📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Iran: రెండు దేశాల మధ్య యుద్ధంతో నష్టపోయింది ఇరాన్ ప్రజలే

Author Icon By Vanipushpa
Updated: June 25, 2025 • 4:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

”సామాన్య ప్రజలే ఎక్కువగా నష్టపోయారు” అని ఇరాన్‌(Iran)కు చెందిన నూర్జహాన్(Noorjahan) అన్నారు. ” ఈ యుద్ధమంతా ప్లాన్ చేసుకుని కావాలని చేసినట్లు అనిపించింది” అని నూర్జహాన్ అన్నారు. ”ఇజ్రాయెల్, అమెరికా క్షిపణు(Israel, America Nuclear)లు వచ్చి సైనిక, అణు స్థావరాలను ధ్వంసం చేశాయి. ఇరాన్ వెళ్లి అమెరికా స్థావరాలపై కొన్ని మిసైళ్ల(Missiles)తో దాడి చేసింది. ఇక, ఇప్పుడు రెండు వర్గాలు సంతృప్తి చెందాయి. కానీ, ఇక్కడ ఎక్కువగా నష్టపోయింది, బాధపడింది ఎవరంటే ఇరాన్ ప్రజలే.”
దాడుల్లో 606 మంది చనిపోయారు
ఇరాన్ – ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత, భావోద్వేగాల సంఘర్షణకు గురైన లక్షలాది మంది ఇరానియన్లలో నూర్జహాన్ ఒకరు. రెండు దేశాలు 12 రోజుల పాటు దాడులు చేసుకున్న తర్వాత కాల్పుల విరమణ ప్రకటన వచ్చింది. ఈ దాడుల్లో 606 మంది చనిపోయారని ఇరాన్ ఆరోగ్య శాఖ మంత్రి మంగళవారం ప్రకటించారు. అయితే, మరణాల సంఖ్య దీనికి రెట్టింపు ఉంటుందని స్వతంత్ర సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ యుద్ధం ఇరాన్ ప్రజల్లో భయాన్ని, ఆందోళనను, మరికొందరిలో ఆశను రేకెత్తించింది. కొందరు తమ భద్రత, దేశ భవిష్యత్ విషయంలో ఆందోళన చెందితే.. మరికొందరు ఈ సంక్షోభం నిజమైన రాజకీయ మార్పుకు దారితీయనుందా? అని యోచిస్తున్నారు. నూర్జహాన్ మాదిరిగానే మినూ కూడా ఇరాన్ ప్రజలపై ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేశారు.

Israel-Iran: రెండు దేశాల మధ్య యుద్ధంతో నష్టపోయింది ఇరాన్ ప్రజలే

ప్రభుత్వాల దురాశ వల్లే యుద్ధం..పర్వీన్

” నన్ను నిజంగా ఏం భయపెడుతోందంటే.. యుద్ధం సృష్టించే విధ్వంసం, ఆంక్షలు, చతికిలపడ్డ ఆర్థిక వ్యవస్థ.. ఇదంతా ప్రభుత్వాల దురాశ వల్లే” అని పర్వీన్ అనే ఆమె అన్నారు. ”మేం మూల్యం చెల్లించాల్సి వస్తోంది. మా జీవితాలు, మా డబ్బుతో. మేం ఇంకా మూల్యం చెల్లిస్తూనే ఉన్నాం. మేం, ఇరాన్ ప్రజలం అలసిపోయాం. మాకు యుద్ధం వద్దు. మాకు ఈ ఆంక్షలు వద్దు. మాకు ఈ కాల్పుల విరమణ కూడా వద్దు. మేం కోరుకునేదల్లా.. మేం ఎంతో ప్రేమించే ఈ దేశంలో మనశ్శాంతితో జీవించడం” అని మినూ చెప్పారు. ” యుద్ధం, కాల్పుల విరమణ కంటే నన్ను ఎక్కువగా భయపెట్టేది ఏంటంటే.. గాయపడిన, అవమానపడిన ఇస్లామిక్ రిపబ్లిక్‌. అమెరికాపై గెలవలేకపోయారు. ఇక ఇప్పుడు ఇరాన్ ప్రజలపై పడతారు. ఉరిశిక్షలు, వేధింపులను రెట్టింపు చేస్తారు” అని ఆమె అన్నారు. 2022లో విస్తృతంగా వ్యాపించిన ఆందోళనలను అణచివేసేందుకు, అసమ్మతిని అరికట్టేందుకు ఇరాన్ అధికారులు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు.

901 మందికి ఉరిశిక్ష

గత ఏడాది ఇరాన్‌లో సుమారు 901 మందికి ఉరిశిక్ష వేసినట్లు యూఎన్ మానవ హక్కుల విభాగం చీఫ్ చెప్పారు. ” ప్రభుత్వం ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలపై కాకుండా.. మిలిటరీ, అణు సామర్థ్యాలను తిరిగి అభివృద్ధి చేసేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది.” ” ప్రజలకు తాత్కాలికంగా స్వేచ్ఛను ఆఫర్ చేయొచ్చు. కానీ, అదెంతో కాలం ఉండదు.” అని అన్నారు.
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించిన కాల్పుల విరమణ ఒప్పందం మంగళవారం ఉదయం నుంచి అమల్లోకి వచ్చింది. కానీ, ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నట్లు ఇరుదేశాలు ఆరోపణలు చేసుకున్నాయి. ఇరాన్‌లో ఉత్తరంగా ఉన్న మజాందరన్ ప్రావిన్స్‌లో పేలుడు శబ్దాలు వినిపించాయి. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత, తాను యాంగ్జైటీ, గందరగోళానికి గురైనట్లు సారా చెప్పారు. ”కాల్పుల విరమణను నేను నమ్మలేదు, వారి వల్ల అలాంటివి జరగవు” అని అన్నారు.”

కాల్పుల విరమణ ఒప్పందంతో యుద్ధం ముగియదు

‘ ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ బంకర్ నుంచి బయటికి వచ్చేందుకు ఈ కాల్పుల విరమణ ఒక ఉచ్చు” అని కియాన్ చెప్పారు. ఏ ఉద్దేశం లేకుండా ఇజ్రాయెల్, అమెరికాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవని ఆయన అన్నారు. ఈ సంధి ఎక్కువ కాలం ఉంటుందని తాను అనుకోవడం లేదని, త్వరలోనే ఇది ముగిసిపోతుందని చెప్పారు. ” కాల్పుల విరమణ ఒప్పందంతో యుద్ధం ముగియదు. ప్రభుత్వ పతనంతో అది ముగుస్తుంది” అని అన్నారు.

Read Also: Shubhanshu Shukla: శుభాంశు శుక్లా రోదసి యాత్ర.. మోడీ స్పందన ఇదే

#telugu News Ap News in Telugu between Breaking News in Telugu civilians Google News in Telugu in Iran Latest News in Telugu most nations Paper Telugu News suffer Telugu News online Telugu News Paper Telugu News Today two war

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.