ఇరాన్‌లోని ప్రముఖ అణు కేంద్రాలైన నంతాజ్, ఫోర్డో, ఇస్ఫాహాన్‌లపై అమెరికా వైమానిక దాడులు జరిపినట్టు మూడు రోజుల క్రితం ట్రంప్ ఘనంగా ప్రెస్‌మీట్ నిర్వహించి ప్రకటించారు. అయితే, తాజాగా వెలుగులోకి వచ్చిన US ఇంటెలిజెన్స్ రిపోర్టుల ప్రకారం ఈ దాడుల్లో గణనీయమైన నష్టం సంభవించలేదు.
ట్రంప్ ప్రకటనలతో విరుద్ధంగా ఇంటెలిజెన్స్ నివేదిక
ట్రంప్ చెప్పినట్లుగా అణు కేంద్రాలు పూర్తిగా నాశనం కాలేదు. దీనికి సంబంధించి శాటిలైట్ చిత్రాలను కూడా అమెరికన్ ఇంటెలిజెన్స్ విడుదల చేసింది. ఈ ఘటన ట్రంప్ స్థాయిలో చేసిన ప్రకటనల విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తేలా చేసింది.
దాడులకు ముందే 400 కిలోల యురేనియం తరలింపు
అమెరికా దాడులకు ముందే ఇరాన్ వ్యూహాత్మకంగా 400 కిలోల యురేనియంను రహస్య ప్రదేశాలకు తరలించినట్లు సమాచారం. ఇది దాదాపు 10 అణు బాంబులు తయారీకి సరిపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే దాడులకు ముందే ఇరాన్ ముందుజాగ్రత్తలు తీసుకుంది.
యుద్ధం ముగిసిన వెంటనే అణుశక్తిపై దృష్టి
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముగియగానే, ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌ను తిరిగి ప్రారంభించనుందని అధికారికంగా ప్రకటించింది. అమెరికా హెచ్చరికలకూ, ట్రంప్ వార్నింగ్లకూ అసలు విలువ ఇవ్వకుండా ఈ నిర్ణయం తీసుకుంది.
వైట్ హౌస్ ఆగ్రహం: ట్రంప్‌ను టార్గెట్ చేస్తున్నారా?
ఇంటెలిజెన్స్ రిపోర్టుల లీక్‌పై వైట్ హౌస్ తీవ్రంగా స్పందించింది. ట్రంప్‌ను కించపరిచే ఉద్దేశంతోనే ఈ నివేదికలు లీక్ అవుతున్నాయని ఆరోపించింది. నిజంగా నివేదికలు లీక్ చేయడమే తప్పా? లేదా ట్రంప్ వైఫల్యాన్ని కప్పిపుచ్చే యత్నమా? అనే సందేహాలు వ్యాప్తిలో ఉన్నాయి.
శాంతి చర్చలు కంటే వ్యూహాత్మక ఆటలు?
ఇరాన్-American సంబంధాల్లో ఈ తాజా పరిణామాలు శాంతి ప్రయత్నాలకంటే వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నట్టు స్పష్టమవుతోంది. ఇరాన్ మాటలు కాకుండా చర్యలే ముఖ్యమని ప్రపంచం చూస్తోంది.
Read Also: Axiom-4 : నేడు అంతరిక్షంలోకి శుభాంశు శుక్లా