📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం

Iran: మొస్సాద్ కు చావు దెబ్బ కొట్టిన ఇరాన్..!

Author Icon By Vanipushpa
Updated: June 18, 2025 • 3:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికాతో ఇరాన్(Iran) అణు ఒప్పంద చర్చలు విఫలం కాగానే ఆ దేశంపై దాడికి దిగిన ఇజ్రాయెల్(Israel) కు ఈ పోరులో గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇరాన్ పై ముందుగా దాడి చేసి రాజధాని టెహ్రాన్(Tehran) పై పట్టు సాధించామని చెప్పుకుంటున్న ఇజ్రాయెల్ కు ఇవాళ చుక్కలు కనిపించాయి. ఆ దేశ నిఘా సంస్థ మొస్సాద్ టార్గెట్ గా ఇరాన్ జరిపిన దాడుల్లో భారీ నష్టం జరిగింది. మొస్సాద్ కేంద్ర కార్యాలయంతో పాటు ఆపరేషన్స్ సెంటర్ కూడా ధ్వంసమయ్యాయి.
ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ మొస్సాద్ కేంద్ర కార్యాలయంతో పాటు ఆపరేషన్ సెంటర్ పైనా తాము క్షిపణి దాడులు చేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. ఈ మేరకు వీడియో ఫుటేజ్ కూడా విడుదల చేసింది. ఇందులో అగ్నికి ఆహుతవుతున్న మొస్సాద్ కేంద్ర కార్యాలయం కనిపించింది. మంటలు ఆర్పుతున్న సిబ్బంది కూడా ఇందులో ఉన్నారు. దాడులతో అక్కడ దట్టమైన పొగలు కమ్ముకున్నట్లు వీడియో పుటేజ్ లో కనిపించింది.

Iran: మొస్సాద్ కు చావు దెబ్బ కొట్టిన ఇరాన్..!

మొస్సాద్ కార్యాలయాన్ని ధ్వంసం
మొస్సాద్ కేంద్ర కార్యాలయం, ఆపరేషన్స్ సెంటర్ లక్ష్యంగా ఇరాన్ మిసైల్ దాడులు చేయడం వెనుక ఓ కీలక కారణం ఉంది. ఇరాన్ అణ్వస్త్రాలు తయారు చేయకుండా అడ్డుకునేందుకు వారి అణుస్ధావరాలు, అణు శాస్త్రవేత్తలపై దాడులు చేసి హతమార్చిన ఇజ్రాయెల్ కు అదే బాటలో వెళ్లి వారి నిఘా సమాచారానికి కీలకమైన మొస్సాద్ కార్యాలయాన్ని ధ్వంసం చేసి ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంది. తద్వారా ఇజ్రాయెల్ చూపిన బాటలోనే వెళ్లి ఆ దేశానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.
ఇజ్రాయెల్ దూకుడుకు ఇరాన్ కళ్లెం
తాజాగా ఇజ్రాయెల్ ఇరాన్ లోని ప్రభుత్వ టెలివిజన్ కార్యాలయంపై దాడులు చేసి ఇద్దరిని బలిగొంది. ఈ దాడికి ప్రతీకారంగానే ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ కేంద్ర కార్యాలయం, ఆపరేషన్ సెంటర్ పై ఇరాన్ దాడులు చేసినట్లు తెలుస్తోంది. మొస్సాద్ ఈ కార్యాలయం నుంచే పక్కా నిఘా సమాచారాన్ని సైన్యానికి ఇవ్వడం ద్వారా ఇరాన్ లో పక్కాగా దాడులు చేస్తోంది. ఇప్పుడు అదే కార్యాలయంపై దాడులతో ఇజ్రాయెల్ దూకుడుకు ఇరాన్ కళ్లెం వేసేందుకు ప్రయత్నించింది.

మొస్సాద్‌పై ఆరోపణలు
ఈ మొత్తం ఆపరేషన్, నిఘా నుంచి హత్య వరకు, ఇజ్రాయెల్ విదేశీ గూఢచార సంస్థ మొస్సాద్ పనేనని ఇరాన్ ఆరోపించింది. ఇజ్రాయెల్ అధికారికంగా బాధ్యత వహించనప్పటికీ, మొస్సాద్ మాజీ చీఫ్ యోస్సీ కోహెన్ తర్వాత కాలంలో ఫఖ్రిజాదే సరైన లక్ష్యమేనని సూచనప్రాయంగా వ్యాఖ్యానించారు. నెలల తరబడి నిఘా పెట్టి, ఆయుధ భాగాలను రహస్యంగా ఇరాన్‌లోకి తరలించి, అక్కడే అమర్చి ఈ హత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటన తర్వాత ఇరాన్ మరింత కఠిన వైఖరి అవలంబించింది, యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని వేగవంతం చేసింది.

Read Also: Khamenei: ఖమేనీ భద్రత, ఆయన వారసత్వంపై పెద్ద ఎత్తున చర్చలు

#telugu News a fatal blow to Mossad..! Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Iran deals Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.