📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Iran: అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటాం: ఇరాన్

Author Icon By Vanipushpa
Updated: June 23, 2025 • 10:46 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా, ఇజ్రాయెల్(America-Israel) ఇటీవల చేపట్టిన వైమానిక దాడులపై ఇరాన్(Iran) రాయబారి అమీర్ సయీద్ ఇరావానీ తీవ్రంగా స్పందించారు. అమెరికాపై తగిన సమయంలో స్పందిస్తామని పేర్కొన్నారు. ఆదివారం న్యూయార్క్​(Newyork)లో జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(UNI) అత్యవసర సమావేశంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. అలాగే ఈ సమావేశంలో రష్యా, ఇరాన్ ప్రతినిధులు కూడా స్పందించారు. ‘తమకు పూర్తి రక్షణ హక్కు ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడులపై ఇరాన్ తగిన విధింగా స్పందిస్తుంది. ఆ స్పందన ఎప్పుడు, ఎలా, ఏ స్థాయిలో ఉంటుందో ఇరాన్ సైనిక బలగాలే నిర్ణయించేది. మరోవైపు దౌత్యాన్ని ఇజ్రాయెల్(Israel) ధ్వంసం చేసింది. ఇజ్రాయెల్ ఉద్దేశపూర్వకంగా దౌత్య మార్గాన్ని నాశనం చేసింది. తాము సమాధానానికి సిద్ధంగా ఉన్నట్టు ఇజ్రాయెల్ నటించినా, అది అంతర్జాతీయ సమాజాన్ని మభ్యపెట్టే ప్రయత్నమే అవుతుంది’ అని ఆయన అన్నారు.

Iran: అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటాం: ఇరాన్

ఇజ్రాయెల్‌పై ఘాటు విమర్శలు
పాశ్చాత్య దేశాలపై కూడా ఇరావానీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పాశ్చాత్య దేశాలు ఇరాన్ చర్చల తిరిగి రావాలని అంటున్నాయని, అసలు తాము చర్చల నుంచి బయటకు వెళ్లలేదన్నారు. తమ మా విదేశాంగ మంత్రి ఇప్పటికే స్పష్టం చేశారని గుర్తు చేశారు. చర్చలు జరుగుతున్న వారంలోనే అమెరికా ఈ దాడులు చేసిందని, వాటిని చూసి ఏ నేర్చుకోవాలని ఆయన అడిగారు. ఇలాంటి చర్యలు అత్యంత రాజకీయ ఉద్దేశ్యాలతో చేసినవి అని, అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమైనవిగా అభివర్ణించారు. ఇరాన్‌లో పౌరుల ప్రాణనష్టానికి, ముఖ్యంగా మహిళలు, పిల్లలు మృతి చెందటానికి, అత్యవసర సదుపాయాల వినాశనానికి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ పూర్తిగా బాధ్యత వహించాలని ఘాటుగా స్పందించారు. ఈ సమయంలో భద్రతా మండలి తగిన చర్యలు తీసుకోకపోతే అంతర్జాతీయ శాంతి భద్రతను కాపాడే బాధ్యతను, విశ్వసనీయతను శాశ్వతంగా కోల్పోతుందని ఇరావానీ స్పష్టం చేశారు.
ఇజ్రాయెల్ స్పందన – “బెదిరింపుల తొలగింపు”
ఇరాన్‌పై అమెరికా జరిపిన వైమానిక దాడులపై అత్యవసర సమావేశంలో రష్యా ఐక్యరాజ్యసమితి రాయబారి వాసిలీ నెబెంజియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా ‘పాండోరా బాక్స్’ తెరిచిందని, దీనివల్ల ప్రపంచ భద్రతకు ప్రమాదకరమైన పరిణామాలు తలెత్తవచ్చని హెచ్చరించారు. ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వడంలో భాగంగా అమెరికా లక్షలాది పాలస్తీనీయ మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధుల హత్యలను కూడా ఉపేక్షిస్తోందన్నారు. ఇరాన్ అణు సమస్య పరిష్కారానికి తమ మధ్యవర్తిత్వ ప్రతిపాదనను అమెరికా నిర్లక్ష్యం చేసిందని నెబెంజియా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పరిస్థితికి పూర్తి బాధ్యత అమెరికాదేనని స్పష్టం చేశారు.

రష్యా మధ్యవర్తిత్వ ప్రతిపాదనను అమెరికా నిర్లక్ష్యం చేసిందని నెబెంజియా ఆరోపించారు. ఇరాన్ అణు సమస్యపై శాంతియుత పరిష్కారం కోసం రష్యా మధ్యవర్తిత్వం చేయాలని సూచించామని, కానీ అమెరికా అలా చేయడానికి ఆసక్తి చూపలేదన్నారు. ఈ రోజు పరిస్థితికి పూర్తి బాధ్యత అమెరికా వహించాలని ఆయన స్పష్టం చేసారు. ఈ ఉద్రిక్తతను తగ్గించకపోతే మధ్యప్రాచ్యంలో భారీస్థాయి యుద్ధానికి దారితీయవచ్చని ఆయన హెచ్చరించారు. ఇది ప్రపంచ మొత్తం భద్రతా వ్యవస్థకు గణనీయమైన ముప్పు కావచ్చని హెచ్చరించారు.
‘అతిపెద్ద ముప్పును అమెరికా తొలగించింది’
ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులపై ఇజ్రాయెల్ ఐక్యరాజ్యసమితి శాశ్వత ప్రతినిధి డ్యానీ డానాన్ కొనియాడారు. ఈ దాడులను ఆయన మానవాళికి ఉన్న అతిపెద్ద ముప్పును తొలగించే కీలక చర్యగా అభివర్ణించారు. అయినా దాన్ని కొన్ని దేశాలు దాన్ని తప్పుపడుతున్నాయని భద్రతా మండలి సభ్యులను ప్రశ్నించారు. ఇరాన్ పౌర వినియోగానికి మించిన స్థాయిలో యూరేనియం ఎన్ని టైమ్స్ శుద్ధి చేస్తే మీరు మౌనంగా అంటారని అడిగారు. ‘ఇజ్రాయెల్‌ను నాశనం చేయాలన్న వారి ఆలోచలన గురించి మీరు ఎందుకు స్పందించలేకపోయారు?’ నిలదీశారు. ఈ ఘర్షణలు, విమర్శలు, హెచ్చరికలు చూస్తుంటే, మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ పరిస్థితులు నెలకొనే ప్రమాదం కనిపిస్తోంది. ప్రపంచ శాంతి భద్రతకు ఇది మరో పెద్ద పరీక్షగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇరాన్ చర్చల ముసుగులో రహస్యంగా రాకెట్లు నిర్మించడంలో యూరేనియం శుద్ధిలో పురోగమించిందన్నారు. వారికి అన్ని అవకాశాలు ఇచ్చామన్నారు. కానీ వారు మారకపోతే, మార్చాల్సిన అవసరమే వచ్చిందని స్పష్టం చేశారు.

Read Also: Israel vs Iran : ఇజ్రాయెల్ పై మిస్సెల్స్ లాంచ్ చేసిన ఇరాన్

#IranVsUSA #IsraelIranTensions #UNSecurityCouncil #MiddleEastConflict #IranAirstrikeResponse #RussiaOnIranCrisis #IsraelNuclearThreat #USAirstrikes #WesternHypocrisy #GlobalSecurityThreat #IsraelNuclearThreat #telugu News #WesternHypocrisy Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Israeli attacks Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today us

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.