📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Iran: ఇజ్రాయెల్ లోని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ను పేల్చేసిన ఇరాన్

Author Icon By Vanipushpa
Updated: June 21, 2025 • 4:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇరాన్- ఇజ్రాయెల్(Iran-Israel) మధ్య వారం రోజులుగా సాగుతున్న యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇరు దేశాలు నువ్వా నేనా అంటూ పోటాపోటీగా విధ్వంసానికి పాల్పడుతున్నాయి. దీంతో అటు ఇజ్రాయెల్.. ఇరాన్ లోని ప్రధాన కార్యాలయాలు, భవనాలు ధ్వంసం అవుతున్నాయి. ఇజ్రాయెల్(Israel) లోని ప్రధాన నగరాలైన టెల్ అవీవ్, హైఫా, భీర్ షెవా లపై ఇరాన్ క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఇరాన్ జరిపిన దాడుల్లో భీర్ షెవాలోని మైక్రోసాఫ్ట్ ఆఫీస్(Microsoft Bulding) భవనం వద్ద క్షిపణి పడినట్లు సమాచారం అందుతోంది. ఈ ఘటనలో టెక్ పార్క్ లోని బిల్డింగ్ స్వల్వంగా ధ్వంసం అయినట్లు సమాచారం.

ఇజ్రాయెల్ లోని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ను పేల్చేసిన ఇరాన్

జూన్ 13న ప్రారంభమైన బహుముఖ దాడులు
జూన్ 13న ఇరాన్(Iran) పై బాలిస్టిక్ మిసైల్స్ తో దాడి చేసింది ఇజ్రాయెల్. అప్పటి నుంచి ఇరు దేశాలు ఒకదానిపై మరొకటి బాంబులతో దాడులు చేసుకుంటూనే ఉంది. తాజాగా ఇజ్రాయెల్ లోని ప్రధాన నగరాలపై టెల్ అవీవ్, హైఫా, భీర్ షెవా లపై ఇరాన్ దాడులకు పాల్పడింది. భీర్ షెవా ప్రాంతం ఇజ్రాయెల్ లోని నెగేవా ఎడారిలో ఉంటుంది. అక్కడే ఇజ్రాయెల్ కు చెందిన నెవాటిమ్ ఎయిర్ బేస్ ఉంటుంది. భీర్ షెవాలోని మైక్రోసాఫ్ట్ కార్యాలయానికి సమీపంలో క్షిపణి పడి ఆ ప్రాంతం మొత్తం ధ్వంసం అయింది.
టెక్ ప్రపంచంపై ప్రభావం
భీర్ షెవా ప్రాంతంలోని అనేక వీధులు అగ్నికీలల్లో చిక్కుకున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఓవైపు జెనీవాలో ఇరు దేశాల మధ్య యుద్ధం ఆపేందుకు చర్చలు ప్రారంభమైనా మరోవైపు భీకర స్థాయిలో ఇజ్రాయెల్- ఇరాన్ దాడులు చేసుకుంటున్నాయి. ఇటీవల ఇరాన్ పై క్షిపణులతో జరిపిన దాడుల్లో కాంగన్ లోని సౌత్ పోర్ట్ సిటీ వద్ద గల సౌత్ పార్స్ చమురు శుద్ధి కేంద్రం ధ్వంసం అయింది. ఇరాన్ ఆయిల్ అండ్ సహజ వాయువు కేంద్రంపై ఇజ్రాయెల్ దాడులు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సౌత్ పార్స్ ఫేజ్ లోని 14 ఆయిల్ రిఫైనరీలపై ఇజ్రాయెల్ డ్రోన్ లు విరుచుకుపడ్డాయి. దీంతో ఈ చమురు శుద్ధి కేంద్రాలన్నీ ధ్వంసం అయ్యాయి.

జనీవాలో శాంతి చర్చలు vs ఫీల్డ్ లో మిలిటరీ దాడులు

ఒకవైపు జనీవాలో శాంతి చర్చలు, మరోవైపు రెండు దేశాలూ పరస్పర ఆస్తులను లక్ష్యంగా మిలిటరీ దాడులకు దిగడమే విశ్లేషకులను ఆందోళనకు గురిచేస్తోంది. దాడులు, సైబర్ ఎత్తుగడలు, ఆర్థిక సంస్థల లక్ష్యాలు ఈ ఘర్షణ పరిధిని విస్తరించచేస్తున్నాయి. ఇజ్రాయెల్ దాడులు – చమురు వాయు కేంద్రాలపై దృష్టి ఇరాన్ లో సౌత్ పార్స్ రిఫైనరీలపై దాడులు. ఇరాన్‌లోని కాంగన్ సిటీ – సౌత్ పార్స్ ఆయిల్ & గ్యాస్ కేంద్రంపై ఇజ్రాయెల్ డ్రోన్ దాడులు చేశారు. ఫేజ్ 14లోని 14 ఆయిల్ రిఫైనరీలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఇది ఇరాన్ ఎక్స్‌పోర్ట్‌కు భారీ దెబ్బ అని భావిస్తున్నారు.

Read Also: Air India: అహ్మదాబాద్ ఘటన ..ముగ్గురిపై వేటుకు సిద్దమైన డీజీసీఏ

#telugu News Ap News in Telugu blows up Breaking News in Telugu Google News in Telugu in Israel Iran Latest News in Telugu Microsoft office Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.