📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Iran: హర్మూజ్ జలసంధిని మూసేస్తామని ఇరాన్ వార్నింగ్

Author Icon By Vanipushpa
Updated: June 20, 2025 • 5:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

vaartha.comఇజ్రాయిల్ ఇరాన్(Israel, Iran) యుద్ధం 8వ రోజు కొనసాగుతూనే ఉంది. దాడులు ఆపాలని ఇరాన్‌కు అమెరికా హెచ్చరికలు చేస్తూనే ఉంది. అయితే ఆ హెచ్చరికలకు ఏ మాత్రం భయపడని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ(Khamenei).. ఇజ్రాయెల్(Israel) దాడులను తిప్పికొడుతూ.. ప్రతిదాడులు చేస్తూనే ఉన్నారు. ఇరాన్‌పై ఒత్తిడి పెరిగిపోతుండటంతో.. ఇప్పుడు ఆ దేశం బెదిరింపులకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలోనే హర్మూజ్ జలసంధి ని మూసివేస్తామని ఇరాన్ బెదిరిస్తోంది. ప్రపంచంలోని రోజువారీ చమురు వినియోగంలో 20 శాతం ఈ హర్మూజ్ జలసంధి నుంచే ప్రయాణిస్తుండటంతో.. ఒకవేళ ఈ మార్గాన్ని ఇరాన్ మూసివేస్తే.. ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆయిల్ దిగుమతులపై పూర్తిగా ఆధారపడిన భారత్, చైనా సహా అనేక దేశాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని నిపుణులు తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు.

హర్మూజ్ జలసంధిని మూసేస్తామని ఇరాన్ వార్నింగ్

చమురులో 20 శాతం ఈ హర్మూజ్ జలసంధి నుంచే..
అరేబియా(Arabia) సముద్రాన్ని, పర్షియన్ గల్ఫ్ ప్రాంతాన్ని కలిపే ఇరుకైన సముద్ర మార్గమే ఈ హర్మూజ్ జలసంధి. ఈ సన్నటి మార్గం కేవలం 33 కిలోమీటర్లు (21 మైళ్లు) వెడల్పు ఉంటుంది. ప్రపంచ దేశాలు నిత్యం వినియోగించే చమురులో 20 శాతం ఈ హర్మూజ్ జలసంధి నుంచే ప్రయాణిస్తుంది. కువైట్, బహ్రైన్, ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా, ఇరాన్ వంటి దేశాలు చేసే చమురు ఎగుమతులు కూడా ఈ మార్గం ద్వారానే జరుగుతాయి. ఈ హర్మూజ్ జలసంధి ప్రాంతంలోని చాలా ద్వీపాలు ప్రస్తుతం ఇరాన్ ఆధీనంలోనే ఉన్నాయి. అంతేకాకుండా ఆ ప్రాంతంలో ఇరాన్ సైనిక ఉనికి కూడా చాలా బలంగా ఉంది. “మమ్మల్ని అణగదొక్కితే, ప్రపంచాన్ని మేము గడగడలాడగలము” అనే రాష్ట్ర ధోరణి హర్మూజ్ వద్ద ఉన్న ద్వీపాలు, సముద్ర ప్రాంతాలు ఇప్పటికే ఇరాన్ ఆధీనంలో ఈ హర్మూ్జ్ జలసంధిని మూసివేయడం ద్వారా తమ శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఇరాన్‌కు ఉపయోగపడుతుందని ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రతా కమిటీ ప్రెసిడియం సభ్యుడు బెహ్నామ్ సయీది గురువారం మీడియాకు వెల్లడించడం గమనార్హం.
భారత్, చైనాలపై తీవ్ర ప్రభావం
హర్మూజ్ జలసంధిని మూసివేస్తామన్న ఇరాన్ హెచ్చరికలు.. ఇప్పుడు ప్రపంచాన్ని తీవ్రంగా భయపెడుతున్నాయి. ముఖ్యంగా ఆయిల్ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడిన భారత్, చైనా వంటి దేశాలకు ఇది తీవ్ర ప్రమాదంగా మారుతుందని నిపుణులు అప్రమత్తం చేస్తున్నారు. ఈ హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే చమురు ఎగుమతుల్లో 82 శాతం ఆసియా దేశాలకు వెళ్తున్నాయి. వీటిలో భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా దేశాలకే ఏకంగా 67 శాతం వెళ్తోంది. భారత ముడి చమురులో 90 శాతం మిడిల్ ఈస్ట్ దేశాల నుంచే దిగుమతి అవుతుంది. ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు పెరుగుతాయి, దినసరి వస్తువుల ధరలు పెరుగుతాయి, ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరుతుంది

ఇందులో 40 శాతం హర్మూజ్ జలసంధి నుంచే వస్తుండటంతో ఇది భారత్‌కు ఎంత కీలకమో అర్థం అవుతోంది. ఒకవేళ ఇరాన్ ఈ హర్మూజ్ జలసంధిని మార్గాన్ని మూసేస్తే.. ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరిగి.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందనే ఆందోళనలు ఉన్నాయి. ఇరాన్ ఈసారి చేసిన హెచ్చరిక కేవలం మాటల బెదిరింపు కాదు. ఇది చమురు ఆధారిత దేశాలకు ధమకా. గల్ఫ్ ఆర్థిక పరిస్థితులు, భారత్ వంటి పెద్ద దేశాల ద్రవ్యనీతిపై దీని ప్రభావం భారీగానే ఉంటుంది. యుద్ధం కొనసాగితే – ప్రపంచ ఆర్థిక వ్యవస్థ* పాతాళానికి వెళ్లే ప్రమాదం ఉంది.

Read Also: Rivers: ప్రపంచంలో అతి పొడవైన నదులు ఏవో తెలుసా?

#GeopoliticalCrisis #HormuzStrait #IndiaOilDependency #IranIsraelWar #telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.