అణు ఒప్పందంపై నిరాకరణ, ఖమేనీ ఘాటు హెచ్చరికలు
అణు చర్చలకు తలూపని ఇరాన్
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్(Iran Defence Minister Abbas) తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. “అమెరికా(America)తో ఎలాంటి అణు చర్చలు(Nuclear meeting) జరిపే ఉద్దేశం లేదు,” అని ఆయన స్పష్టం చేశారు. అలాగే అమెరికా ఇటీవల నిర్వహించిన వైమానిక దాడుల్లో గణనీయమైన నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ఇరాన్ అణు కార్యక్రమం పునరుద్ధరణపై నిపుణులు అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు.
ట్రంప్ వ్యాఖ్యలకు విరుద్ధంగా..!
ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, “వచ్చే వారం టెహ్రాన్‌తో అణు చర్చలు జరుపుతాం,” అని నాటో శిఖరాగ్ర సమావేశంలో పేర్కొన్నారు. అణుశక్తి కార్యక్రమం విరమించాలని ఒత్తిడి చేయడంలో భాగంగా, చమురుపై ఆంక్షలు సడలించే అవకాశం ఉన్నట్లు కూడా సంకేతాలు ఇచ్చారు.
వైట్‌హౌస్ అధికారిక ప్రకటన
అయితే ట్రంప్ వ్యాఖ్యల తర్వాత, వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లీవిట్ స్పందిస్తూ,
“ఇరాన్‌తో ప్రస్తుతం ఎలాంటి చర్చలు జరగడంలేదు,”
అని స్పష్టం చేశారు. అయితే ఖతార్‌తో మధ్యవర్తిత్వం కొనసాగుతుందని పేర్కొన్నారు.
ఖమేనీ ఘాటు హెచ్చరిక
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మాట్లాడుతూ, “అమెరికాను చాచి చెంపదెబ్బ కొట్టాం,”
అని వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్‌పై విజయం సాధించామని, ఖతార్‌లోని అమెరికా బేస్‌పై క్షిపణులు విసిరామని వెల్లడించారు.
ఇరాన్–ఇజ్రాయెల్ ఘర్షణలు: ఘోర పరిణామాలు
జూన్ 13: ఇజ్రాయెల్, ఇరాన్ అణు స్థావరాలపై దాడులు
ఇరాన్ కూడా ప్రతీకారంగా క్షిపణుల వర్షం కురిపించింది
జూన్ 22: అమెరికా ప్రత్యక్షంగా యుద్ధంలోకి వచ్చి, ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేసింది
తీరా జూన్ 25: ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించారు
కాల్పుల విరమణకు అంగీకారం
ట్రంప్ ప్రకటన అనంతరం, ఇరాన్ మరియు ఇజ్రాయెల్ రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఇది తాత్కాలిక నిశ్చలతను తీసుకొచ్చినా, అణు చర్చల అంశంలో విభేదాలు కొనసాగుతున్నాయి.
ఇరాన్ అణుశక్తిపై అమెరికా ఒత్తిడి పెరుగుతున్నా, ఇరాన్ అధికారికంగా చర్చలకు నిరాకరించడం వల్ల పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. దాదాపు 12 రోజులపాటు ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య భీకర ఘర్షణలు జరిగాయి. దీనితో పశ్చిమాసియాలో కల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. జూన్ 13న ఇరాన్‌లోని అణు స్థావరాలు, మిలిటరీ కమాండర్లు, శాస్త్రవేత్తలు లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం కురిపించింది.
అయితే జూన్ 22న ఇరాన్‌లోని అణు స్థావరాలపై అమెరికా దాడి చేసి, నేరుగా యుద్ధంలోకి ప్రవేశించింది. అయితే అనూహ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని ప్రకటించారు. అనంతరం కాల్పుల విరమణకు ఇరాన్, ఇజ్రాయెల్ రెండూ అంగీకారానికి వచ్చాయి.