Also: G7 summit :జీ 7 సదస్సు కోసం భారత్‌కి ఇంకా దక్కని

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Is Analina Baerbach Latest News in Telugu of the UN General Assembly? Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today the new President

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.