📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Iran: అమెరికాతో అణు ఒప్పందం మాకు విశ్వాసం లేదన్న ఇరాన్

Author Icon By Anusha
Updated: June 14, 2025 • 4:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకీ ఉద్రిక్తంగా మారుతున్నాయి.ఇజ్రాయెల్‌ తన “ఆపరేషన్ రైజింగ్ లయన్” పేరుతో ఇజ్రాయెల్ వందకు పైగా బాంబులతో విరుచుకుపడింది. అదే స్థాయిలో ఇరాన్ ప్రతిస్పందించింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇరుదేశాల మధ్య భీకర దాడులు కొనసాగుతున్న సమయంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు.ఇరాన్ ఇప్పటికైనా తమతో అణు ఒప్పందంపై చర్చలకు రావాలని చెప్పారు. లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా ఇరాన్ స్పందించింది. తమ అణు కార్యక్రమంపై అమెరికాతో చర్చలు జరపడం ఇక అర్థరహితమని పేర్కొంది. తమపై దాడి చేసేందుకు ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు పలికిందని ఆరోపించింది.

ఇరుదేశాల మధ్య

ఒకవైపు ఇరాన్‌పై అమెరికా దాడులకు మద్దతునిస్తూనే, మరోవైపు అణు ఒప్పందంపై చర్చలకు ఆహ్వానించడం సరైన చర్య కాదని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘై పేర్కొన్నారు. అమెరికా అనుమతి లేకుండా ఇజ్రాయెల్ (Israel) తమపై దాడి చేసే అవకాశమే లేదని అన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య ఒమన్ మధ్యవర్తిత్వంలో చర్చలు జరుగుతున్నాయి. దీనిపై ఇప్పటివరకు ఇరుదేశాల మధ్య 5 సార్లు చర్చలు జరిగినప్పటికీ ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. ఆదివారం ఆరోసారి చర్చలు జరగాల్సి ఉంది. అయితే, ప్రస్తుత యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఈ చర్చలు జరుగుతాయా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది.

ఆర్థిక ఆంక్షలు

ఇరాన్, అమెరికా మధ్య అణు ఒప్పందంపై సూదీర్ఘ కాలంగా చర్చలు జరుగుతున్నాయి. తమ అణు కార్యక్రమం శాంతియుత ప్రయోజనాలు, విద్యుత్ ఉత్పత్తి కోసమే అని ఇరాన్ వాదిస్తుండగా పశ్చిమ దేశాలు (ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్) అణ్వాయుధాల తయారీకి రహస్య ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించాయి. ఫలితంగా ఐక్యరాజ్యసమితి, అమెరికా, యూరోపియన్ యూనియన్ ఇరాన్‌పై తీవ్ర ఆర్థిక ఆంక్షలు విధించాయి. ఈ క్రమంలో 2000ల మధ్యలో ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంపై ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి వచ్చింది. 

Iran

ఒప్పందం ప్రకారం

దీంతో P5+1 దేశాలతో (చైనా, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా) పాటు యూరోపియన్ యూనియన్ (EU) ఇరాన్‌తో చర్చలు ప్రారంభించాయి. సుదీర్ఘ చర్చల తరువాత 2015లో ఇరాన్, P5+1 దేశాల మధ్య జాయింట్ కాంప్రెహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ (JCPOA) ఒప్పందం కుదిరింది.ఈ ఒప్పందం ప్రకారం ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని గణనీయంగా తగ్గించుకోవాలి. యురేనియం శుద్ధి పరిమితులను పాటించాలి. సెంట్రిఫ్యూజ్‌ల సంఖ్యను తగ్గించుకోవాలి. ఇరాన్ అణు కేంద్రాలపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) తనిఖీలను నిర్వహించడానికి అనుమతించాలి. దీనికి ప్రతిగా ఇరాన్‌పై విధించిన ఆర్థిక ఆంక్షలను పాక్షికంగా లేదా పూర్తిగా ఎత్తివేయాలి. 

ఇరాన్‌పై ఆంక్షలు

2018లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో JCPOA నుంచి అమెరికా బయటకు వచ్చింది. అనంతరం ఇరాన్‌పై ఆంక్షలు విధించారు. దీంతో ఇరాన్ కూడా ఒప్పందాన్ని బేఖాతరు చేస్తూ యురేనియం (Uranium) శుద్ధి స్థాయిని పెంచడం, కొత్త సెంట్రిఫ్యూజ్‌లను తయారు చేయడం మొదలు పెట్టింది. 2021లో బైడెన్ అధికారంలోకి వచ్చి ఇరాన్‌తో చర్చలను మళ్లీ కొనసాగించాలని చూశారు. అయితే తమపై ఉన్న ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని ఇరాన్ డిమాండ్ చేసింది. ఇటీవల, ఒమన్ వంటి దేశాల మధ్యవర్తిత్వంతో ఇరాన్, అమెరికా మధ్య పరోక్ష చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్, ఇరాన్ అణు స్థావరాలపై దాడులు చేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినట్లు అయింది. ఇరాన్ తాజా ప్రకటనతో ఈ చర్చలు పూర్తిగా ఆగిపోయే అవకాశమూ లేకపోలేదు. దీంతో ఇరాన్ మళ్లీ తన అణు కార్యక్రమాన్ని మొదలుపెట్టే,అవకాశం కూడా ఉంది. ఇరాన్ అణు ఒప్పందంపై ప్రస్తుతం అనిశ్చితి కొనసాగుతోంది.

Read Also: Israel: భారత్ కు జమ్మూ కాశ్మీర్ విషయంలో క్షమాపణలు కోరిన ఇజ్రాయెల్

#IranAmericaTensions#NuclearTalks #IsraelIranTensions #MiddleEastConflict #OperationRisingLion Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.