America: ఇరాన్ అణు చర్చల్లో పురోగతి..విభేదాలకు స్వస్తి!

Read Time:  1 min
ఇరాన్ అణు చర్చల్లో పురోగతి..భేదాలకు స్వస్తి!
ఇరాన్ అణు చర్చల్లో పురోగతి..భేదాలకు స్వస్తి!
FONT SIZE
GET APP

అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న అణు చర్చల్లో కొంత పురోగతి నమోదైనట్లు అగ్రరాజ్యం వెల్లడించారు. చర్చల్లో ఇంకా పరిష్కరించాల్సిన అంశాలు ఉన్నాయని సంబంధిత అధికారి తెలిపారు. మిగిలిన విభేదాలను తీర్చేందుకు ఇరాన్(Iran) వచ్చే రెండు వారాల్లో వివరణాత్మక ప్రతిపాదనలతో తిరిగి వస్తుందని చెప్పారు. ‘చర్చల్లో పురోగతి కనిపించింది. అయితే ఇంకా చాలా వివరాలు నిర్ణయించాల్సి ఉంది. మా మధ్య ఉన్న భేదాలపై ఇరాన్ రెండు వారాల్లో వివరమైన ప్రతిపాదనలు తీసుకొస్తామని తెలిపింది’ అని అమెరికా(America) అధికారి తెలిపారు. అయితే ఈ చర్చల్లో మార్గదర్శక సూత్రాలను ఇరుదేశాల మధ్య ఒప్పందానికి వచ్చినట్లు ఇరాన్ చెబుతోంది.

Read Also: Bangladesh: ఇతర దేశాల ఆదేశాల ద్వారా ఢాకా నడచుకోదు: యూనస్

trump and khamenei
America: ఇరాన్ అణు చర్చల్లో పురోగతి..భేదాలకు స్వస్తి!

హర్మూజ్ జలసంధిలో ఇరాన్ సైనిక చర్యలు

జెనీవా వేదికగా అమెరికా-ఇరాన్‌ మధ్య జరిగిన అణు చర్చలు జరిగాయి. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్​కాఫ్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ ఇరాన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ చర్చలు మూడు గంటల్లోనే ముగిశాయి. ఇవి ఒమన్ మధ్యవర్తిత్వంతో జరిగినట్టు సమాచారం. మరోవైపు చర్చలు జరుగుతున్న సమయంలోనే హర్మూజ్ జలసంధిలో ఇరాన్ సైనిక చర్యలు చేపట్టింది. అందుకోసం కొన్ని గంటల పాటు జలసంధిని మూసివేసింది. అంతేకాకుండా లైవ్ క్షిపణులను ప్రయోగించింది. అదే ప్రాంతంలో అమెరికా కూడా సైన్యాన్ని మోహరిస్తోంది.

ఘాటుగా స్పందించిన ఇరాన్ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ

దీనికి ప్రతీగా ఇరాన్ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ కూడా ఘాటుగా స్పందించారు. ప్రపంచంలో బలమైన సైన్యానికైనా ఒక రోజు దెబ్బ తగిలితే తిరిగి లేచే అవకాశం ఉండకపోవచ్చని హెచ్చరించారు. అమెరికా నౌకాదళ ఉనికిపై వ్యాఖ్యానిస్తూ, సముద్రంలో యుద్ధనౌకలు ఉన్నా వాటిని ముంచగల ఆయుధాలు ఉన్నాయని సూచించారు. ఈ మేరకు ఎక్స్​ వేదికగా వరసగా పోస్టులు చేశారు. ‘ఇస్లామిక్ రిపబ్లిక్​ను నాశనం చేయాలనే అమెరికాకు ఎప్పటికీ విజయం సాధించలేదు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యం అమెరికాదే అని డొనాల్డ్ ట్రంప్ చెబుతూ వస్తున్నారు. అయితే, ఒక్కోసారి అది కోలుకోలేనంత దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇరాన్‌ దిశగా యుద్ధ నౌకలను పంపినట్లు ప్రకటనలు చేస్తున్నారు. ఆ నౌకలు నిజంగా ప్రమాదకరమైనవి. కానీ, వాటిని సముద్రంలో ముంచేసే సామర్థ్యమున్న ఆయుధం మరింత ప్రమాదకరం అలీ ఖమేనీ అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.