📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Rafael Grossi: అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!

Author Icon By Vanipushpa
Updated: June 23, 2025 • 5:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇరాన్‌లోని ఫోర్డో భూగర్భ అణు కేంద్రం(Nuclear)పై అమెరికా జరిపిన వైమానిక దాడిలో తీవ్రమైన నష్టం వాటిల్లి ఉంటుందని ఐక్యరాజ్యసమితి అణు పర్యవేక్షక సంస్థ అధిపతి రఫెల్ మరియానో గ్రోస్సీ వెల్లడించారు. అత్యాధునిక బంకర్-బస్టర్ (Bunker blaster) బాంబులను ఈ దాడిలో ఉపయోగించినట్లు ఆయన తెలిపారు. వియన్నా(Vienna)లో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) అధిపతి గ్రోస్సీ మాట్లాడుతూ, “దాడిలో ఉపయోగించిన పేలుడు పదార్థాల మోతాదు, అలాగే సెంట్రిఫ్యూజ్‌లు అత్యంత సున్నితంగా కంపనాలకు ప్రతిస్పందించే స్వభావం కలిగి ఉండటం వల్ల చాలా గణనీయమైన నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నాం” అని వివరించారు. ఫోర్డో అణు కేంద్రం ఇరాన్ కీలకమైన యురేనియం శుద్ధి కేంద్రాలలో ఒకటిగా పేరు పొందింది.

Rafael Grossi: అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!

సెంట్రిఫ్యూజ్‌లకు గణనీయమైన నష్టం?

అయితే, ఫోర్డోలోని భూగర్భంలో జరిగిన నష్టాన్ని పూర్తిగా అంచనా వేయగల స్థితిలో ప్రస్తుతం ఐఏఈఏతో సహా మరెవరూ లేరని మిస్టర్ గ్రోస్సీ స్పష్టం చేశారు. “ఈ సమయంలో, ఫోర్డోలోని భూగర్భ నష్టాన్ని పూర్తిగా అంచనా వేయడానికి ఐఏఈఏతో సహా ఎవరి వద్దా కచ్చితమైన సమాచారం లేదు” అని ఆయన అన్నారు. దాడి జరిగిన ప్రదేశానికి తక్షణమే ప్రవేశం లభించే అవకాశాలు తక్కువగా ఉండటంతో, నష్టంపై పూర్తి స్పష్టత రావడానికి కొంత సమయం పట్టవచ్చని తెలుస్తోంది. ఫోర్డో అనేది ఇరాన్ కీలక అణు శుద్ధి కేంద్రాలలో ఒకటి
ఇది భూగర్భంలో నిర్మించబడి ఉండటం వల్ల అత్యంత రహస్యంగా, కట్టుదిట్టమైన భద్రతతో ఉంటుంది. ఫోర్డోలోని సెంట్రిఫ్యూజ్‌లు అత్యంత సున్నితంగా కంపనాలకు ప్రతిస్పందించే విధంగా రూపొందించబడ్డవని గ్రోస్సీ తెలిపారు. పేలుడు పదార్థాల ప్రభావం దృష్ట్యా యురేనియం శుద్ధి సాంకేతికతకు సీరియస్ డామేజ్ జరిగే అవకాశముందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Read Also: India: ఇరాన్, ఇజ్రాయెల్ ఘర్షణలో భారత్ ఎటువైపు?

#telugu News Ap News in Telugu Breaking News in Telugu damaged fordow Google News in Telugu Iran Latest News in Telugu nuclear Paper Telugu News site Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.