Iran War: ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

Read Time:  1 min
ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు
ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు
FONT SIZE
GET APP

అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం పతాక స్థాయికి చేరడంతో ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు తారుమారు అవుతున్నాయి. ముఖ్యంగా హర్మూజ్ (Hormuz) జలసంధి వద్ద ఉద్రిక్తతలు పెరుగడంతో భారత్‌లో వంట గ్యాస్ (LPG) సరఫరా సమస్యగా మారింది. గ్యాస్ ఏజెన్సీల ముందు ప్రజలు కిలోమీటర్ల మేర క్యూ వరుసల్లో నిలబడి ఎదురుచూస్తున్నారు. అయితే ఇదే సమయంలో పెట్రోల్, డీజిల్ సరఫరాపై ఎలాంటి ప్రభావం లేదు. ఈ భిన్న ప్రభావానికి ముఖ్య కారణాలు ముడి సరఫరా మార్గాలు, నిల్వ సామర్థ్యం, వాణిజ్య ప్రాధాన్యతలతో సంబంధం కలిగి ఉన్నాయి. భారత్ ఎల్‌పీజీ అవసరాలలో సుమారు సగానికి పైగా దిగుమతులపై ఆధారపడుతుంది. ప్రధానంగా సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ వంటి గల్ఫ్ దేశాల నుండి LPG నౌకల ద్వారా వస్తుంది. ఈ నౌకలన్నీ హర్మూజ్ జలసంధి గుండానే ప్రయాణించాలి. యుద్ధం కారణంగా ఈ మార్గం మూసివేయబడడంతో LPG సరఫరా నిలిచిపోయింది.

Read Also: USA attack Kharg Island: ఇరాన్ ‘కిరీట రత్నం’ ఖార్గ్ ద్వీపంపై అమెరికా బాంబుల వర్షం!

Iran War: Iran War.. People's troubles due to cooking gas crisis
Iran War: Iran War.. People’s troubles due to cooking gas crisis

నిల్వ సామర్థ్యంలో కూడా LPG‑కు, ముడి చమురుకు మధ్య వ్యత్యాసం

అయితే, దేశంలో వాహన ఇంధన కోసం అవసరమైన ముడి చమురు 40 కి పైగా దేశాల నుంచి దిగుమతి అవుతుంది. రష్యా నుంచి వచ్చే చమురుకు హార్ముజ్ మార్గం అవసరం లేకపోవడం వలన 70 శాతం ముడి చమురు సరఫరా సురక్షితంగా కొనసాగుతుంది. నిల్వ సామర్థ్యంలో కూడా LPG‑కు, ముడి చమురుకు మధ్య వ్యత్యాసం గమనార్హంగా చెప్పుకోవచ్చు. వాహన ఇంధన కోసం విశాఖపట్నం, మంగళూరు వంటి చోట్ల వారాల తరబడి సరిపోతున్న వ్యూహాత్మక నిల్వలు ఉన్నాయి. LPG కే దేశంలో నిల్వ సామర్థ్యం తక్కువగా ఉంది. అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) ప్రకారం.. భారత్‌లో ఉన్న LPG రెండు రోజులు మాత్రమే ఉపయోగించడానికి సరిపోతుంది. గత దశాబ్దంలో ఉజ్వల పథకం ద్వారా LPG కనెక్షన్లు 10 కోట్ల నుంచి 33 కోట్లకు పెరగడంతో.. వంట గ్యాస్ కొరత తీవ్రత ఇంకా పెరిగింది. గ్యాస్ సంక్షోభంపై కేంద్రం కీలక ప్రకటన.. బుక్ చేసిన LPG డెలివరీ రెండు రోజుల్లో అవుతుందని వెల్లడి.. ప్రస్తుత పరిస్థితిలో ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ సరఫరాకు భరోసా ఇచ్చింది. LPG విషయంలో గృహ వినియోగదారులకే ప్రాధాన్యత ఇచ్చి, వాణిజ్య సిలిండర్ల అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.