📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Iran: ఇరాన్​లో నాయకత్వ మార్పు తప్పదా?

Author Icon By Vanipushpa
Updated: June 23, 2025 • 11:09 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇరాన్​(Iran)లో నాయకత్వ మార్పుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కీలక సంకేతాలు ఇచ్చారు. ఇప్పటిదాకా, ఇరాన్​ నాయకత్వ మార్పు తమ ఉద్దేశం కాదని, ఆ దేశంలో అణు స్థావరాలను ధ్వంసం చేయడమే తమ లక్ష్యమని చెప్పిన ట్రంప్ తాజాగా ‘మేక్ ఇరాన్ గ్రేట్ ఎగైన్‌’ (Make Iran Great Again) పేరుతో పెట్టిన పోస్ట్ అందుకు విరుద్ధంగా ఉండటం గమనార్హం. ఇరాన్‌లోని మూడు ప్రధాన అణు కేంద్రాలపై అమెరికా చేపట్టిన అకస్మాత్తు వైమానిక దాడుల తర్వాత, ఇరాన్‌లో ప్రస్తుత పాలన భవిష్యత్తుపై ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్​(Trumth Social) మీడియాలో పెట్టిన పోస్టులు అనేక సందేహాలకు సంకేతాలుగా మారాయి.

పాలన మార్పు రాజకీయంగా గందరగోళంగా మారిన అంశం

‘పాలన మార్పు అనే పదాన్ని వాడటం రాజకీయంగా సరైంది కాదేమో. కానీ ప్రస్తుత ఇరానియన్ పాలకులు ఆదేశాన్ని గొప్పగా పాలన మార్పు ఎందుకు ఉండకూడదు?’ అని ట్రంప్ ఆదివారం రాత్రి ఈ పోస్టు చేశారు. ట్రంప్ చేసిన ట్వీట్ అదే రోజు ఉదయం అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ చేసిన వ్యాఖ్యలకు చాలా విరుద్ధంగా ఉంది. తాము చేసిన దాడి పాలన మార్పు కోసం కాదని, తమ లక్ష్యం అధి కాదని ట్రంప్ పేర్కొన్నారు.
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో సైతం
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియోకు ఇరాన్​లో నాయకత్వ మార్పుపై తన వైఖరిని స్పష్టం చేశారు. ఇరాన్ అణు ఆయుధాలను అభివృద్ధి చేయకుండా ఆపాలనేదే తమ ముఖ్య ఉద్దేశమని ప్రకటించారు. ‘అమెరికాపై ప్రతీకార చర్యలకుగానీ, ఇరాన్ అణు ఆయుధాలను నిర్మించేందుకు ప్రయత్నిస్తే ప్రస్తుతం ఉన్న పాలన ప్రమాదంలో పడుతుంది’ అని హెచ్చరించారు.

America: ఇరాన్‌పై దాడుల నేపథ్యంలోని మార్పులు – అమెరికా సంకేతాల దిశగా..

ట్రంప్ వ్యాఖ్యలు ఇరాన్‌ను హెచ్చరించడమా?

ట్రంప్​తో ఆయన మంత్రులు కూడా ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంపై పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రంప్ చేసిన పోస్టు పోస్టు గందరగోళంగా, అనేక అనుమానలకు కేంద్ర బిందువుగా మారింది. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇరాన్‌ను హెచ్చరించడమా? ఆ దేశాన్ని సవాల్ చేయడం ద్వారా పరిణామాలను తీవ్రమయ్యేలా చేయడమా? అనేది స్పష్టంగా తెలియడం లేదు. ఏది ఏమైనా ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధానికి అమెరికా వ్యవహారం మరింత విస్తరించే అవకాశం ఉందని విమర్శకులు అంటున్నారు. ఇదిలా ఉండగా, ఇరాన్​తో చర్చలకు అవకాశం ఉందంటూనే దాడులు చేయడం ద్వారా అమెరికా ఏం చెప్పదల్చుకుందో అనేది అర్థం కాని పరిస్థితి. అంటే ఇరాన్ సైనిక సామర్థ్యం తక్కువగా ఉన్నందున, చర్చలకు రావాల్సిన అవసరం ఆదేశానికే ఉందనే భావనలో అమెరికా భావిస్తున్నట్లు తెలుస్తోంది.


మార్కో రుబియో హెచ్చరిక – పాలన కూలిపోయే ప్రమాదం
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో మాట్లాడుతూ, ఇరాన్ అణు ఆయుధ అభివృద్ధికి ప్రయత్నిస్తే, వారి పాలన ప్రమాదంలో పడవచ్చని హెచ్చరించారు.
చర్చలు కొనసాగుతూనే దాడులు – అర్థం కాని వ్యూహం
ఒకవైపు చర్చలకు అవకాశం ఉందంటూ… మరోవైపు దాడులు చేస్తుండటం అమెరికా వాస్తవ అభిప్రాయాన్ని సందేహాస్పదంగా చేస్తోంది. దీని వెనుక “సైనిక బలంలో తక్కువదనాన్ని ఉపయోగించుకోవాలన్న” వ్యూహం ఉందని విమర్శకుల అభిప్రాయం. ఇరాన్​లో నాయకత్వ మార్పుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక సంకేతాలు ఇచ్చారు. ఇప్పటిదాకా, ఇరాన్​ నాయకత్వ మార్పు తమ..

Read Also: Israel vs Iran : ఇజ్రాయెల్ పై మిస్సెల్స్ లాంచ్ చేసిన ఇరాన్

#IranLeadershipChange #MakeIranGreatAgain #telugu News #TrumpOnIran Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu MiddleEastCrisis Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.