📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర

Iran: ఖమేనీ పాలన పతనమైతే ఇరాన్ పరిస్థితి ఏంటి?

Author Icon By Vanipushpa
Updated: June 20, 2025 • 2:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఇజ్రాయెల్ ఇరాన్‌(Israel, Iran) లోని ప్రముఖ సైనిక అధికారులు, ప్రముఖులను లక్ష్యంగా చేసుకుంది. ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ సంచలన ప్రకటన చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ(Khamenei) కథ ముగిస్తామని ప్రకటించింది. తాజాగా టెల్ అవీవ్‌లోని ఓ ఆస్పత్రిపై మిస్సైల్స్‌తో ఇరాన్ దాడులు చేసింది. ఈ దాడికి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనినే బాధ్యత వహించాలంటూ పేర్కొన్న ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్.. త్వరలోనే ఖమేనీ కథను ముగిస్తామని.. ఇరాన్ దేశాన్ని ఖమేనీ విముక్త దేశంగా మారుస్తామని ప్రకటించారు. జూన్ 13 నుంచి రెండు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతుండగా.. పోటాపోటీగా దాడులు జరుపుతున్నాయి.
మళ్లీ రెజా పహ్లావీ మద్ధతుదారుల చేతికి అధికారం వస్తుందా?
ఇజ్రాయెల్ ఖమేనీ పాలనను అంతం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ (Iran Islamic Republic)వ్యతిరేక వర్గాలు కూడా ఇలాగే కొనసాగితే త్వరలోనే ఖమేని పాలన అంతమవుతుందని భావిస్తున్నాయి. ఈ చర్చలు, వాదనల నేపథ్యంలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఖమేనీ పాలన పతనమైతే ఇరాన్ పరిస్థితి ఏంటి? మళ్లీ రెజా పహ్లావీ మద్ధతుదారుల చేతికి అధికారం వస్తుందా లేదా మరేదైనా సముహం పగ్గాలు చేపడుతుందా?.. ఖమేనీ తర్వాత ఇరాన్ విడిపోవచ్చని కూడా వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో ఇరాన్‌కు చెందిన బహిష్కృతి నాయకుడు ఇమాన్ ఫోరోటాన్..(Iman Foroutan) అధికార మార్పిడి తర్వాత ఇరాన్ విడిపోవచ్చని, వాయవ్య ఇరాన్‌లో నివసించే కుర్దులు ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.

Iran: ఖమేనీ పాలన పతనమైతే ఇరాన్ పరిస్థితి ఏంటి?

ఇరాన్ జాతి, మతపరమైన వైవిధ్యం ప్రధాన కారణం
ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణల మధ్య, ఇరాన్‌లో ఖమేనీ పాలన పతనమైతే దేశం విడిపోయే అవకాశం ఉందని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ సంభావ్యత వెనుక ఇరాన్ జాతి, మతపరమైన వైవిధ్యం ప్రధాన కారణంగా ఉంది. ఇరాన్‌లో ఎక్కువ మంది షియా ముస్లింలే.. ఈ ఊహాగానాలకు కారణాలను తెలుసుకోవాలంటే, ఇరాన్ జాతి నిర్మాణాన్ని పరిశీలించడం అవసరం. ముఖ్యంగా ఇక్కడి జనాభా, వివిధ ప్రాంతాలలో నివసించే విభిన్న సాంస్కృతిక, మతపరమైన కమ్యూనిటీల స్థితిగతులు ఏమిటో తెలుసుకోవాలి. ఇటీవలి నివేదిక ప్రకారం, ఇరాన్ అంచనా జనాభా 87.6 మిలియన్లు ఉంటుంది. ఇరాన్ ప్రభుత్వ అంచనా ప్రకారం, ఇక్కడి జనాభాలో 99.4 శాతం మంది ముస్లింల. , వీరిలో 90 నుండి 95 శాతం మంది షియాలు. 5 నుండి 10 శాతం మంది సున్నీలు ఉన్నారు. కేవలం 5 నుండి 10 శాతం సున్నీ జనాభా ఇరాన్‌లో ఎక్కువ మంది సున్నీలు తుర్క్‌మెన్, అరబ్, బలూచ్, కుర్దులు. వీరిలో తుర్క్‌మెన్ ఇరాన్ ఉత్తర తూర్పున, అరబ్‌లు నైరుతిలో, బలూచ్‌లు ఆగ్నేయంలో, కుర్దులు వాయవ్య ప్రావిన్సులలో నివసిస్తున్నారు.
స్వయంప్రతిపత్తి లేదా స్వాతంత్య్రం కోసం డిమాండ్
ఇరాన్ ఈ వైవిధ్యమైన జాతీ, మతపరమైన నిర్మాణం జాతి జాతీయవాదం అనే భావనను ప్రేరేపిస్తుంది. కుర్దులు, బలూచీలు, అరబ్బులు వంటి కమ్యూనిటీలలోని కొంతమంది సభ్యులు చాలా కాలంగా మరింత స్వయంప్రతిపత్తి లేదా స్వాతంత్య్రం కోసం డిమాండ్ చేస్తున్నారు. ఖమేనీ పాలన పతనమైతే కేంద్ర అధికారం బలహీనపడే అవకాశం ఉంది. ఈ పరిస్థితి ఈ సమూహాలకు తమ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి, విచ్ఛినకర ఉద్యమాలను తీవ్రతరం చేసుకోవడానికి అవకాశం కల్పించవచ్చు. ఖమేనీ పాలన పతనమైన పక్షంలో, అధికారం కోసం పలువురు పోటీదారులు ముందుకు రావచ్చు. వీరిలో రజా పహ్లావీ మద్దతుదారులు లేదా ఇతర ఇస్లామిక్ లేదా జాతీయవాద సమూహాలు ఉండవచ్చు.

Read Also: Pakistan : మా సైనిక స్థావరాలపై భారత్‌ దాడి నిజమే : పాక్‌ ఉప ప్రధాని

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu if the regime falls? Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today to Iran Today news What will happen

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.